Usha Parinayam: ప్రేమకు నా నిర్వచనం, మూవీ లవర్స్‌కు ఫుల్ మీల్స్.. మన్మథుడు డైరెక్టర్ కామెంట్స్-director k vijaya bhaskar comments in usha parinayam movie teaser release event sree kamal tanvi akaanksha tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Usha Parinayam: ప్రేమకు నా నిర్వచనం, మూవీ లవర్స్‌కు ఫుల్ మీల్స్.. మన్మథుడు డైరెక్టర్ కామెంట్స్

Usha Parinayam: ప్రేమకు నా నిర్వచనం, మూవీ లవర్స్‌కు ఫుల్ మీల్స్.. మన్మథుడు డైరెక్టర్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
May 26, 2024 02:56 PM IST

Director K Vijaya Bhaskar Usha Parinayam Teaser Launch: మన్మథుడు డైరెక్టర్ కే విజయ భాస్కర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఉషా పరిణయం. ఇటీవల జరిగిన ఉషా పరిణయం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ భాస్కర్, హీరో శ్రీ కమల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ప్రేమకు నా నిర్వచనం, మూవీ లవర్స్‌కు ఫుల్ మీల్స్.. మన్మథుడు డైరెక్టర్ కామెంట్స్
ప్రేమకు నా నిర్వచనం, మూవీ లవర్స్‌కు ఫుల్ మీల్స్.. మన్మథుడు డైరెక్టర్ కామెంట్స్

Usha Parinayam Teaser Release Event: తెలుగు సినీ రంగంలో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ కె. విజ‌య భాస్క‌ర్. ఆయన మ‌ళ్లీ ఓ స‌రికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్టారు. నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఉషా ప‌రిణ‌యం అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో సినిమా తెరకెక్కించారు.

ఉషా పరిణయం సినిమాకు 'ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్' అనేది ఉప‌శీర్షిక‌. విజ‌య్‌ భాస్క‌ర్ క్రాఫ్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై విజ‌య భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజ‌య్ భాస్క‌ర్ త‌న‌యుడు శ్రీ‌ క‌మ‌ల్ హీరోగా చేస్తున్నాడు. అలాగే తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ‌ తెలుగ‌మ్మాయి ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతుంది. శ‌నివారం (మే 25) ఉషా పరిణయం మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం జ‌రిగింది.

"ఉషా ప‌రిణ‌యం ప్రేమ‌కు నా నిర్వ‌చ‌నం, ఇదొక మంచి ల‌వ్‌ స్టోరి. సినిమా ల‌వ‌ర్స్‌కు ఫుల్‌మీల్స్‌లా ఉంటుంది. అన్ని ఎమోష‌న్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. ఈ సినిమా నిర్మాణంలో నా టెక్నిషియ‌న్స్‌, ఆర్టిస్ట్‌ల‌తో పాటు నా కుటుంబ స‌భ్యులు కూడా ఎంతో స‌పోర్ట్ చేశారు" అని దర్శకనిర్మాత విజయ భాస్కర్ తెలిపారు.

"ఈ సినిమా సంగీతంలో ధ్రువ‌న్ విశ్వ‌రూపం చూస్తారు. ఈ సినిమా కెరీర్‌లో నిలిచిపోతుంది. మ‌ల్టీ టాలెంటెడ్ ప‌ర్స‌న్ అత‌ను. నేప‌థ్యం సంగీతం కూడా ఎంతో బాగుంటుంది. నా కూతురు శ్యామ‌ల ఈచిత్రానికి హీరో, హీరోయిన్‌కు కాస్య్టూమ్ డిజైన‌ర్‌గా కాకుండా నాకు ఈ ప్రొడ‌క్ష‌న్ విష‌య‌లో ఎంతో హెల్ప్ చేసింది. కో డైరెక్ట‌ర్ కాళేశ్వ‌ర్ స‌హ‌కారం కూడా మ‌రువ‌లేనిది" అని విజయ భాస్కర్ గుర్తు చేసుకున్నారు.

"ఈ చిత్రం హీరోయిన్ తాన్వీ కూడా నా ఫ్యామిలీ మెంబ‌ర్‌. చాలా మంచి బిహేవియ‌ర్, హార్డ్ వ‌ర్కింగ్ ప‌ర్స‌న్‌. క‌మ‌ల్ నేను అనుకున్న పాత్ర‌కు న‌టుడిగా హాండ్రెడ్ ప‌ర్సెంట్ న్యాయం చేశాడు. మళ్లీ అన్ని ఎమోష‌న్స్ మేళ‌వింపుతో ఓ మంచి సినిమాను తీశాన‌న్న కాన్ఫిడెంట్‌గా చెప్ప‌గ‌ల‌ను" అని ఉషా పరిణయం డైరెక్టర్ విజయ భాస్కర్ అన్నారు.

"చిన్న‌ప్ప‌టి నుంచి నాన్న గారికి ద‌గ్గ‌ర స్కూల్ ఎగ్గొట్టానికి అబ‌ద్డాలు చెబుతూ యాక్ట్ చేసేవాడిని. అంద‌రి స‌పోర్ట్‌తో ఈ సినిమా కంప్లీట్ చేశాం. ఆర్ఆర్ ధ్రువ‌న్ ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని ఇచ్చాడు" అని హీరో శ్రీ కమల్ చెప్పుకొచ్చాడు.

"నాకు ఇంత పెద్ద అవ‌కాశం ఇచ్చి.. నా డ్రీమ్ నెర‌వేర్చినందుకు ద‌ర్శ‌కుడుకు కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. అంద‌రితో ప‌నిచేయ‌డం ఎంతో గొప్ప‌గా ఉంది. నాకు ల‌భించిన గొప్ప అవ‌కాశం ఇది. అన్ని ఏజ్ గ్రూప్‌ల‌కు న‌చ్చే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. టీజ‌ర్‌తో పాటు సినిమా కూడా అంద‌రికి న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది" అని హీరోయిన్ తాన్వీ ఆకాంక్ష చెప్పింది.

ఉషా పరిణయం టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ కే విజయ భాస్కర్, హీరో శ్రీ కమల్, హీరోయిన్ తాన్వి ఆకాంక్ష
ఉషా పరిణయం టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ కే విజయ భాస్కర్, హీరో శ్రీ కమల్, హీరోయిన్ తాన్వి ఆకాంక్ష

కాగా ఉషా పరిణయం టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో న‌టుడు సూర్య‌, ర‌వి, శివ‌తేజ‌ల‌తో పాటు ఆర్ఆర్ ధ్రువ‌న్‌, ఫ‌ణి, కాళేశ్వ‌ర్‌, శ్యామ‌ల‌, ముత్యాల స‌తీష్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సినిమాలో శ్రీ ‌క‌మ‌ల్, తాన్వి ఆకాంక్ష‌, ర‌వి, శివ‌తేజ‌, అలీ, వెన్నెల‌ కిశోర్‌, శివాజీ రాజా, ఆమ‌ని, సుధ‌, ఆనంద్ చ‌క్ర‌పాణి, ర‌జిత‌, బాల‌క్రిష్ణ‌, సూర్య, మ‌ధుమ‌ణి ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024