ETV Win OTT Subscription: ఈటీవీ విన్ ఓటీటీ బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే సబ్‌స్క్రిప్షన్.. మూడు రోజులే..
ETV Win OTT Subscription: ఈటీవీ విన్ ఓటీటీ ఓ బంపర్ ఆఫర్ ఇస్తోంది. తన సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడానికి అతి తక్కువ ధరకే సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ అనౌన్స్ చేసింది. అయితే కేవలం మూడు రోజులు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఇంకేం.. త్వరపడండి.
ETV Win OTT Subscription: తెలుగులోని ప్రముఖ ఓటీటీల్లో ఈటీవీ విన్ కూడా ఒకటి. ఇప్పటికే ఈటీవీ ద్వారా తెలుగు ఛానెల్స్ లో తనదైన ముద్ర వేసిన ఈ సంస్థ నుంచి ఈటీవీ విన్ పేరుతో చాలా రోజుల కిందటే ఓటీటీ వచ్చింది. అయితే తాజాగా ఈ ఓటీటీ మూడు రోజుల పాటు తమ సబ్‌స్క్రిప్షన్ ను కేవలం రూ.29కే ఇస్తున్నామని అనౌన్స్ చేయడం విశేషం.
ఈటీవీ విన్ సబ్‌స్క్రిప్షన్
జియో సినిమా ఓటీటీ కొన్నాళ్ల కిందట కేవలం రూ.29కే నెల రోజుల సబ్‌స్క్రిప్షన్ పేరుతో యూజర్లను ఆకర్షించిన విషయం తెలుసు కదా. ఇప్పుడు ఈటీవీ విన్ కూడా అదే బాటలో నడుస్తోంది. ఈటీవీ 29వ వార్షికోత్సవం సందర్భంగా నెలవారీ కేవలం రూ.29కే తమ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. ఈ విషయాన్ని మంగళవారం (ఆగస్ట్ 27) ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
అయితే ఈ ఆఫర్ కేవలం ఆగస్ట్ 27, 28, 29 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. సాధారణంగా నెలకు రూ.99 వసూలు చేస్తున్న ఈ ఓటీటీ ఈ మూడు రోజుల్లో మాత్రం రూ.29కే సబ్‌స్క్రిప్షన్ ఇవ్వనుంది. ఇక ఏడాది సబ్‌స్క్రిప్షన్ కావాలంటే రూ.499 చెల్లించాల్సి ఉంటుంది.
రోజువారీ సామాన్ల కంటే తక్కువ ధర అంటూ..
"ఈటీవీ విన్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ కేవలం రూ.29 మాత్రమే. మీ రోజువారీ సామాన్ల కంటే తక్కువ ధరలో.. ఈ ఆఫర్ కేవలం ఆగస్ట్ 27, 28, 29 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది" అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ సందర్భంగా ఆ ఓటీటీ పోస్ట్ చేసిన ఫొటో కూడా ఆసక్తికరంగా ఉంది. రోజువారీ మన సామాన్ల కోసం ఎంత పెడుతున్నామో ఒక్కో వస్తువు ధర ఇస్తూ తమ సబ్‌స్క్రిప్షన్ వాటితో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పడం విశేషం. టూత్ పేస్ట్ రూ.70, టీ పౌడర్ రూ.150, ఐస్‌క్రీమ్ రూ.50, ఉల్లిపాయలు రూ.80.. అంటూ ఇలా ఒక్కో వస్తువు ధరను ఇచ్చారు.
ఈటీవీ విన్ ఒరిజినల్స్
ఈటీవీ విన్ ఓటీటీలో తెలుగు వారు మెచ్చే రోజువారీ సీరియల్స్, సినిమాలతోపాటు కొన్ని ఒరిజినల్స్ కూడా ఉన్నాయి. ఈ ఓటీటీ నుంచి #90's వెబ్ సిరీస్ కు మంచి పేరు వచ్చింది. మనల్ని చిన్నతనంలోకి తీసుకెళ్లే ఈ సిరీస్ బాగా ఆకట్టుకుంది. ఇక ఈ మధ్యే ఈ ఓటీటీ నిర్మించిన వీరాంజనేయులు విహారయాత్ర మూవీకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇల్లంటే ఓ కాంక్రీటు కట్టడం కాదు.. ఓ కుటుంబం.. ఓ ఎమోషన్ అని చాటి చెప్పేలా నవ్విస్తూ, భావోద్వేగాలను పంచుతూ సాగిన సినిమా ఇది. ఈ మూవీలో సీనియర్ నటీనటులు నరేష్, శ్రీలక్ష్మి నటించగా.. బ్రహ్మానందం వాయిస్ హైలైట్ గా నిలుస్తోంది.
ఈటీవీ విన్ ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ తోపాటు ఈటీవీలో వచ్చే సీరియల్స్, వివిధ రియాల్టీ షోలను కూడా టీవీ కంటే ముందే చూసే అవకాశం కూడా ఉంటుంది.