Boomer Uncle OTT Release Date: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న మరో సూపర్ హిట్ కామెడీ మూవీ-boomer uncle ott release date yogi babus tamil comedy movie to stream on aha tamil from june 7th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Boomer Uncle Ott Release Date: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న మరో సూపర్ హిట్ కామెడీ మూవీ

Boomer Uncle OTT Release Date: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న మరో సూపర్ హిట్ కామెడీ మూవీ

Hari Prasad S HT Telugu
Jun 05, 2024 08:54 AM IST

Boomer Uncle OTT Release Date: ఓటీటీలోకి మరో సూపర్ హిట్ కామెడీ మూవీ వచ్చేస్తోంది. తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు నటించిన బూమర్ అంకుల్ మూవీ రెండు నెలల తర్వాత ఓటీటీలో అడుగుపెడుతోంది.

రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న మరో సూపర్ హిట్ కామెడీ మూవీ
రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న మరో సూపర్ హిట్ కామెడీ మూవీ

Boomer Uncle OTT Release Date: కమెడియన్ యోగి బాబు లీడ్ రోల్లో నటించిన మూవీ బూమర్ అంకుల్. ఈ సినిమా మార్చి 29న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ తమిళ కామెడీ మూవీ ఇప్పుడు ఆహా తమిళ్ ఓటీటీలో అడుగుపెడుతోంది. ఈ సినిమాను స్వదీస్ ఎమ్మెస్ డైరెక్ట్ చేశాడు.

బూమర్ అంకుల్ ఓటీటీ రిలీజ్ డేట్

బూమర్ అంకుల్ ఓ తమిళ కామెడీ మూవీ. ఈ సినిమా శుక్రవారం (జూన్ 7) నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీయే తమ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. "తోజర్‌గాలే (కామ్రేడ్స్) అసెంబుల్.. బూమర్ అంకుల్ ఆహా తమిళ్ లో జూన్ 7 నుంచి" అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని వెల్లడించింది. తమిళంలోనే ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.

ఏంటీ బూమర్ అంకుల్ మూవీ?

బూమర్ అంకుల్ మూవీ కామెడీతోపాటు మంచి థ్రిల్ పంచుతుంది. ఈ సినిమా మొత్తం నేసమ్ (యోగి బాబు), అతని విదేశీ భార్య అమీ చుట్టూ తిరుగుతుంది. ఆమెతో విడాకుల ఒప్పందాన్ని ఫైనలైజ్ చేయడం కోసం అతడు తన పూర్వీకులు వదిలి వెళ్లిన ఇంటికి వెళ్తాడు. అయితే అతనితోపాటు అక్కడి వెళ్లిన అమీ మాత్రం మరో మిషన్ పై ఉంటుంది.

నేసమ్ తండ్రి చేసిన శాస్త్రీయ ప్రయోగాల గుట్టు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆమె అక్కడికి వెళ్తుంది. వీళ్లతోపాటు ఒకప్పుడు అక్కడ పని చేసిన వాళ్లు కూడా మరో ఎజెండాతో అక్కడికి వెళ్తారు. ఆ ఇంట్లో వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్నదే ఈ సినిమా స్టోరీ. ఈ మూవీలో యోగిబాబుతోపాటు ఒవియా, సతీష్ మోషన్, రోబో శంకర్ లాంటి వాళ్లు నటించారు.

ఈ వారం ఓటీటీ రిలీజెస్

ఈ వారం కూడా భారీగానే సినిమాలు, వెబ్ సిరీస్‍లు వచ్చేస్తున్నాయి. వివిధ జానర్ల చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టున్నాయి. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన రెండు బాలీవుడ్ చిత్రాలు ఈవారంలో ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్నాయి. మలయాళ సూపర్ హిట్ వర్షంగల్కు శేషం కూడా స్ట్రీమింగ్‍కు రానుంది.

బడే మియా చోటే మియా - నెట్‌ఫ్లిక్స్ - జూన్ 6

షూటింగ్ స్టార్ట్స్ - ఇంగ్లిష్ మూవీ - నెట్‍ఫ్లిక్స్ - జూన్ 3

హిట్ మ్యాన్ - ఇంగ్లిష్ సినిమా - నెట్‍ఫ్లిక్స్ - జూన్ 7

హౌటూ రాబ్ ఏ బ్యాంక్ - ఇంగ్లిష్ సినిమా - నెట్‍ఫ్లిక్స్ - జూన్ 5

హిట్లర్ అండ్ నాజీస్ - ఇంగ్లిష్ వెబ్ సిరీస్ - నెట్‍ఫ్లిక్స్ - జూన్ 5

స్వీట్ ట్రూత్ - వెబ్ సిరీస్ - నెట్‍ఫ్లిక్స్ - జూన్ 6

మైదాన్ - ప్రైమ్ వీడియో (జూన్ 5)

బ్లాకౌట్ - జియో సినిమా (జూన్ 7)

వర్షంగల్కు శేషం - సోనీలివ్ (జూన్ 7)

గుల్లక్ సీజన్ 4 వెబ్ సిరీస్ - సోనీలివ్ (జూన్ 7)

Whats_app_banner