Dil Raju Selfish Movie: వార‌సుడి సినిమాపై దిల్‌రాజు స్పెష‌ల్ కేర్ - హీరోయిన్‌ను మార్చేశాడుగా-dil raju taking extra care of nephew ashish reddy selfish movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dil Raju Selfish Movie: వార‌సుడి సినిమాపై దిల్‌రాజు స్పెష‌ల్ కేర్ - హీరోయిన్‌ను మార్చేశాడుగా

Dil Raju Selfish Movie: వార‌సుడి సినిమాపై దిల్‌రాజు స్పెష‌ల్ కేర్ - హీరోయిన్‌ను మార్చేశాడుగా

Nelki Naresh Kumar HT Telugu
Apr 23, 2023 09:05 AM IST

Dil Raju Selfish Movie: వార‌సుడు ఆశిష్‌కు హిట్ అందించేందుకు అగ్ర నిర్మాత దిల్‌రాజు బ‌లంగానేప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు స‌మాచారం. సెల్పిష్ మూవీ విష‌యంలో దిల్ రాజు స్పెష‌ల్ కేర్ తీసుకుంటున్న‌ట్టు చెబుతోన్నారు.

ఆశిష్, ఇవానా
ఆశిష్, ఇవానా

Dil Raju Selfish Movie: రౌడీ బాయ్స్ సినిమాతో దిల్‌రాజు సోద‌రుడి కుమారుడు ఆశిష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోల‌కు బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన దిల్‌రాజు త‌న వార‌సుడికి మాత్రం ఫ‌స్ట్ మూవీతో విజ‌యాన్ని అందించ‌లేక‌పోయాడు. రౌడీబాయ్స్ క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఆశిష్ కు ఈ సారి ఎలాగైనా స‌క్సెస్ అందించేందుకు దిల్‌రాజు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు చేస్తోన్నాడు.

ప్ర‌స్తుతం సెల్ఫిష్ సినిమాలో ఆశిష్ హీరోగా న‌టిస్తోన్నాడు. విశాల్ కాశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్‌తో క‌లిసి దిల్‌రాజు నిర్మిస్తోన్నాడు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ల‌వ్‌టుడే ఫేమ్ ఇవానాను ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్‌ను శ‌నివారం రిలీజ్ చేశారు. ఈ సినిమాలో చిత్ర అనే పాత్ర‌లో ఇవానా న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అయితే ఇందులో హీరోయిన్‌గా ఇవానా ఫ‌స్ట్ ఛాయిస్ కాద‌ని స‌మాచారం. తొలుత ఈ పాత్రలో అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం ఫేమ్ రితికా నాయ‌క్‌ను హీరోయిన్‌గా ఫైన‌లైజ్ చేసిన‌ట్లు తెలిసింది. కానీ రితికా నాయ‌క్ స్థానంలో ఇవానాను తీసుకున్న‌ట్లు చెబుతోన్నారు. ల‌వ్ టుడే సినిమాతో యూత్ లో ఇవానాకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

ఈ సినిమాను తెలుగులో దిల్‌రాజు రిలీజ్ చేశారు. ఆయ‌న‌కు ఈ రీమేక్ మంచి లాభాల‌ను తెచ్చిపెట్టింది. ఈ రీమేక్ రిలీజ్‌ స‌మ‌యంలోనే ఇవానా యాక్టింగ్‌కు ఇంప్రెస్ అయిన దిల్‌రాజు సెల్పిష్ సినిమాలో ఆమెను హీరోయిన్‌గా సెలెక్ట్ చేసిన‌ట్లు చెబుతోన్నారు.

యూత్‌ఫుల్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న మూవీ కావ‌డంతో ఇవానాకు ఉన్న క్రేజ్ కూడా సెల్పిష్‌కు క‌లిసివ‌చ్చే అవ‌కాశం ఉంద‌నే ఆలోచ‌న‌తోనే రితికా నాయ‌క్ స్థానంలో ఆమెను ఈ సినిమాలోకి తీసుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. కాగా సెల్పిష్ సినిమాను చాలా రోజుల క్రిత‌మే అనౌన్స్‌చేశారు.

కానీ షూటింగ్ మాత్రం చాలా నెమ్మ‌దిగా సాగుతోంది. రౌడీబాయ్స్ విష‌యంలో జ‌ర‌గిన త‌ప్పులు పున‌రావృతం కాకూడ‌ద‌నే ఆలోచ‌న‌లో దిల్‌రాజు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. అందువ‌ల్లే ఈ సినిమా ఆల‌స్య‌మ‌వుతోన్న‌ట్లు చెబుతోన్నారు.

IPL_Entry_Point