Hrithik Remuneration: ఒక్క డ్యాన్స్‌కు 2.5 కోట్లా? భారీగా ఛార్జ్ చేసిన బాలీవుడ్ హీరో..!
Hrithik Remuneration: బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఓ పెళ్లిలో డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అయితే ఆ ప్రదర్శకు అతడు ఏకంగా రూ.2.5 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Hrithik Remuneration: బాలీవుడ్ సెలబ్రెటీలైన షారుఖ్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ లాంటి వారు వివాహాల్లో పర్ఫార్మ్ చేసినందుకు గాను భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటారనే సంగతి తెలిసిందే. భారీ పేమెంట్ అంటే ఓ 10 లక్షలో 20 లక్షలో అనుకుంటే మీరు పొరబడినట్లే..? ఏకంగా కోట్లలో పారితోషికం డిమాండ్ చేస్తున్నారంట ఈ స్టార్లు. ప్రముఖుల వివాహ వేదికల్లో వీరి నృత్య ప్రదర్శనల ఆ వేడుకకే హైలెట్‌గా మారుతుండటంతో ఎక్కువగా డబ్బు ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా ఓ వివాహ వేడుకలో సందడి చేసినందుకు గానూ భారీగా పేమెంట్ తీసుకున్నట్లు సమాచారం.
అసలు విషయానికొస్తే ఇటీవలే హృతిక్ ఓ వివాహానికి హాజరై తన పాపులర్ సాంగ్స్ అయిన గుంఘ్రూ, బ్యాంగ్ బ్యాంగ్ అనే పాటలకు పర్ఫార్మ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందించారు. అయితే ఈ పెళ్లిలో హృతిక్ పర్ఫార్మ్ చేసినందుకు అతడికి భారీగా డబ్బు చెల్లించారట. అతడి వ్యాఖ్యతగా వ్యవహరించినందుకు గానూ ఏకంగా 2.5 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం హృతిక్ రోషన్‌కు రూ.2.5 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. దీంతో నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. వ్యక్తిగతంగా హాజరయ్యారా? లేక వృత్తిగతంగా వెళ్లారా? అని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైతేనేం కాసేపు వివాహంలో సందడి చేసినందుకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు మాత్రం తెలుస్తోంది.
ప్రస్తుతం హృతిక్ రోషన్ ఫైటర్ అనే సినిమా చేస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కూడా హృతిక్ భారీగా పారితోషికం తీసుకుంటున్నాడట. దాదాపు రూ.85 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 45 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొంటే దాదాపు రోజుకు 2 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే ఓ పెళ్లికి హాజరైతే ఎంతైతే వస్తుందో ఓ రోజు షూటింగ్‌కు అంత సంపాదిస్తున్నాడట.
టాపిక్