Janhvi Kapoor: అమ్మ లేదు కాబట్టి ఆమె ఆమోదమే తీసుకుంటా.. దేవర బ్యూటి జాన్వీ కపూర్ కామెంట్స్
Janhvi Kapoor About Rekha After Sridevi: తన తల్లి శ్రీదేవి తర్వాత అంతటి ఇంపార్టెన్స్ ఆ సీనియర్ హీరోయిన్‌కు మాత్రమే ఇస్తానని జాన్వీ కపూర్ తెలిపింది. అమ్మ తర్వాత ఆమె ఆమోదం కోసం మాత్రమే ఎదురుచూస్తానని, అలా ఎందుకు చేస్తానో కూడా చెప్పుకొచ్చింది దేవర బ్యూటి జాన్వీ కపూర్.
Janhvi Kapoor About Sridevi: అతిలోక సుందరి శ్రీదేవికి సౌత్, నార్త్‌లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. అంత గ్రేట్ హీరోయిన్ ముద్దుల తనయగా సినిమాల్లోకి అడుగుపెట్టింది బ్యూటిఫుల్ జాన్వీ కపూర్. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఈ సినిమాతో మంచి హిట్ అందుకుంది జాన్వీ కపూర్.
ఆమె మాట మాత్రమే
అయితే, జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి 54 ఏళ్ల వయసులో 2018లో చనిపోయిన విషయం తెలిసిందే. తన సినిమాలకు సంబంధించిన విషయాలపై శ్రీదేవి అంగీకారం ఉంటేనే జాన్వీ చేసేది. తల్లి చెప్పినట్లుగా నడుచుకునేంది జాన్వీ. కానీ, ఇప్పుడు శ్రీదేవి లేనందున ఆమె స్థానంలో మరో సీనియర్ హీరోయిన్ మాట మాత్రమే వింటాను అని జాన్వీ కపూర్ చెబుతోంది.
జాన్వీ కపూర్ పెద్దమ్మగా పిలిచే ఆ సీనియర్ హీరోయిన్ ఎవరో కాదు రేఖ. బాలీవుడ్‌లో క్రేజీ అండ్ పాపులర్ హీరోయిన్‌గా ఒక తరాన్ని ఊపు ఊపేసింది రేఖ. అలాంటి రేఖ అంగీకరిస్తేనే ఏమైనా చేస్తానని జాన్వీ చెప్పింది. తన తల్లి తర్వాత అంత ఇంపార్టెన్స్ పెద్దమ్మ రేఖకు ఇచ్చినట్లు ఇటీవల ఓ ఇంటరాక్షన్‌లో జాన్వీ కపూర్ వెల్లడించింది.
వారిద్దరు సోల్ సిస్టర్స్
శ్రీదేవి హిందీ చిత్ర పరిశ్రమకు కొత్తలో రేఖతో ఉన్న ప్రత్యేక బంధం గురించి జాన్వీ చెప్పింది. అలాగే, తెలుగు సినిమాలకు సంబంధించిన విషయాల గురించి కూడా చెప్పింది. ఫిల్మ్‌ఫేర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ, "అమ్మ, ఆమె (రేఖ) మనసురీత్యా అక్కాచెల్లెళ్లు (సోల్ సిస్టర్స్). అమ్మ మొదట హిందీ సినిమాల్లో చేరి చాలా నష్టపోయినప్పుడు, పెద్దమ్మే (రేఖ) ఆమెకు సపోర్ట్‌గా నలిచింది" అని జాన్వీ తెలిపింది.
"వారు అలా చాలా కాలం స్నేహితులుగా ఉన్నారు. వారు చాలా కాలానికి కలుసుకున్న కూడా వెంటనే కలిసిపోయి చనువుగా మాట్లాడుకునేవారు. నాకు, నా చెల్లెలికి తెలియకుండా వారిద్దరే సీక్రెట్స్ మాట్లాడుకునేవారు. ఆమెను నేను నాకు సుమారుగా 14 ఏళ్లున్నప్పుడు చూశాను. మేము ఉన్నప్పుడు మాకు అర్థం కాకుండా ఉండేందుకు వారు తెలుగులో సీక్రెట్స్ మాట్లాడుకునేవారు" అని జాన్వీ కపూర్ చెప్పింది.
ట్రైలర్ నుంచి రిలీజ్ వరకు
"నా తల్లి మరణించినప్పటి నుంచి నాకు పెద్దమ్మ నుంచి సపోర్ట్ బాగా వచ్చేది. ఆమె నాకు స్థిరంగా నిర్ణయాలు తీసుకునేది. నా తొలి చిత్రం (దఢక్) విడుదల సమయంలో, ట్రైలర్ లాంచ్ నుండి విడుదల వరకు ప్రతి విషయాన్ని ట్రాక్ చేస్తూ నాకు సలహాలు ఇచ్చేది" అని రేఖ గురించి గొప్పగా జాన్వీ కపూర్ తెలిపింది.
"రీసెంట్‌గా రిలీజైన ఉలజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఆడలేదని నేను చాలా బాధపడ్డాను. కానీ, అందులో నా నటన చాలా బాగుందని, అది ఏదో ఒకరోజు నాకు ఉపయోగపడుతుందని, నటిగా ప్రశంసలు తీసుకొస్తుందని ఆమె చెప్పింది. తాను చేసిన కొన్ని సినిమాల్లో ఆమె నటన బాగున్నప్పటికీ అవి ఆడలేదని, కానీ, తర్వాత అవి మంచి పేరు తీసుకొచ్చాయని, నాకు అలాగే జరుగుతుందని పెద్దమ్మ చెప్పింది" అని జాన్వీ కపూర్ పేర్కొంది.
అమ్మ లేదు కాబట్టి
"అమ్మ ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి.. పెద్దమ్మ అంగీకారమే నాకు ముఖ్యమని నేను భావిస్తాను. ఎందుకంటే అమ్మ, ఆమె ఇద్దరూ కళాత్మకంగా, నిర్ణయాత్మకంగా ఒకేలా ఆలోచిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే, అమ్మ తర్వాత నేను పెద్దమ్మ ఆమోదం కోసమే చూస్తాను. ఆమె నా గురించి, నా పని గురించి ఎంత బాగా ఆలోచిస్తుందో నాకు చాలా బాగా తెలుసు. నాకు కావాల్సింది ఏంటో కూడా ఆమెకు బాగా తెలుసు" అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.