Shubman Gill Ananya Panday: బాలీవుడ్ హీరోయిన్‌ను హగ్ చేసుకున్న శుభ్‌మన్.. రియాన్ పరాగ్‌ను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్..-shubman gill hugs ananya panday fans trolling other team india cricketer riyan parag know why ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shubman Gill Ananya Panday: బాలీవుడ్ హీరోయిన్‌ను హగ్ చేసుకున్న శుభ్‌మన్.. రియాన్ పరాగ్‌ను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్..

Shubman Gill Ananya Panday: బాలీవుడ్ హీరోయిన్‌ను హగ్ చేసుకున్న శుభ్‌మన్.. రియాన్ పరాగ్‌ను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్..

Hari Prasad S HT Telugu
Sep 12, 2024 02:53 PM IST

Shubman Gill Ananya Panday: బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేను క్రికెటర్ శుభ్‌మన్ గిల్ హగ్ చేసుకున్నాడు. కానీ మరో టీమిండియా క్రికెటర్ రియాన్ పరాగ్ ను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అసలు దీనికి లింకేంటో మీకేమైనా తెలిసిందా?

బాలీవుడ్ హీరోయిన్‌ను హగ్ చేసుకున్న శుభ్‌మన్.. రియాన్ పరాగ్‌ను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్..
బాలీవుడ్ హీరోయిన్‌ను హగ్ చేసుకున్న శుభ్‌మన్.. రియాన్ పరాగ్‌ను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్.. (X)

Shubman Gill Ananya Panday: బాలీవుడ్ నటి అనన్య పాండే, టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కలిసి ఈ మధ్యే ఓ యాడ్ లో నటించారు. ఈ సందర్భంగా ఇద్దరూ హగ్ చేసుకున్నారు. అయితే ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ కొంతమంది మరో క్రికెటర్ రియాన్ పరాగ్ ను ఏడిపిస్తున్నారు. ఇలా చేయడానికి ఓ బలమైన కారణమే ఉంది.

గిల్, అనన్య యాడ్

టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్, అనన్య పాండే కలిసి బీట్స్ ఇయర్ ఫోన్స్ యాడ్ చేశారు. ఈ సందర్భంగా బిహైండ్ ద సీన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో యాడ్ లో నటించడానికి ముందు గిల్ ను కలిసి అనన్య.. ఎలా ఉన్నావంటూ అతన్ని హగ్ చేసుకుంది. ఈ వీడియో వైరల్ గా మారింది.

సాధారణంగా ఓ క్రికెటర్, బాలీవుడ్ నటి కలిసి ఇలా యాడ్స్ చేయడం ఇదేమీ కొత్త కాదు. ఇలా చేసినప్పుడల్లా సోషల్ మీడియాలో ఏవో పుకార్లు రావడమూ కొత్త కాదు. కానీ ఈసారి మాత్రం సీన్ మరోలా ఉంది. గిల్, అనన్య హగ్ కాస్తా టీమిండియా క్రికెటర్ రియాన్ పరాగ్ ను ట్రోలింగ్ బారిన పడేలా చేసింది.

రియాన్ పరాగ్‌ను ఏడిపిస్తున్న ఫ్యాన్స్

ఈ ఫొటోలు, వీడియోలు చూసిన అభిమానులు రియాన్ పరాగ్ ను ఏడిపిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే.. గతంలో ఇదే పరాగ్ ఇదే బాలీవుడ్ నటి అనన్య పాండేతోపాటు సారా అలీ ఖాన్ హాట్ వీడియోలు కావాలంటూ యూట్యూబ్ లో సెర్చ్ చేసిన హిస్టరీ బయటకు వచ్చిన సంగతి తెలుసు కదా.

దానిని పరోక్షంగా గుర్తు చేస్తూ పరాగ్ ను ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇటు గిల్, అనన్య హగ్ చేసుకుంటుంటూ.. అటు పరాగ్ ఏడుస్తున్నాడంటూ కొందరు కామెంట్స్ చేశారు. గతంలో పరాగ్ ఓ లైవ్ స్ట్రీమింగ్ సమయంలో యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు అతని సెర్చ్ హిస్టరీ ఓ నెటిజన్ కంట పడింది.

అందులో బాలీవుడ్ హీరోయిన్ల హాట్ వీడియోల కోసం పరాగ్ సెర్చ్ చేసినట్లు తేలింది. అప్పట్లోనే పరాగ్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఇప్పుడు గిల్, అనన్య వీడియోతో ఈ ట్రోలింగ్ మరో రేంజ్ కు వెళ్లింది. మరోవైపు పరాగ్ ఈ మధ్యే దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఎ, ఇండియా బి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆడాడు.

గిల్, పరాగ్ ఏం చేస్తున్నారంటే?

శుభ్‌మన్ గిల్ దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఎ టీమ్ తరఫున ఆడాడు. అయితే బంగ్లాదేశ్ తో తొలి టెస్ట్ ఈ నెల 19న ప్రారంభం కానున్న నేపథ్యంలో అతన్ని రిలీజ్ చేశారు. ఇప్పుడతడు బంగ్లా సిరీస్ లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఈ స్థానంలో ఇప్పటి వరకూ 9 ఇన్నింగ్స్ ఆడిన గిల్ రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో 452 రన్స్ చేశాడు.

బంగ్లాతో సిరీస్ లో రోహిత్, యశస్వి ఓపెనింగ్ చేయనుండా.. గిల్ మూడో స్థానంలో, విరాట్ నాలుగో స్థానంలో రానున్నారు. ఇక రియాన్ పరాగ్ విషయానికి వస్తే అతడు ఈ మధ్యే అతడు జింబాబ్వే సిరీస్ లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తర్వాత శ్రీలంక పర్యటనకూ వెళ్లాడు.