Devara Collection: రూ. 408 కోట్లు కొల్లగొట్టిన దేవర.. 2 వారాల కలెక్షన్స్ ఇవే! మరి ప్రాఫిట్ ఎంతో తెలుసా?
Devara 14 Days Worldwide Box Office Collection: దేవర మూవీ కలెక్షన్స్ 14వ రోజు కూడా తగ్గిపోయాయి. కానీ, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ దేవర రెండు వారాల్లో బాగానే లాభాలను రాబట్టుకుంది. మరి ఈ నేపథ్యంలో దేవర 14 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఏంటనే పూర్తి వివరాల్లోకి వెళితే..
Devara 2nd Week Box Office Collection: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తొలిసారిగా జోడీ కట్టిన చిత్రం దేవర. ఆచార్య తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ దేవర సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కానీ, బాక్సాఫీస్ వద్ద మంచి పర్ఫామెన్స్ చూపిస్తోంది.
దేవర 2 వారాల కలెక్షన్స్
దేవర చిత్రానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 14వ రోజున రూ. 1.44 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో 14 రోజుల్లో అంటే రెండు వారాల్లో రూ. 143.71 కోట్ల షేర్ కలెక్షన్స్, రూ. 206 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు నివేదికలు తెలిపాయి. వాటిలో నైజాం ఏరియా నుంచి 57.17 కోట్లు రాగా సీడెడ్ నుంచి 27.6 కోట్లుగా ఉన్నాయి.
దేవర 14 డేస్ కలెక్షన్స్
ఇక కర్ణాటకలో 14 రోజుల్లో దేవరకు 17.15 కోట్లు, తమిళనాడు నుంచి 4.07 కోట్లు, కేరళలో 96 లక్షలు, హిందీతోపాటు ఇతర రాష్ట్రాల్లో కలిపి రూ. 32.55 కోట్లు షేర్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. ఓవర్సీస్ ద్వారా 2 వారాల్లో దేవర సినిమాకు 32.55 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇలా అన్నింట్లో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 233.97 కోట్ల షేర్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది దేవర సినిమా.
వరల్డ్ వైడ్ కలెక్షన్స్-లాభాలు
అలాగే, ప్రపంచవ్యాప్తంగా దేవర చిత్రానికి 2 వారాల్లో మొత్తంగా రూ. 408 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. ఇక అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన దేవర చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుని ఇప్పటికీ రూ. 49.97 కోట్ల లాభాలు అర్జించింది. అంతేకాకుండా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
13.75 శాతం పడిపోయిన కలెక్షన్స్
ఇదిలా ఉంటే, దేవర సినిమాకు 14వ రోజున ఇండియా వైడ్‌గా రూ. 3.45 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. వాటిలో తెలుగు నుంచి 2.24 కోట్లు, హిందీ బెల్ట్ ద్వారా 1.15 కోట్లు, కర్ణాటకలో 3 లక్షలు, తమిళనాడులో 2 లక్షలు, మలయాళంలో కేవలం లక్ష మాత్రమే వచ్చాయి. అంతేకాకుండా 13వ రోజుతో పోల్చుకుంటే 14వ రోజున 13.75 శాతం నెట్ కలెక్షన్స్ పడిపోయాయి.
థియేటర్ ఆక్యుపెన్సీ
రెండు వారాల్లో దేవర సినిమా భారతదేశంలో 260.85 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. వాటిలో తెలుగు ద్వారా 193.17 కోట్లు, హిందీలో 58.35 కోట్లు, కర్ణాటక నుంచి 2.04 కోట్లు, తమిళనాడులో 5.94 కోట్లు, మలయాళం నుంచి 1.35 కోట్లుగా ఉన్నాయి. ఇక వరల్డ్ వైడ్‌గా దేవరకు 384.50 కోట్ల నెట్ కలెక్షన్స్ రాగా.. రూ. 308.25 డొమెస్టిక్ గ్రాస్ కలెక్ట్ అయింది.
ఇక జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన దేవర సినిమాకు అక్టోబర్ 10న తెలుగులో 23.64 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.
టాపిక్