Aavesham OTT: ఫాహద్ ఫాజిల్ యాక్షన్ కామెడీ మూవీ ‘ఆవేశం’ ఓటీటీ పార్ట్‌నర్ ఖరారు-fahad faasil action comedy movie aavesham streaming rights bagged by amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aavesham Ott: ఫాహద్ ఫాజిల్ యాక్షన్ కామెడీ మూవీ ‘ఆవేశం’ ఓటీటీ పార్ట్‌నర్ ఖరారు

Aavesham OTT: ఫాహద్ ఫాజిల్ యాక్షన్ కామెడీ మూవీ ‘ఆవేశం’ ఓటీటీ పార్ట్‌నర్ ఖరారు

Aavesham OTT Platform: ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం సినిమా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. నేడు థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి హిట్ టాక్ వచ్చింది. కాగా, ఈ సినిమా ఓటీటీ హక్కులను ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందో సమాచారం బయటికి వచ్చింది.

Aavesham OTT: ఫాహద్ ఫాజిల్ యాక్షన్ కామెడీ మూవీ ‘ఆవేశం’ ఓటీటీ పార్ట్‌నర్ ఖరారు

Aavesham OTT: మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించిన ‘ఆవేశం’ చిత్రంపై మొదటి నుంచే చాలా ఆసక్తి నెలకొంది. ట్రైలర్ తర్వాత ఈ యాక్షన్ కామెడీ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ ఆవేశం సినిమా నేడు (ఏప్రిల్ 11) మలయాళంలో థియేటర్లలో రిలీజైంది. ఆరంభం నుంచి ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుటోంది. మలయాళంలో మరో బ్లాక్ బస్టర్ పక్కా అనేలా కనిపిస్తోంది. కాగా, ఆవేశం సినిమా ఓటీటీ హక్కులను ఏ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుందో సమాచారం వెల్లడైంది.

ఈ ప్లాట్‍ఫామ్ చేతికి..

ఆవేశం సినిమా ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ చేతికి వెళ్లాయి. ఆ సినిమా డిజిటిల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుంది ప్రైమ్ వీడియో. థియేట్రికల్ రన్‍ తర్వాత స్ట్రీమింగ్‍కు తెచ్చేలా డీల్ చేసుకుంది.

ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వరుసగా బ్లాక్ బస్టర్లు వస్తున్నాయి. భ్రమయుగం, ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా మంజుమ్మల్ బాయ్స్ రికార్డులను తిరగరాసింది. రూ.200 కోట్లు సాధించిన తొలి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఇప్పుడు, ఆవేశం చిత్రానికి కూడా ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోంది. ఇదే కొనసాగితే మరో బంపర్ హిట్ రావడం ఖాయమే.

భ్రమయుగం, ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ చిత్రాలు మలయాళంలో సూపర్ హిట్ అయ్యాక.. తెలుగు వెర్షన్‍లోనూ థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఆవేశం చిత్రం కూడా ఇదే ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం కావొచ్చు. మంజుమ్మల్ బాయ్స్ చిత్రం 40 పూర్తయినా ఓటీటీలోకి రాలేదు. మలయాళంలో థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఏప్రిల్ 12న ఆహా, హాట్‍స్టార్ ఓటీటీల్లోకి ప్రేమలు వస్తోంది. ఒకవేళ ఆవేశం చిత్రానికి లాంగ్ థియేట్రికల్ రన్ ఉండి, వేరే భాషల్లో థియేటర్లలో రిలీజైతే ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి.

ఆవేశం మూవీ గురించి..

ఆవేశం చిత్రంలో లోకల్ గ్యాంగ్‍స్టర్ రంగా పాత్రలో ఫాహద్ ఫాజిల్ నటించారు. ఈ క్యారెక్టర్లో ఆయన మరోసారి నటవిశ్వరూపాన్ని చూపించారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, మన్సూర్ అలీ ఖాన్, చెంబన్ వినోద్, సాజిన్ గోపు కీలకపాత్రలు పోషించారు.

‘రోమాంచం’ ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వం వహించిన ఆవేశం చిత్రాన్ని ఫాదహ్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్, అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్లు నిర్మించాయి. ఫాహద్ ఫాజిల్, ఆయన భార్య, నటి నజ్రియా నజీమ్, అన్వర్ రషీద్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు. సుశీన్ శ్యామ్ సంగీతం అందించారు.

ఆవేశం స్టోరీ లైన్

ఇంజినీరింగ్ చదివేందుకు బెంగళూరు వచ్చే ముగ్గురు యువకులు.. కాలేజీలో సీనియర్ల చేతిలో ర్యాంగింగ్‍కు గురవుతారు. గొడవ జరుగుతుంది. దీంతో ఎలాగైనా సీనియర్లపై పగ తీర్చుకోవాలని లోకల్ గ్యాంగ్‍స్టర్ అయిన రంగ (ఫాహద్ ఫాజిల్) వద్దకు ఆ ముగ్గురు విద్యార్థులు వస్తారు. ఆ తర్వాత రంగ ఏం చేశాడు.. ఏం జరిగిందన్నది ఆవేశం సినిమాలో చూడాలి.