Bigg Boss Voting: షాకింగ్ ఓటింగ్.. డేంజర్ జోన్‌లో జెన్యూన్ ప్లేయర్.. టాప్‌లో మళ్లీ అతనే!-bigg boss telugu 7 sivaji top in 10 week voting and singer bhole elimination ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Voting: షాకింగ్ ఓటింగ్.. డేంజర్ జోన్‌లో జెన్యూన్ ప్లేయర్.. టాప్‌లో మళ్లీ అతనే!

Bigg Boss Voting: షాకింగ్ ఓటింగ్.. డేంజర్ జోన్‌లో జెన్యూన్ ప్లేయర్.. టాప్‌లో మళ్లీ అతనే!

Sanjiv Kumar HT Telugu
Nov 08, 2023 10:05 AM IST

Bigg Boss 7 Telugu Voting: బిగ్ బాస్ 7 తెలుగు 10వ వారం ఓటింగ్‌ లెక్కలు షాకింగ్‌గా ఉన్నాయి. ఎందుకంటే టాప్‌లో ఉండాల్సిన జెన్యూన్ ప్లేయర్ డేంజర్ జోన్‌లో ఉన్నాడు. అలాగే వరస్ట్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్నవాళ్లు మాత్రం టాప్‌లో కొనసాగుతున్నారు.

బిగ్ బాస్ 7 తెలుగు పదో వారం షాకింగ్ ఓటింగ్.. డేంజర్ జోన్‌లో జెన్యూన్ ప్లేయర్.. టాప్‌లో ఎవరో తెలుసుగా!
బిగ్ బాస్ 7 తెలుగు పదో వారం షాకింగ్ ఓటింగ్.. డేంజర్ జోన్‌లో జెన్యూన్ ప్లేయర్.. టాప్‌లో ఎవరో తెలుసుగా!

Bigg Boss 7 Telugu 10th Week Elimination: బిగ్ బాస్ 7 తెలుగు 10వ వారం నామినేషన్లు కాస్తా సిల్లీగా జరిగాయి. పెద్దగా అరుచుకోవడాలు, గొడవలు ఏం జరగలేదు. కానీ, సైలెంట్‌గా ఒక్కొక్కరి పాయింట్స్ మాత్రం పెట్టారు. రాజమాతలుగా ప్రియాంక, శోభా శెట్టి, అశ్విని, రతిక రోజ్ ఉండగా.. వారే నామినేట్ చేసే సభ్యులను ఎన్నుకున్న విషయం తెలిసిందే. దీంతో బిగ్ బాస్ 7 తెలుగు 10వ వారం నామినేషన్లలో ఐదుగురు ఉన్నారు.

బిగ్ బాస్ 7 తెలుగు పదో వారం నామినేషన్లలో సింగర్ భోలే, గౌతమ్ కృష్ణ, హీరో శివాజీ, ప్రిన్స్ యావర్, రతిక రోజ్ ఉన్నారు. ఇక వీరికి నామినేషన్స్ జరిగిన సోమవారం (నవంబర్ 6) నుంచే ఓటింగ్ పోల్స్ నిర్వహించారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ ఏడో సీజన్‌లో నామినేషన్స్ ఎక్కువగా రెండు రోజులు జరుగుతుంటాయి. కానీ, ఈసారి ఒకే రోజు ముగించారు. అయితే ఈ పదో వారం ఓటింగ్ లెక్కలు షాకింగ్‌గా ఉన్నాయి.

హీరో శివాజీ నామినేషన్లలో ఉంటే.. అతనే టాప్‌లో ఉంటాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈసారి కూడా 37.78 శాతం ఓటింగ్‌తో టాప్‌లో శివాజీ నిలిచాడు. శివాజీనే ఎప్పుడు ఓటింగ్‌లో టాప్‌లో ఉంటాడని బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ తెలిసిన విషయమే. ఇక రెండో స్థానంలో హౌజ్‌లోనే వరెస్ట్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న రతిక రోజ్ 16.5 శాతం ఓట్లతో లీడింగ్‌లో ఉంది. బహుశా ఆమెకు పల్లవి ప్రశాంత్ ఓట్స్ పడుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక మూడో స్థానంలో సెల్ఫ్ నామినేట్ అయిన ప్రిన్స్ యావర్‌ 15.43 శాతంతో ఉన్నాడు. ఇక చివరి ఐదు, ఆరు స్థానాల్లో వరుసగా సింగర్ భోలే, డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ ఉన్నారు. భోలేకు 15.3 శాతం ఓట్లు పడితే.. గౌతమ్‌కు 14.98 శాతం ఓటింగ్ పోల్ అయింది. అంటే అతి స్వల్పంగా హౌజ్‌లో జెన్యూన్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ డేంజర్ జోన్‌లో ఉన్నాడు. వారం మొత్తం ఇదే కంటిన్యూ అయితే.. గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ, అతనికి బదులు సింగర్ భోలేను ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని మరో టాక్ వినిపిస్తోంది.

Whats_app_banner