Committee Kurrollu OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ తెలుగు కామెడీ డ్రామా.. ఎప్పుడంటే?-committee kurrollu ott release date etv win to stream the rural comedy drama in september ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Committee Kurrollu Ott: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ తెలుగు కామెడీ డ్రామా.. ఎప్పుడంటే?

Committee Kurrollu OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ తెలుగు కామెడీ డ్రామా.. ఎప్పుడంటే?

Hari Prasad S HT Telugu
Aug 30, 2024 06:45 PM IST

Committee Kurrollu OTT: ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ తెలుగు రూరల్ కామెడీ డ్రామా వచ్చేస్తోంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ఈటీవీ విన్ ఓటీటీయే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. నిహారిక కొణిదెల ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే.

ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ తెలుగు కామెడీ డ్రామా.. ఎప్పుడంటే?
ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ తెలుగు కామెడీ డ్రామా.. ఎప్పుడంటే?

Committee Kurrollu OTT: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ తెలుగు రూరల్ కామెడీ డ్రామా వస్తోంది. ఈ సినిమా పేరు కమిటీ కుర్రోళ్లు. మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక కొణిదెల నిర్మించిన ఈ మూవీ.. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ ఓటీటీ సొంతం చేసుకుంది.

కమిటీ కుర్రోళ్లు ఓటీటీ రిలీజ్

కమిటీ కుర్రోళ్లు మూవీ ఓటీటీ హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకున్నట్లు కొన్ని రోజుల కిందటే వార్తలు రాగా.. తాజాగా శుక్రవారం (ఆగస్ట్ 30) ఆ ఓటీటీయే ఈ విషయాన్ని కన్ఫమ్ చేసింది. అంతేకాదు మూవీని ఎప్పుడు తీసుకురానుందో కూడా తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"ఈ 11 మంది కొత్త కమిటీ కుర్రోళ్లు సెప్టెంబర్ లోనే రాబోతున్నారు.. మన కమిటీ కుర్రోళ్లు బయదెల్లిపోయేరు.. కమిటీ కుర్రోళ్లకు హలో చెప్పండి" అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని తెలిపింది. ఈ సందర్భంగా కమింగ్ సూన్ అంటూ మూవీ పోస్టర్ ను కూడా పోస్ట్ చేసింది.

ఓటీటీ హక్కులకు ఫుల్ డిమాండ్

కమిటీ కుర్రోళ్లు మూవీ ఓ చిన్న సినిమా కావడంతో మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని, ఏ ఓటీటీ హక్కుల కోసం ముందుకు రాలేదని నిర్మాత నిహారిక సక్సెస్ మీట్ లో వెల్లడించింది.

అయితే మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో తర్వాత ఒక్కసారిగా డిమాండ్ పెరిగినట్లు ఆమె చెప్పింది. ఇప్పుడు కూడా ఈటీవీ విన్ ఓటీటీ భారీ మొత్తానికే డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

కమిటీ కుర్రోళ్లు ఎలా ఉందంటే?

కమిటీ కుర్రోళ్లు మూవీ ఓ రూరల్ కామెడీ డ్రామా. ఆగస్ట్ 9న థియేటర్లలో రిలీజై నాలుగు రోజుల్లోనే లాభాల్లోకి దూసుకెళ్లిందంటే ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

క‌మిటీ కుర్రాళ్లు అచ్చ‌మైన‌, స్వ‌చ్ఛ‌మైన ప‌ల్లెటూరి క‌థ‌. ప‌ల్లెటూళ్ల‌లో క‌ల్మ‌షం లేని మ‌నుషులు, వారి స్నేహాలు... అక్క‌డి రాజ‌కీయాలు ఎలా ఉంటాయ‌న్న‌ది ద‌ర్శ‌కుడు య‌దు వంశీ నాచుర‌ల్‌గా ఈ సినిమాలో చూపించారు. ఓ సినిమాలా కాకుండా ఓ ప‌ల్లె వాతావ‌ర‌ణాన్ని క‌ళ్ల ముందు తీసుకొచ్చి ఓ నోస్టాల్జిక్ ఫీలింగ్‌ను క‌లిగించాడు.

క‌మిటీ కుర్రాళ్లు సినిమాలో స్టార్స్ అంటూ ఎవ‌రూ లేరు. అంద‌రూ కొత్త‌వాళ్లే సినిమాలో క‌నిపిస్తారు. ప్ర‌తి పాత్ర గోదావ‌రి మాండ‌లికంలోనే మాట్లాడుతూ క‌నిపిస్తుంది. అదే ఈ సినిమాకు ప్ర‌త్యేక‌తను తీసుకొచ్చింది. మొబైల్స్‌, సోష‌ల్ మీడియా ప్ర‌భావం మొద‌ల‌వ్వ‌ని టైమ్‌లో కుర్రాళ్ల అల్ల‌రి ప‌నులు, ఆట‌లు, ప్రేమాయ‌ణాలు ఎలా ఉండేవ‌న్న‌ది చూపిస్తూ ఫ‌స్ట్ హాఫ్ టైమ్‌పాస్ చేశాడు ద‌ర్శ‌కుడు.

ఈ రూర‌ల్ కామెడీ డ్రామాలో అంత‌ర్లీనంగా రిజ‌ర్వేష‌న్ల కు సంబంధించిన ఓ ఇష్యూను ఎలాంటి వివాదాల‌కు తావులేకుండా ట‌చ్ చేయ‌డం బాగుంది. ప్ర‌తిభ ఉండి చ‌దువుకు కొంద‌రు ఎలా దూరం అవుతున్నార‌నే అంశాన్ని హృద్యంగా ఆవిష్క‌రించాడు. ఆ పాయింట్‌తోనే స్నేహితుల మ‌ధ్య దూరం పెర‌గ‌డం అనే అంశాన్ని రాసుకున్న తీరు ఆక‌ట్టుకుంటుంది.