Bootcut Balaraju OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న బూట్‌కట్ బాలరాజు.. అనుకున్నదాని కంటే ముందుగానే..-bootcut balaraju ott release date bigg boss sohel movie to stream in aha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bootcut Balaraju Ott Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న బూట్‌కట్ బాలరాజు.. అనుకున్నదాని కంటే ముందుగానే..

Bootcut Balaraju OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న బూట్‌కట్ బాలరాజు.. అనుకున్నదాని కంటే ముందుగానే..

Hari Prasad S HT Telugu
Feb 23, 2024 04:23 PM IST

Bootcut Balaraju OTT Release Date: బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహెల్ నటించిన బూట్‌కట్ బాలరాజు మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. అనుకున్నదాని కంటే ముందుగానే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.

బూట్‌కట్ బాలరాజు మూవీ ఫిబ్రవరి 26 నుంచే ఆహా ఓటీటీలోకి వస్తోంది
బూట్‌కట్ బాలరాజు మూవీ ఫిబ్రవరి 26 నుంచే ఆహా ఓటీటీలోకి వస్తోంది

Bootcut Balaraju OTT Release Date: రొమాంటిక్ ఎంటర్‌టైనర్ బూట్‌కట్ బాలరాజు మూవీ ఓటీటీలోకి వస్తోంది. మరో మూడు రోజుల్లోనే ఈ సినిమా రాబోతుండటం విశేషం. మొదట మార్చి 1 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని భావించారు. కానీ అనుకున్నదాని కంటే ముందే అంటే ఫిబ్రవరి 26 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఆహా ఓటీటీలోకి మూవీ వస్తోంది.

ఆహాలోకి బూట్‌కట్ బాలరాజు

బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ నటించిన ఈ బూట్‌కట్ బాలరాజు మూవీ ఆహా ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని శుక్రవారం (ఫిబ్రవరి 23) అధికారికంగా వెల్లడించారు. సోమవారం (ఫిబ్రవరి 26) సాయంత్రం 6 గంటల నుంచి ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి వచ్చిన బూట్‌కట్ బాలరాజు మూవీని సోహెల్ బాగానే ప్రమోట్ చేశాడు.

కానీ థియేటర్లకు మాత్రం ప్రేక్షకులను రప్పించలేకపోయాడు. రిలీజైన రోజు నుంచే ప్రేక్షకులు ఎవరూ ఈ సినిమాను పట్టించుకోలేదు. దీంతో సోహెల్ మీడియా ముందు కంటతడి పెట్టుకున్నాడు. మంచి కంటెంట్ తో సినిమాలు తీస్తున్నా ప్రేక్షకులు ఆదరించడం లేదని అతడు వాపోయాడు. ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లేకపోవడంతో థియేటర్లలోకి వచ్చిన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

ఆహా ఓటీటీ ఈ మూవీ స్ట్రీమింగ్ వివరాలను అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాలో సోహెల్ తోపాటు మేఘలేఖ, సునీల్, ఇంద్రజ, సిరి హనుమంతులాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. శ్రీ కోనేటి సినిమాను డైరెక్ట్ చేశారు. భీమ్స్ సీసిరోలియో మ్యూజిక్ అందించగా.. మహ్మద్ పాషా నిర్మించాడు.

బూట్‌కట్ బాలరాజుకు ఏమైంది?

ఊరి పెద్ద ప‌టేల‌మ్మ (ఇంద్ర‌జ ) కూతురు మ‌హాల‌క్ష్మిని (మేఘమాల‌) ప్రేమిస్తాడు బాల‌రాజు. వారి ప్రేమ‌కు ప‌టేల‌మ్మ ఒప్పుకోదు. స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో త‌న‌పై పోటీ చేసి గెలిస్తేనే కూతురు మ‌హాల‌క్ష్మిని నీకు ఇచ్చి పెళ్లిచేస్తాన‌ని బాల‌రాజుతో ఛాలెంజ్ చేస్తుంది ప‌టేల‌మ్మ‌. ఆమె ఛాలెంజ్‌ను బాల‌రాజు అంగీక‌రించాడా? స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో గెలిచి మ‌హాల‌క్ష్మి ప్రేమ‌ను సొంతం చేసుకున్నాడా? లేదా? అన్న‌దే బూట్ క‌ట్ బాల‌రాజు మూవీ క‌థ‌. బూట్ క‌ట్ బాల‌రాజు సినిమాలో బిగ్‌బాస్ బ్యూటీ సిరిహ‌నుమంతు ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించింది.

సోహెల్ కామెడీ బాగున్నా క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. పేద‌, ధ‌నిక అంత‌రాల‌తో ద‌ర్శ‌కుడు శ్రీ కోనేటి ఈ మూవీని తెర‌కెక్కించాడు. బిగ్‌బాస్ సీజ‌న్ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు సోహెల్‌. ఫైన‌ల్ చేరుకున్న అత‌డు టాప్ త్రీలో ఒక‌రిగా నిలిచాడు. కానీ ఇర‌వై ఐదు ల‌క్ష‌ల క్యాష్ తీసుకొని సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు.

బిగ్‌బాస్ ద్వారా వ‌చ్చిన క్రేజ్‌తో బిగ్‌బాస్ సోహెల్‌కు వ‌రుస‌గా సినిమా అవ‌కాశ‌లొచ్చాయి.ఆర్గానిక్ మామా హైబ్రీడ్ అల్లుడు, ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌, మిస్ట‌ర్ ప్రెగ్నెంట్ సినిమాలు డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. ఆ లిస్ట్‌లో బూట్‌క‌ట్ బాల‌రాజు కూడా చేరింది. ఈ ప‌రాజ‌యాల‌తో సంబంధం లేకుండా సోహెల్ మ‌రో మూడు సినిమాల్లో న‌టిస్తోన్న‌ట్లు స‌మాచారం.

Whats_app_banner