Bigg Boss Elimination: శివాజీ, అమర్ దీప్ కాదు.. ఈవారం టేస్టీ తేజ ఎలిమినేట్.. కర్మ రిపీట్స్ అంటే ఇదే!-bigg boss 7 telugu 9th week elimination tasty teja and shobha shetty full emotional ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Elimination: శివాజీ, అమర్ దీప్ కాదు.. ఈవారం టేస్టీ తేజ ఎలిమినేట్.. కర్మ రిపీట్స్ అంటే ఇదే!

Bigg Boss Elimination: శివాజీ, అమర్ దీప్ కాదు.. ఈవారం టేస్టీ తేజ ఎలిమినేట్.. కర్మ రిపీట్స్ అంటే ఇదే!

Sanjiv Kumar HT Telugu
Nov 05, 2023 05:42 AM IST

Bigg Boss Tasty Teja Elimination: బిగ్ బాస్ 7 తెలుగు 9వ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. కానీ, గత రెండు రోజులుగా హౌజ్ నుంచి ఇద్దరూ టైటిల్ ఫేవరేట్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారని టాక్ వచ్చింది. కానీ, చివరికీ జబర్దస్త్ కమెడియిన్ టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు.

బిగ్ బాస్ 7 తెలుగు తొమ్మిదో వారం జబర్దస్త్ కమెడియన్ టేస్టీ తేజ ఎలిమినేట్
బిగ్ బాస్ 7 తెలుగు తొమ్మిదో వారం జబర్దస్త్ కమెడియన్ టేస్టీ తేజ ఎలిమినేట్

Bigg Boss 7 Telugu 9th Week Elimination: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో వరుసగా ఏడు వారాలు అమ్మాయిలే ఎలిమినేట్ అవుతూ వచ్చారు. వారిలో మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా, మూడో వారం సింగర్ దామిని, నాలుగో వారం రతిక రోజ్, ఐదో వారం శుభ శ్రీ, ఆరో వారం నయని పావని, ఏడో వారం పూజా మూర్తి ఎలిమినేట్ అయి హౌజ్ నుంచి వెళ్లిపోయారు. వీరిలో బిగ్ బాస్ 2.0 సీజన్‌లోకి వచ్చిన మొదటి వారమే నయని పావని ఎలిమినేట్ అయింది.

బలి చేసిన బిగ్ బాస్

ఆరో వారం కార్తీక దీపం మోనిత అలియాస్ శోభా శెట్టి ఎలిమినేట్ కావాల్సింది. కానీ, ఆమెను సేవ్ చేసేందుకు మంచి కంటెస్టెంట్ అయిన నయనిని ఎలిమినేట్ చేశారు. తర్వాత ఎనిమిదో వారం మొదటి సారిగా ఒక మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు. అది కూడా టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఆట సందీప్. అతన్ని కూడా శోభా కోసం బిగ్ బాస్ టీమ్ బలి చేశారని టాక్ వచ్చింది. ఇక తొమ్మిదో వారం ముందుగా టేస్టీ తేజానే ఎలిమినేట్ అవుతాడని టాక్ వచ్చిన గత రెండు రోజులుగా స్టార్ ప్లేయర్స్, టైటిల్ కొట్టే ఛాన్స్ ఉన్న శివాజీ, అమర్ దీప్ హౌజ్ నుంచి వెళ్లనున్నారని రూమర్స్ వచ్చాయి.

చివరిలో శోభా శెట్టి

కానీ, మొదట అనుకున్నట్లుగానే బిగ్ బాస్ 7 తెలుగు తొమ్మిదో వారం తక్కువ ఓట్లు వచ్చాయన్న కారణంతో జబర్దస్త్ కమెడియన్ టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. అయితే, తొమ్మిదో వారం నామినేషన్లలో 8 మంది ఉండగా.. ఏడో స్థానంలో తేజ, ఎనిమిదో స్థానంలో శోభా ఉన్నట్లు ఓటింగ్ పోల్ లెక్కలు వచ్చాయి. మళ్లీ శోభాను కాపాడేందుకు నయని, సందీప్‌ను బలి చేసినట్లే తేజను కూడా బకరా చేసి ఎలిమినేట్ చేశారని అంటున్నారు.

బాగా ఏడ్చేసిన శోభా

తేజ ఎలిమినేషన్‌కు సంబంధించి షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. తేజ ఎలిమినేషన్ తర్వాత శోభా శెట్టి విపరీతంగా ఏడ్చేసిందని బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. హౌజ్‌లో శోభా, తేజ చాలా చనువుగా, ఒకరకంగా లవర్స్ లా బిహేవ్ చేసిన విషయం తెలిసిందే. ఇక హౌజ్‌లోకి వాళ్ల అమ్మను తీసుకొస్తానని గట్టిగా ఫిక్స్ అయిన తేజ ఎలిమినేట్ కావడంతో అతను కూడా కాస్తా ఎమోషనల్ అయ్యాడు.

కర్మ రిపీట్స్

Bigg Boss 7 Telugu Elimination: ఇదిలా ఉంటే నయని పావని నుంచి సందీప్ వరకు సిల్లీ కారణాలతో తేజ నామినేట్ చేసినవాళ్లే ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు శివాజీ చెప్పిన సిల్లీ కారణంతో తేజ ఎలిమినేట్ కావడంతో కర్మ రిపీట్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

IPL_Entry_Point