Krithi Shetty : సమంతపై నాగచైతన్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్-custody movie actress krithi shetty comments on samantha item song ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krithi Shetty : సమంతపై నాగచైతన్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Krithi Shetty : సమంతపై నాగచైతన్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Anand Sai HT Telugu
May 14, 2023 01:58 PM IST

Krithi Shetty On Samantha : నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయిక. ఆమె సమంతపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.

కృతి శెట్టి
కృతి శెట్టి (Krithi Shetty Instagram)

టాలీవుడ్‌లో డిమాండ్ ఉన్న నటి కృతిశెట్టి(Krithi Shetty). ఎన్నో విభిన్నమైన పాత్రలను అంగీకరిస్తూ దూసుకెళ్తోంది. సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఆమె నటించిన 'కస్టడీ'(Custody) చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్‌లో కృతి శెట్టి పలు విషయాల గురించి మాట్లాడింది. సమంత రూత్ ప్రభు(Samantha Ruth Prabhu) గురించి కృతి శెట్టి చెప్పిన మాటలు చర్చకు దారితీశాయి. సమంతకు సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్ల అనుభవం ఉంది. కృతి శెట్టి అనుభవం తక్కువే. అయినప్పటికీ కృతి శెట్టి కొన్ని కామెంట్స్ చేసింది. ‘ఊ అంటావా మావా..’ లాంటి పాటలో తాను నటించలేనని చెప్పింది.

‘కస్టడీ’ సినిమా ప్రమోషన్లో భాగంగా.. ఆమె ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఆమెకు ఒక ప్రశ్న ఎదురైంది. 'ఊ అంటావా..'లాంటి పాట ఆఫర్ వస్తే ఒప్పుకుంటావా అని కృతి శెట్టిని అడగగా 'నో' చెప్పింది. 'ప్రస్తుతం నేను అలాంటి పాత్రను అంగీకరించడం లేదు. అలాంటి పాత్రలో నటించడం నాకు కష్టంగా ఉంటుంది' అని తెలిపింది. అయితే ఆ పాటలో సమంత(Samantha) నటన కృతికి బాగా నచ్చిందట.

ఐటమ్ సాంగ్స్ లో డ్యాన్స్ విషయంలో నటీమణులకు భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఒకప్పుడు ఐటమ్ డ్యాన్స్ చేయడానికి విడివిడిగా నటీమణులు ఉండేవారు. ఆ తర్వాత కాలం మారింది. స్పెషల్ సాంగ్ లో హీరోయిన్లు డ్యాన్స్ చేయడం ప్రారంభించారు.

ఇక కస్టడీ సినిమా(Custody Cinema) విషయానికి వస్తే.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందించారు. వెంక‌ట్ ప్రభు దర్శకత్వం వ‌హించాడు. ముఖ్యమంత్రి అవినీతి, అక్రమాల‌కు సాక్షిగా నిలిచిన ఓ నేర‌స్తుడిని కోర్టులో అప్పగించే క్రమంలో ఓ నిజాయితీప‌రుడైన పోలీస్ కానిస్టేబుల్ సాగించిన ప్రయాణం నేప‌థ్యంలో దర్శకుడు వెంక‌ట్ ప్రభు క‌స్టడీ సినిమాను తెర‌కెక్కించారు.

క్రైమ్ థ్రిల్లర్ గా తెర‌కెక్కిన ఈ సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో నాగ‌చైత‌న్య(Naga Chaitanya) యాక్టింగ్‌కు ప్రశంసలు ద‌క్కుతోన్నాయి. కానీ రొటీన్ క‌థ‌, క‌థ‌నాల కార‌ణంగా సినిమా యావ‌రేజ్‌గా నిలిచింది. ఇందులో నాగ‌చైత‌న్యకు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టించింది. అర‌వింద్ స్వామి, శ‌ర‌త్‌కుమార్, ప్రియ‌మ‌ణి కీల‌క పాత్రల్లో న‌టించారు.

Whats_app_banner

సంబంధిత కథనం