Bigg Boss 7 Telugu: కంటెస్టెంట్లకు సామెతలు.. ‘కుక్క తోక వంకర’ను అమర్‌కు ఇచ్చిన భోలే: వీడియో-bigg boss 7 telugu promo proverb game for contestants tasty teja reportedly eliminated from house ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 7 Telugu: కంటెస్టెంట్లకు సామెతలు.. ‘కుక్క తోక వంకర’ను అమర్‌కు ఇచ్చిన భోలే: వీడియో

Bigg Boss 7 Telugu: కంటెస్టెంట్లకు సామెతలు.. ‘కుక్క తోక వంకర’ను అమర్‌కు ఇచ్చిన భోలే: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 05, 2023 03:36 PM IST

Bigg Boss 7 Telugu Day 63 Promo: బిగ్‍బాస్‍లో కంటెస్టెంట్లకు సామెతల గేమ్ పెట్టారు హోస్ట్ నాగార్జున. ఏ సామెతకు ఎవరు సూటవుతారో ఇచ్చేలా ఈ గేమ్ జరిగింది.

Bigg Boss 7 Telugu: కంటెస్టెంట్లకు సామెతలు.. ‘కుక్క తోక వంకర’ను అమర్‌కు ఇచ్చిన భోలే (Photo: StarMaa)
Bigg Boss 7 Telugu: కంటెస్టెంట్లకు సామెతలు.. ‘కుక్క తోక వంకర’ను అమర్‌కు ఇచ్చిన భోలే (Photo: StarMaa)

Bigg Boss 7 Telugu Day 63 Promo 2: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ తొమ్మిదో వారంలో ఎలిమినేషన్ ఎపిసోడ్‍కు వేళైంది. నేడు ఆదివారం (నవంబర్ 5) కావటంతో తొమ్మిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉండనుంది. అలాగే, కంటెస్టెంట్లతో ఫన్నీ గేమ్స్ కూడా ఆడిస్తారు హోస్ట్ నాగార్జున. ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ ప్రమోషన్లలో భాగంగా ఈ ఎపిసోడ్‍కు గెస్టులుగా వచ్చారు రాఘవ లారెన్స్, ఎస్‍జే సూర్య. వారు కంటెస్టెంట్లతో మాట్లాడారు. కంటెస్టెంట్లు గేమ్‍లో భాగంగా స్టెప్స్ వేశారు. అలాగే, కంటెస్టెంట్లకు సామెతల గేమ్ కూడా పెట్టారు నాగార్జున. ఇందుకు సంబంధించిన ప్రోమో వచ్చింది.

సామెత రాసి ఉన్న బోర్డు తీసుకొని.. దానికి సూటయ్యే వారి మెడలో వేయాలని కంటెస్టెంట్లకు నాగార్జున చెప్పారు. ముందుగా భోలే షావలి.. ‘కుక్క తోక వంక’ అనే బోర్డు తీసుకున్నారు. దాన్ని అమర్ దీప్ చౌదరి మెడలో వేశారు. ఆటల్లో అమర్ తనకు బాగా నచ్చుతారని, నామినేషన్లలో రివేంజ్ అనే పదం వాడి వెంటనే రివేంజ్ తీర్చుకున్నాడని భోలే అన్నారు. దీంతో మారడని అనుంటున్నావ్ అంటూ నాగ్ అన్నారు. వేసేయ్ అని చెప్పారు. దీంతో అమర్ మెడలో కుక్క తోక వంకర సామెత బోర్డు వేశారు భోలే.

‘గాడిదకు ఏం తెలుసు గంధపు చెక్కల వాసన’ అనే సామెత ఉన్న బోర్డును అశ్వినీ శ్రీ మెడలో వేశారు అమర్. నిర్ణయాలను అశ్వినీ వేగంగా మార్చుకుంటున్నారని అమర్ అన్నారు. తన గేమ్ అది అని అశ్విని చెప్పారు.

“ఏకులా వచ్చి మేకులా తగులుకున్నట్టు” అనే సామెతను పల్లవి ప్రశాంత్‍కు ఇచ్చారు అంబటి అర్జున్. ముందుగా ప్రశాంత్ ఇలా ఆడతాడని ఎవరూ ఊహించలేదని, అయితే ఇప్పుడు మేకులా అయి కూర్చున్నారని అర్జున్ చెప్పారు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందనే సామెతను టెస్టీ తేజకు పల్లవి ప్రశాంత్ ఇచ్చారు. ఏం లేని దానికి తేజ గొడవ చేస్తుంటారని ప్రశాంత్ అభిప్రాయపడ్డారు.

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెతను అశ్వినికి ఇచ్చారు ప్రియాంక. ఆలోచించకుండా అశ్వినీ ఏదో ఒకటి అంటారని, ఆ తర్వాత తాను అలా అనలేదని అంటుంటారని ప్రియాంక వివరణ ఇచ్చుకున్నారు. ఓడ ఎక్కేవరకు ఓడ మల్లన్న.. ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న సామెత బోర్డును భోలే మెడలో వేశారు రతిక. పొరుగింటి పుల్లకూర రుచి సామెతను కూడా భోలేకు ఇచ్చారు తేజ.

తేజ ఎలిమినేట్!

ఈ తొమ్మిదో వారం వారం 8 మంది కంటెస్టెంట్లు నామినేషన్లలో ఉండగా.. టేస్టీ తేజ ఎలిమినేట్ అయినట్టు లీకుల ద్వారా బయటికి వచ్చింది. హౌస్ నుంచి తేజ బయటికి వెళ్లిపోనున్నారని తెలుస్తోంది. ఓటింగ్ తక్కువగా ఉన్న కారణంగా తేజ ఎలిమినేట్ కానున్నారని లీక్ అయింది. ఎవరికి ఏ సామెతను కంటెస్టెంట్లు ఇచ్చారు.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారో నేటి ఎపిసోడ్‍లో తెలియనుంది.

aaaa

Whats_app_banner