Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 7 మొత్తం ఫాలో అయ్యారా.. అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి చూద్దాం?
Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. మరి మీరు గత బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ పూర్తి ఫాలో అయ్యారా? అలా అయితే ఇక్కడ అడిగే ప్రశ్నలకు మీరు సరైన సమాధానాలు చెప్పగలరేమో చూడండి.
Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు సరికొత్త సీజన్ సెప్టెంబర్ 1 నుంచే ప్రారంభం కాబోతోంది. ఈసారి ట్విస్టులతో మరింత సరదాగా ఈ సీజన్ సాగిపోనుందని స్టార్ మా ప్రోమోలతోనే చెబుతోంది. అయితే ఈ కొత్త సీజన్ ప్రారంభానికి ముందు గతేడాది వచ్చిన బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ మొత్తం మీరు ఫాలో అయ్యారా? అయితే ఇప్పుడు అడగబోయే నాలుగు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చూద్దాం.
బిగ్ బాస్ తెలుగు 7 క్విజ్
బిగ్ బాస్ తెలుగు 8 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈసారి కంటెస్టెంట్లు ఎవరు? స్టార్ మా చెబుతున్నట్లు ఇందులో ఉండే ట్విస్టులు ఏంటి? అన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఈ కొత్త సీజన్ ప్రారంభానికి ముందు గత సీజన్ గురించి ఓసారి నెమరు వేసుకుందాం.
ఆ సీజన్ గురించి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ప్రేక్షకులను నాలుగు ప్రశ్నలు అడిగింది. వీటి ద్వారా మీ నాలెడ్జె ఎంత ఉందో చూడండి. ఒకవేళ చెప్పలేకపోతే సమాధానాలు కింద ఉంటాయి.
బిగ్ బాస్ తెలుగు 7 ప్రశ్నలు ఇవే
1. నామినేషన్ల సందర్భంగా ప్రతిసారీ పల్లవి ప్రశాంత్ నోటి వెంట వచ్చిన ఊత పదం ఏంటి?
2. కంటెస్టెంట్లను ఏయే గ్రూపులుగా విభజించారు?
3. శివాజీ, ప్రశాంత్, యావర్ ఉన్న గ్రూపును ఏమని పిలిచారు?
4. అమర్‌దీప్, శోభ, ప్రియాంకా టీమ్ ను గత సీజన్లో ఏమని పిలిచారు?
ఈ నాలుగు ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలుసా? బిగ్ బాస్ తెలుగు 7 మొత్తం ఫాలో అయితే ఈ ప్రశ్నలకు మీరు సులువుగా సమాధానాలు చెప్పగలరు. ఒకవేళ వీటికి జవాబులు తెలియకపోతే కింద ఇస్తున్నాం.. చూడండి.
బిగ్ బాస్ తెలుగు 7 క్విజ్ సమాధానాలు
1. పల్లవి ప్రశాంత్ నామినేషన్ల సందర్భంగా పదే పదే "అన్నా నేను రైతు బిడ్డని" అని అనేవాడు.
2. గత సీజన్లో కంటెస్టెంట్లను "ఆటగాళ్లు, పోటుగాళ్లు" అనే రెండు గ్రూపులుగా విభజించారు.
3. శివాజీ, ప్రశాంత్, యావర్ గ్రూపును "స్పై బ్యాచ్" అని పిలిచేవారు.
4. అమర్‌దీప్, శోభ, ప్రియాంక టీమ్ ను "స్పా బ్యాచ్" అని అనేవారు.
బిగ్ బాస్ తెలుగు 8 గురించి..
బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కాబోతోంది. అంటే వచ్చే ఆదివారం నుంచి బిగ్ బాస్ ప్రేక్షకులకు పండగే. ఈసారి కంటెస్టెంట్లు ఎవరన్న సస్పెన్స్ ఇంకా వీడలేదు. ఎప్పటిలాగే దీనిపై స్టార్ మా ఏమీ చెప్పడం లేదు.
అయితే ఈసారి హౌజ్ లోకి.. సీరియల్ హీరో నిఖిల్ మలియక్కల్, యాంకర్ విష్ణుప్రియ, ఆర్జే శేఖర్ బాషా, హీరో ఆదిత్య ఓం, సీరియల్ నటీమణులు అంజలి పవన్, యష్మీ గౌడ వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నా.. వాళ్లు ఇంకా ఒప్పందాలపై సంతకాలు చేయనట్లు వార్తలు వస్తున్నాయి. వీళ్లలో అలీ సోదరుడు ఖయ్యూమ్, ఇంద్రనీల్ వర్మ ఉన్నట్లు సమాచారం.