Krithi Shetty Emotional: ఆ సినిమా చూసి ఏడ్చేశా.. నా మనసుకు బాగా దగ్గరైన చిత్రం.. కృతి స్పష్టం-krithi shetty cried while watching her film bangarraju ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krithi Shetty Emotional: ఆ సినిమా చూసి ఏడ్చేశా.. నా మనసుకు బాగా దగ్గరైన చిత్రం.. కృతి స్పష్టం

Krithi Shetty Emotional: ఆ సినిమా చూసి ఏడ్చేశా.. నా మనసుకు బాగా దగ్గరైన చిత్రం.. కృతి స్పష్టం

Maragani Govardhan HT Telugu
May 12, 2023 02:17 PM IST

Kriti Shetty Emotional: టాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి శెట్టి తన సినిమాలు చూసి ఎమోషనల్ అవుతుందనే సంగతి తెలుసా? అవును ఈ బ్యూటీ తన నటించిన బంగార్రాజు చిత్రం చూసి కంటతడి పెట్టుకున్నానని తెలిపింది.

కృతి శెట్టి
కృతి శెట్టి (Krithi Shetty Instagram)

Krithi Shetty Emotional: సినిమాలో లీనమైన అందులోని భావోద్వేగాలను కూడా నిజంగా ఫీలవ్వడం సహజమే. అందుకే కొన్ని సినిమాల్లో ఎమోషనల్ సీన్లకు మనలో చాలా మంది కంట తడి పెట్టుకుంటారు. సాధారణ ప్రేక్షకులు అలా ఫీలయ్యారంటే ఓ అర్థముంది.. కానీ సెలబ్రెటీలు సైతం వారు నటించిన చిత్రాలను చూసి ఎమోషనల్ అవుతారనే సంగతి మీకు తెలుసా? ఒకవేళ నిజంగా అలా ఫీలైనప్పటికీ.. బయటకు చెప్పేవారు చాలా అరుదుగా ఉంటారు. కానీ ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి మాత్రం ఈ విషయాన్ని బయటకు చెప్పింది. తను ఓ సినిమా చూసి భావోద్వేగానికి గురైనట్లు పేర్కొంది. ఇంతకీ ఆ మూవీ ఏదో కాదు.. ఈ ముద్దుగుమ్మ నటించిన బంగర్రాజు చిత్రం. నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ సినిమాను చూసి కృతి ఎమోషనలైనట్లు తెలిపింది.

"బంగార్రాజు మూవీతో నాకు ఇంటెన్స్ కనెక్షన్ ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ కల్యాణ్ కృష్ణకు ఫోన్ చేసి చాలా సేపు ఏడ్చాను. ఎందుకంటే బంగర్రాజు చిత్రం మన సంప్రదాయాలకు అనుగుణంగా రూపుదిద్దికుంది. అందుకే ఈ మూవీ నా మనసుకు బాగా దగ్గరైంది. మా శెట్టి కుటుంబాల్లో ఓ నమ్మకం ఉంది. మన పూర్వీకులు ఆత్మల రూపంలో ఉంటారని బలంగా నమ్ముతాం. వారు మన యోగ క్షేమాలను చూస్తూ కాపాడుకుంటారని విశ్వసిస్తాం. అందుకే మనం కూడా వాళ్లను ఆరాధిస్తాం. బంగార్రాజు సినిమా చూసినప్పుడు మన పూర్వీకులను, సంస్కృతిని గుర్తుకు తీసుకొచ్చింది. ఈ నమ్మకాలను తెరపై చూసినప్పుడు నేను ఎమోషనల్ అయ్యాను. అందుకే ఏడ్చాను." అని కృతి శెట్టి తెలిపింది.

కృతి శెట్టి తన సినిమాలు చూసి కంటతడి పెట్టుకోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలో ఈ ముద్దుగుమ్మ శ్యామ్ సింగ రాయ్ మూవీ చూసి కూడా ఏడ్చింది. ఇప్పటికీ చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఈ రెండు చిత్రాలు మాత్రం ఆమెను ప్రభావితం చేసినట్లు పేర్కొంది.

కృతి శెట్టి తనకిష్టమైన నటి అనుష్క శెట్టి అని తెలిపింది. బాహుబలిలో దేవసేనగా ఆమె నటన అద్భుతమని పేర్కొంది. అయితే ఈ బ్యూటీకి ఇంతవరకు అనుష్కను వ్యక్తిగతంగా కలిసే అవకాశమే రాలేదట. ప్రస్తుతం కృతి నటించిన కస్టడీ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగచైతన్య ఈ సినిమాలో హీరోగా చేయగా.. కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు.

Whats_app_banner