Dhanush 3 Movie: తెలుగు రీ రిలీజుల్లో ధ‌నుష్ త్రీ రికార్డ్ - స్ట్రెయిట్ హీరోల కలెక్షన్స్ దాటేసిన డబ్బింగ్ మూవీ-dhanush 3 movie telugu re release day 1 collections tamil dubbing film beats prabhas balakrishna movies collections ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhanush 3 Movie: తెలుగు రీ రిలీజుల్లో ధ‌నుష్ త్రీ రికార్డ్ - స్ట్రెయిట్ హీరోల కలెక్షన్స్ దాటేసిన డబ్బింగ్ మూవీ

Dhanush 3 Movie: తెలుగు రీ రిలీజుల్లో ధ‌నుష్ త్రీ రికార్డ్ - స్ట్రెయిట్ హీరోల కలెక్షన్స్ దాటేసిన డబ్బింగ్ మూవీ

Nelki Naresh Kumar HT Telugu
Sep 15, 2024 04:08 PM IST

తెలుగు రీ రిలీజ్ మూవీస్‌లో ధ‌నుష్ డ‌బ్బింగ్ మూవీ త్రీ రికార్డు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. శ‌నివారం థియేట‌ర్ల‌లో రీ రిలీజైన ఈ మూవీ కోటి న‌ల‌భై ఎనిమిది ల‌క్ష‌ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ వారం రిలీజైన ప‌లు తెలుగు స్ట్రెయిట్ సినిమా కంటే త్రీ మూవీ ఎక్కువ‌గా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

ధనుష్ త్రీ మూవీ
ధనుష్ త్రీ మూవీ

Dhanush 3 Movie: ధ‌నుష్ డ‌బ్బింగ్ మూవీ త్రీ శ‌నివారం థియేట‌ర్ల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తొలిరోజు బాక్సాఫీస్ వ‌ద్ద ఈ ల‌వ్ స్టోరీ కుమ్మేసింది. ఈ వారం రిలీజైన ప‌లు తెలుగు స్ట్రెయిట్ సినిమాల‌కంటే ఎక్కువ‌గా ఈ డ‌బ్బింగ్ మూవీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. శ‌నివారం రోజు ధ‌నుష్ త్రీ సినిమా కోటి న‌ల‌భై ఎనిమిది ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. తెలుగు రీ రిలీజ్ సినిమాల్లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన టాప్ 15 సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

ప్ర‌భాస్‌, బాల‌కృష్ణ సినిమాల కంటే ఎక్కువే...

తెలుగు స్టార్ హీరోల సినిమాల‌ కంటే ఎక్కువ‌గా వ‌సూళ్ల‌ను ధ‌నుష్ త్రీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ప్ర‌భాస్ బిల్లా, బాల‌కృష్ణ చెన్న‌కేశ‌వ‌రెడ్డి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలి ప్రేమ రీ రిలీజ్ సినిమాల క‌లెక్ష‌న్స్‌ను త్రీ మూవీ దాటేసింది. ఆదివారం రోజు కూడా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ యాభై ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. మ‌రో కోటి వ‌ర‌కు ఈ మూవీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మొత్తంగా ధ‌నుష్ త్రీ మూవీ రీ రిలీజ్‌లో రెండున్న‌ర కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ డైరెక్ట‌ర్‌...

త్రీ మూవీకి ధ‌నుష్ మాజీ భార్య ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. ఈ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీలో ధ‌నుష్‌కు జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది. ధ‌నుష్ స్నేహితుడి పాత్ర‌లో శివ‌కార్తికేయ‌న్ క‌నిపించాడు.

వై దిస్ కొల‌వెరీ..

3 మూవీతోనే అనిరుధ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో ధ‌నుష్ స‌మ‌కూర్చిన పాట‌లు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా ధ‌నుష్ పాడిన వై దిస్ కొల‌వెరీ ట్రెండ్ సెట్ఠ‌ర్‌గా నిలిచింది. యూట్యూబ్‌లో హ‌య్యెస్ట్ వ్యూస్‌ను ద‌క్కించుకున్న పాట‌ల్లో ఒక‌టిగా రికార్డ్ క్రియేట్ చేసింది.

2012లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న‌ది. ధ‌నుష్ యాక్టింగ్‌, పాట‌ల‌కు ప్ర‌శంస‌లు ద‌క్కినా సాడ్ ఎండింగ్ క్లైమాక్స్‌ను ప్రేక్ష‌కులు స్వీక‌రించ‌లేక‌పోయారు. ఆ త‌ర్వాత మెల్ల‌గా క‌ల్ట్ ల‌వ్‌స్టోరీగా త్రీ మూవీ నిలిచింది.

త్రీ క‌థ ఇదే...

రామ్ (ధ‌నుష్‌), జ‌న‌ని (శృతిహాస‌న్‌) కాలేజీ రోజుల నుంచి ప్రేమ‌లో ఉంటారు. జ‌న‌ని ప్రాణంగా ప్రేమించిన రామ్ ఆమెను పెళ్లిచేసుకుంటాడు. పెళ్లి త‌ర్వాత అనుకోకుండా రామ్ సూసైడ్ చేసుకుంటాడు. అత‌డి ఆత్మ‌హ‌త్య వెన‌కున్న కార‌ణాల‌ను జ‌న‌ని ఎలా క‌నిపెట్టింది? రామ్‌కు ఉన్న మాన‌సిక స‌మ‌స్య ఏమిట‌నే పాయింట్‌తో ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ త్రీ మూవీని తెర‌కెక్కింది.

రాయ‌న్ వంద కోట్ల క‌లెక్ష‌న్స్‌...

ప్ర‌స్తుతం ధ‌నుష్ త‌మిళంలో బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్‌ల‌తో దూసుకుపోతున్నాడు. ధ‌నుష్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన లేటెస్ట్ మూవీ రాయ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ సినిమాలో కుటుంబ‌మే ప్రాణంగా బ‌తికే వ్య‌క్తి పాత్ర‌లో అస‌మాన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు ధ‌నుష్‌.

ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తెలుగు, త‌మిళ్ బైలింగ్వ‌ల్ మూవీ కుబేర షూటింగ్‌తో ధ‌నుష్ బిజీగా ఉన్నాడు. ఈ యాక్ష‌న్ మూవీలో నాగార్జున కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నాడు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. కుబేర‌తో పాటు త‌మిళంతో హీరో నాలుగు సినిమాల‌కు ధ‌నుష్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.