Double Ismart Collection: ఒక్కరోజులో పెరిగిన డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్స్- 4 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?-double ismart 4 days worldwide box office collection ram pothineni double ismart day 4 collection double ismart profit ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Double Ismart Collection: ఒక్కరోజులో పెరిగిన డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్స్- 4 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Double Ismart Collection: ఒక్కరోజులో పెరిగిన డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్స్- 4 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Sanjiv Kumar HT Telugu
Aug 19, 2024 02:50 PM IST

Double Ismart 4 Days Worldwide Collection: రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన కమర్షియల్ యాక్షన్ మూవీ డబుల్ ఇస్మార్ట్. ఆగస్ట్ 15న విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటోంది. కానీ, కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డబుల్ ఇస్మార్ట్ 4 రోజుల కలెక్షన్స్ ఎంతో చూద్దాం.

ఒక్కరోజులో పెరిగిన డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్స్- 4 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ఒక్కరోజులో పెరిగిన డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్స్- 4 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Double Ismart Box Office Collection: డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్‌లో మరోసారి తెరకెక్కిన సినిమా డబుల్ ఇస్మార్ట్. ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కానీ, వసూళ్ల పరంగా మాత్రం పర్వాలేదనిపిస్తోంది.

డబుల్ ఇస్మార్ట్ 4వ రోజు కలెక్షన్స్

డబుల్ ఇస్మార్ట్ మూవీకి ఇండియాలో 4వ రోజున రూ. 1.6 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వాటిలో రూ. 1.35 కోట్లు తెలుగు నుంచి, రూ. 25 లక్షలు హిందీ బెల్ట్ నుంచి వచ్చినట్లు సమాచారం. ఇక మూడో రోజు (రూ. 1.3 కోట్లు నెట్ కలెక్షన్స్)తో పోలిస్తే డబుల్ ఇస్మార్ట్ నికర వసూళ్లు పెరిగాయి.

పెరిగిన వసూళ్లు

డబుల్ ఇస్మార్ట్ సినిమాకు ఇండియాలో నాలుగో రోజు అయిన ఆదివారం (ఆగస్ట్ 18) ఒక్కనాడే 23.08 శాతం వసూళ్లు పెరిగాయి. ఇక ఇండియా వైడ్‌గా ఈ చిత్రానికి నాలుగు రోజుల్లో రూ. 11.75 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. వాటిలో తెలుగు నుంచి రూ. 10.8 కోట్లు, హిందీ నుంచి రూ. 95 లక్షలుగా ఉన్నాయి.

ఓవర్సీస్ కలెక్షన్స్

అలాగే, దేశవ్యాప్తంగా డబుల్ ఇస్మార్ట్ మూవీ 4 డేస్‌లో రూ. 13.80 కోట్ల డొమెస్టిక్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ. 2.40 కోట్లు కొల్లగొట్టింది రామ్ పోతినేని మూవీ. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 4 రోజుల్లో రూ. 16.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే రూ. 10.52 కోట్ల షేర్ కలెక్షన్స్ నమోదు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే

ఇదిలా ఉంటే, డబుల్ ఇస్మార్ట్ మూవీకి ఓవరాల్‌గా రూ. 48 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో రూ. 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది. ఇక ఇప్పటికీ డబుల్ ఇస్మార్ట్ సినిమా 10.52 కోట్ల షేర్ రాబట్టింది. కాబట్టి, డబుల్ ఇస్మార్ట్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను బ్రేక్ చేయాలంటే ఇంకా రూ. 38.48 కోట్లు సాధించాల్సి ఉంటుంది. అప్పుడే నిర్మాతలకు లాభాలు వచ్చే అవకాశం ఉంది.

థియేటర్ ఆక్యుపెన్సీ

అయితే, ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మాత్రం భారీగా ఉన్నట్లు కనిపిస్తోంది. డబుల్ ఇస్మార్ట్ సినిమాకు నాలుగో రోజున (ఆగస్ట్ 18) తెలుగు రాష్ట్రాల్లో 20.94 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఉదయం షోలకు 16.13 శాతం, మధ్యాహ్నం 24.41 శాతం, సాయంత్ర షోలకు 23.07 శాతం, సెకండ్ షోలకు 20.15 శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ వచ్చింది.

విలన్‌గా సంజయ్ దత్

కాగా, డబుల్ ఇస్మార్ట్ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్‌గా నిర్మించారు. ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా హీరోయిన్ కావ్య థాపర్ నటించింది. అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ రోల్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది ఈ మూవీ.