Antony OTT: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?-antony telugu version ott streaming on aha joju george kalyani priyadarshan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Antony Ott: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Antony OTT: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Feb 23, 2024 04:13 PM IST

Antony OTT Streaming: మలయాళం నుంచి వచ్చిన క్రైమ్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్రర్ మూవీ ఆంటోనీ. జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాపులర్ యాక్టర్ జోజు జార్జ్ ప్రధాన పాత్ర పోషించారు. డిసెంబర్ 2023లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్..  తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Antony OTT Release: మలయాళంలో మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ వస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్య జోజు జార్జ్ (ఆది కేశవ మూవీ విలన్) సినిమాలకు డిమాండ్ ఎక్కువగా పెరిగింది. గత ఏడాది వచ్చిన ‘ఆంటోని’ చిత్రంలో జోజు జార్జ్ టైటిల్ రోల్‌లో పోషించాడు. అలాగే ఈ సినిమాలో బ్యూటిఫుల్ కల్యాణి ప్రియదర్శన్ నటించింది. ఈ సినిమాలో జోజు జార్జ్, కల్యాణి ప్రియదర్శన్ నటన గురించి సోషల్ మీడియాలో బాగానే చర్చలు జరిగాయి.

అంతేకాకుండా ఆంటోనీ సినిమా మాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకుంది. 2023 డిసెంబర్‌లో విడుదలైన ఆంటోనీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. దీంతో తెలుగు ఆడియెన్స్ ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూశారు. ఎట్టకేలకు ఓటీటీలో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఫిబ్రవరి 23 నుంచి అంటే శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది ఆంటోనీ మూవీ.

ఇక తెలుగు ఆడియెన్స్ ఆహాలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను చూసి ఆనందించొచ్చు. ఈ చిత్రం గత ఏడాది అంటే.. డిసెంబర్ 1, 2023న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మంచి రివ్యూలతో పాటు, కలెక్షన్లు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు తెలుగులో ఓటీటీ ఆడియెన్స్‌ను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. అయితే, ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఆంటోనీ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, అది మలయాళ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది.

కానీ, ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం ఆంటోనీ తెలుగు వెర్షన్ ఆహాలో రిలీజైంది. ఇదిలా ఉంటే ఆంటోనీ సినిమా ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ మీద సాగుతుంది. ఈ మూవీలో టైటిల్ రోల్‌లో జోజు జార్జ్ నటించారు. రాజేష్ వర్మ అందించిన కథతో జోషి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్, చెంబన్ వినోద్ జోస్, నైలా ఉష, ఆశా శరత్, అప్పని శరత్, విజయరాఘవన్ వంటి వారు నటించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతమందించగా.. సినిమాటోగ్రఫర్‌గా రెనాదివ్, ఎడిటర్‌గా శ్యామ్ శశిధరన్ పని చేశారు.

కాగా జోజు జార్జ్ పేరుకు మలయాళంలో పాపులర్ యాక్టర్ అయినా ఆయన సినిమాలకు తెలుగులోనూ క్రేజ్ ఉంది. అతని నటన ప్రతిభ చూసి తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. ఇటీవలే పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఆది కేశవ సినిమాలో విలన్‌గా నటించారు జోజు జార్జ్. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో జోజు జార్జ్ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ ప్లాప్‌గా నిలిచినట్లు అయింది.

ఇక కల్యాణి ప్రియదర్శన్ తెలుగులో హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన హలో మూవీలో కల్యాణి హీరోయిన్‌గా డెబ్యూ ఇచ్చింది. తర్వాత సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి, శర్వానంద్ రణరంగం సినిమాల్లో నటించింది. వీటిలో చిత్రలహరి మంచి హిట్‌గా నిలిచింది. ఇటీవలే హృదయం అనే మలయాళ మూవీలో నటించి ఆకట్టుకుంది కల్యాణి ప్రియదర్శన్.

Whats_app_banner