Biggest Flop Actor: చేసింది 270 సినిమాలు.. 180 ఫ్లాపులే.. ఇండియా బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరో ఇతడే..
Biggest Flop Actor: కెరీర్లో 270 సినిమాలు చేసినా.. అందులో 180 ఫ్లాపులే. అయినా ఇండియాలో ఓ సూపర్ స్టార్ గానే నిలుస్తున్నాడు ఈ బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరో. ఓ స్టార్ హీరో కెరీర్లో ఇన్ని ఫ్లాపులు ఇవ్వడం మామూలు విషయం కాదు.
Biggest Flop Actor: ఇండియాలో సూపర్ స్టార్లు, మెగాస్టార్లు ఎంతో మందే ఉన్నారు. ఇండస్ట్రీలకు అతీతంగా బిగ్గెస్ట్ హిట్స్ అందించిన ఎంతో మంది హీరోలు మనకు తెలుసు. కానీ ఓ హీరో ఉన్నాడు. అతడు తన కెరీర్లో 270 సినిమాలు చేయగా.. అందులో ఏకంగా 180 ఫ్లాపులే. అయినా బాలీవుడ్ లోనే కాదు దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ హోదాను అనుభవిస్తున్నాడు.
బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరో మిథున్
1980, 90ల్లో అప్పటి హీరోలు ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేసేవారన్న సంగతి తెలుసు కదా. అలా బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కూడా హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లాడు. చివరికి ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక ఫ్లాప్ మూవీస్ మూటగట్టుకున్న హీరోగా నిలిచిపోయాడు.
కెరీర్ మొత్తంలో మిథున్ చక్రవర్తి 270 సినిమాల్లో నటించగా.. అందులో 180 బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. వీటిలోనూ 133 సినిమాలు ఫ్లాప్ కాగా.. మరో 47 డిజాస్టర్లుగా మిగిలిపోవడం గమనార్హం. అయితే అతడు ఐదు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలోనూ కొనసాగుతూ సూపర్ స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు.
మిథున్.. వరుసగా 33 ఫ్లాపులు
మిథున్ చక్రవర్తి అత్యధిక ఫ్లాపు సినిమాలే కాదు.. వరుసగా ఎక్కువ ఫ్లాపులు ఇచ్చిన హీరోగా కూడా ఓ అపవాదును మూటగట్టుకున్నాడు. 2000 మొదట్లో మొదలైన మిథున్ ఫ్లాపుల పరంపర 2007 వరకు కొనసాగింది. ఈ మధ్య కాలంలో మిథున్ కు చెందిన 33 సినిమాలు వరుసగా ఫ్లాపులుగా మిగిలిపోయాయి.
2007లో వచ్చిన గురు మూవీలో మిథున్ నటించగా.. అది హిట్ అయింది. హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా మిథున్ 1980, 90ల్లో ఏడాదికి పదుల సంఖ్యలో మూవీస్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. అందులో ఎన్నో బీ గ్రేడ్ యాక్షన్ సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో చాలా వరకు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా మిగిలిపోయాయి.
మిథున్.. సూపర్ స్టారే..
ఇండియాలో అత్యధిక ఫ్లాప్ సినిమాల్లో నటించిన హీరోగా ఓ చెత్త రికార్డు తన పేరిట ఉన్నా.. మిథున్ చక్రవర్తి ఇప్పటికీ ఓ సూపర్ స్టారే. తన తొలి సినిమా మృగయాతోనే నేషనల్ అవార్డును అతడు సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా 1980ల్లో మిథున్ హవా బాగా నడిచింది. ఆ దశాబ్దంలో అత్యధిక వసూళ్లు సాధించిన డిస్కో డ్యాన్సర్ మూవీ అతనిదే.
కెరీర్లో 60 హిట్ మూవీస్ లో మిథున్ నటించాడు. సోలో హీరోగా నటించడంతోపాటు మల్టీ స్టారర్స్ తోనూ హిట్స్ సొంతం చేసుకున్నాడు. ఇక తన డ్యాన్స్ లతో ప్రత్యేకంగా అభిమానులను సంపాదించిన ఘనత అతని సొంతం.
హిందీ సినిమాలో మిథున్ తర్వాత 106 ఫ్లాపులతో జితేంద్ర రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మరో సీనియర్ నటుడు ధర్మేంద్ర కెరీర్లో 99 ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. గోవిందా 75 ఫ్లాప్స్, సంజయ్ దత్ 70, అనిల్ కపూర్ 55 ఫ్లాప్ మూవీస్ అందించారు.