Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..-heeramandi season 2 on cards director sanjay leela bhasali and actor adhyayan suman drops hints netflix ott web series ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
May 19, 2024 10:59 PM IST

Heeramandi Season 2: హీరామండి వెబ్ సిరీస్‍కు రెండో సీజన్ వస్తుందా అనే విషయంపై ఆసక్తి నెలకొని ఉంది. ఈ అంశంపై డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తాజాగా స్పందించారు. నటుడు అధ్యాయన్ కూడా ఈ విషయంపై మాట్లాడారు.

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..
Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

Heeramandi Season 2: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ‘హీరామండి: ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినా రికార్డు స్థాయి వ్యూస్‍తో దూసుకెళుతోంది. బాలీవుడ్‍లో చాలా సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన భన్సాలీకి ఇది తొలి ఓటీటీ వెబ్ సిరీస్‍గా ఉంది. పీరియాడిక్ డ్రామా సిరీస్‍గా హీరామండిని తెరకెక్కించారు. మే 1వ తేదీన ఈ వెబ్ సిరీస్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, ఈ హీరామండి సిరీస్‍కు రెండో సీజన్ ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై చర్చ సాగుతోంది. ఈ తరుణంలో ఈ విషయంపై స్పందించారు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఈ సిరీస్‍లో నటించిన అధ్యాయన్ సుమన్ కూడా ఓ హింట్ ఇచ్చారు.

నేను రెడీ

హీరామండి సీజన్ 2 చేయాలని తనకు ఉందని డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ చెప్పారు. అయితే, నెట్‍ఫ్లిక్స్ ఈ విషయంలో అంగీకరించాల్సి ఉందని అన్నారు. నెట్‍ఫ్లిక్స్ ఓకే అంటే తాను రెడీ అన్నట్టు చెప్పారు.

హీరామండి రెండో సీజన్ చేయాలన్న విషయంలో ముందుగా నెట్‍ఫ్లిక్స్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని భన్సాలీ తెలిపారు. “తొలి సీజన్‍ను ప్రేమిస్తున్న అందరికీ థ్యాంక్స్. రెండో సీజన్‍ ఉంటుందా లేదా అనేది నెట్‍ఫ్లిక్స్ ఓటీటీపై ఆధారపడి ఉంటుంది. ముందుకు వెళ్లాలనుకుంటే నెట్‍ఫ్లిక్స్ ప్రకటిస్తుంది. రెండో సీజన్ చేయాలనే నిర్ణయం ముందుగా నెట్‍ఫ్లిక్స్ నిర్మాతల నుంచే రావాలి” అని సంజయ్ లీలా భన్సాలీ చెప్పినట్టు బాలీవుడ్ హంగామా రిపోర్ట్ వెల్లడించింది.

సంజయ్ లీలా భన్సాలీ తదుపరి ‘లవ్ అండ్ వార్’ అనే మూవీని తెరకెక్కించనున్నారు. రణ్‍బీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియాభట్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించనున్నారు. అయితే, రణ్‍బీర్ ప్రస్తుతం రామాయణం చిత్రంతో బిజీగా ఉండటంతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం మరింత ఆలస్యం కానుందనే అంచనాలు ఉన్నాయి.

‘సీజన్ 2 ఉంటుంది’

హీరామండి సీజన్ 2 ఉంటుందనేలా ఈ సిరీస్‍లో నటించిన ఆధ్యాయన్ సుమన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హీరామండి 2 గురించి భన్సాలీ తనతో అనధికారికంగా మాట్లాడారని ఆధ్యాయన్ వెల్లడించారు. సీజన్ 2 ఉంటుందని చెప్పారు. ఈ సిరీస్‍లో జొరావల్ అలీ ఖాన్, ఇమాద్ పాత్రల్లో ఆధ్యాయన్ నటించారు.

హీరామండి వెబ్ సిరీస్‍లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరి, షార్మీన్ సేగల్, సంజీదా షేక్ ప్రధాన పాత్రలు పోషించారు. భారత స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలన కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో ఈ సిరీస్ తెరకెక్కింది. హీరామండి ప్రాంతంలోని వేశ్యావాటికపై ఆధిపత్యం కోసం జరిగే ప్రయత్నాలు, పోరు, కుట్రలతో ఈ సిరీస్ స్టోరీ సాగింది.

హీరామండి వెబ్ సిరీస్‍కు దర్శకత్వం వహించిన సంజయ్ లీలా భన్సాలీ నిర్మాతగానూ వ్యవహరించారు. సుమారు రూ.200కోట్ల భారీ బడ్జెట్‍తో ఈ సిరీస్‍ను రూపొందించారు. హీరామండిపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు ప్రేక్షకులు ఈ సిరీస్‍ను ప్రశంసిస్తే.. మరికొందరు ప్రతికూలంగా స్పందించారు. భారీతనం తప్ప ఈ సిరీస్ ఆసక్తికరంగా లేదనే కామెంట్లు వినిపించాయి. అయితే, హీరామండిలో డ్రామా చాలా బాగుందని, భన్సాలీ మార్క్ కనిపించిందని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇలా మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే, నెట్‍ఫ్లిక్స్‌లో మాత్రం రికార్డుస్థాయి వ్యూస్‍ను దక్కించుకుంటోంది. హిందీలో రూపొందిన హీరామండి సిరీస్ తెలుగు సహా మరిన్ని భాషల డబ్బింగ్‍లోనూ అందుబాటులో ఉంది.

Whats_app_banner