Devara Collection: దేవరకు 45 కోట్ల లాభాలు.. మరో కోటి 85 లక్షలు వస్తే ఆ రికార్డ్.. ఎన్టీఆర్ మూవీ 12 డేస్ కలెక్షన్స్ ఇవే!
Devara 12 Days Worldwide Box Office Collection: దేవర సినిమా కలెక్షన్స్ 12వ రోజు కూడా పతనం అయ్యాయి. 11వ రోజున 60.47 శాతం కలెక్షన్స్ తగ్గితే 12వ రోజున 7 శాతం కలెక్షన్స్ తగ్గాయి. అయితే, ఇది 11, 12వ రోజులకు మధ్య ఉన్న తేడా మాత్రమే. ఎన్టీఆర్ దేవర 12 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై లుక్కేస్తే..
Devara Worldwide Collection: దేవర మూవీకి కలెక్షన్స్ తక్కువగా వస్తున్న ఓవరాల్‌గా బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి జోరు చూపిస్తోంది. ఇప్పటికీ కోట్లల్లో లాభాలు గడించిన దేవర సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ నేపథ్యంలో దేవర చిత్రానికి 12 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మలయాళంలో లక్ష
దేవర సినిమాకు ఇండియావైడ్‌గా 12వ రోజున రూ. 4.65 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఇందులో కూడా తెలుగులో రూ. 3.13 కోట్లు, హిందీ నుంచి 1.35 కోట్లు, కర్ణాటక నుంచి నాలుగు లక్షలు, తమిళనాడు వెర్షన్‌కు 12 లక్షలు, మలయాళంలో మాత్రం 1 లక్ష మాత్రమే వసూలు అయ్యాయి. 11వ రోజున తమిళనాడులో లక్ష వస్తే 12వ రోజు మాత్రం మలయాళంలో లక్ష వసూలు అయింది.
ఇక ఓవరాల్‌గా 12 రోజుల్లో భారతదేశంలో దేవర చిత్రానికి రూ. 253 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. వీటిలో తెలుగు నుంచి 188.33 కోట్లు, హిందీ నుంచి 55.95 కోట్లు, కర్ణాటకలో 1.97 కోట్లు, తమిళనాడు నుంచి 5.82 కోట్లు, మలయాళం నుంచి 1.33 కోట్లను రాబట్టింది దేవర. అలాగే, దేశవ్యాప్తంగా రూ. 299.50 కోట్ల డొమెస్టిక్ గ్రాస్ కలెక్షన్స్ సాధించింది దేవర. అంటే సుమారుగా 300 కోట్లు.
దేవర వరల్డ్ వైడ్ కలెక్షన్స్
దేవర పార్ట్ 1 చిత్రానికి తెలుగులో 12వ రోజు అయిన మంగళవారం (అక్టోబర్ 8) నాడు 21.76 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఇదిలా ఉంటే, దేవర చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 374.50 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇదిలా ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో 12వ రోజున దేవరకు రూ. 2.16 కోట్ల షేర్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలు కలిపి 12 రోజుల్లో దేవర మూవీకి రూ. 140.53 కోట్ల షేర్, 200.80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. అలాగే, కర్ణాటక నుంచి రూ. 16.85 కోట్లు, తమిళంలో రూ. 4.05 కోట్లు, కేరళలో 95 లక్షలు, హిందీతోపాటు ఇతర రాష్ట్రాల్లో రూ. 31.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 35.30 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది కొరటాల శివ డైరెక్ట్ చేసిన దేవర చిత్రం.
12 రోజుల్లో గ్రాస్ కలెక్షన్స్
ఇక ప్రపంచవ్యాప్తంగా దేవర ఫిల్మ్‌కు 12 డేస్‌లో రూ. 229.03 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు అయితే.. రూ. 398.15 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే, 400 కోట్ల మార్క్ చేరుకోడానికి ఇంకో 1.85 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ కలెక్షన్స్ వస్తే 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్లబ్‌లో చేరి రికార్డ్ క్రియేట్ చేస్తుంది దేవర సినిమా.
అలాగే, దేవర చిత్రం అతి తక్కువ సమయంలోనే రూ. 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసింది. ఇది పూర్తి కావడంతో దేవర చిత్రానికి వచ్చే కలెక్షన్స్ అన్నీ లాభాల కిందకే వస్తాయి. కాబట్టి, మొత్తంగా ఇప్పటికీ 12 రోజుల్లో దేవర సినిమాకు రూ. 45.03 కోట్ల ప్రాఫిట్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకో ఐదు కోట్లు వస్తే గనుక 50 కోట్ల లాభాలు అందుకున్న సినిమాగా దేవర మరో రికార్డ్ క్రియేట్ చేస్తుంది.