Bigg Boss Remuneration: టేస్టీ తేజకు లక్షల్లో రెమ్యునరేషన్.. 9 వారాలకు ఎంత సంపాదించాడో తెలుసా?-bigg boss 7 telugu tasty teja remuneration for 9 weeks in bigg boss ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bigg Boss 7 Telugu Tasty Teja Remuneration For 9 Weeks In Bigg Boss

Bigg Boss Remuneration: టేస్టీ తేజకు లక్షల్లో రెమ్యునరేషన్.. 9 వారాలకు ఎంత సంపాదించాడో తెలుసా?

Sanjiv Kumar HT Telugu
Nov 05, 2023 10:48 AM IST

Tasty Teja Remuneration For Bigg Boss: బిగ్ బాస్ 7 తెలుగు తొమ్మిదో వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. అయితే, ప్రస్తుతం ఈ జబర్దస్త్ కమెడియన్ బిగ్ బాస్ ద్వారా తొమ్మిది వారాలకు ఎంత సంపాదించడనే విషయం ఆసక్తిగా మారింది.

టేస్టీ తేజకు లక్షల్లో బిగ్ బాస్ రెమ్యునరేషన్.. 9 వారాలకు ఎంత సంపాదించాడో తెలుసా?
టేస్టీ తేజకు లక్షల్లో బిగ్ బాస్ రెమ్యునరేషన్.. 9 వారాలకు ఎంత సంపాదించాడో తెలుసా? (Instagram)

Tasty Teja Bigg Boss 9 Weeks Remuneration: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లోకి సెప్టెంబర్ 3న మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని భట్ల, రతిక రోజ్, శుభ శ్రీ రాయగురు ఎలిమినేట్ అయి హౌజ్‌ను వీడారు. శుభ శ్రీ ఎలిమినేషన్ రోజే అంటే అక్టోబర్ 8న వైల్డ్ కార్డు ద్వారా కొత్తగా 5 మంది అర్జున్, నయని, సింగర్ భోలే, పూజా మూర్తి, అశ్విని బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగు పెట్టారు.

ట్రెండింగ్ వార్తలు

బిగ్ బాస్ 2.0 సీజన్‌లో నయని పావని, పూజా మూర్తి ఎలిమినేట్ అయ్యారు. పూజా మూర్తి ఎలిమినేషన్ రోజే రతిక రోజ్ రీ ఎంట్రీ ఇచ్చింది. అనంతరం 8వ వారం ఆట సందీప్ ఎలిమినేట్ అయి హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్, ఫుడ్ బ్లాగర్ టేస్టీ తేజ వంతు వచ్చింది. బిగ్ బాస్ 7 తెలుగు 9వ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. దీంతో హౌజ్‌లో ప్రస్తుతం శివాజీ, గౌతమ్, అమర్, ప్రియాంక, శోభా, అర్జున్, భోలే, అశ్విని, యావర్, ప్రశాంత్, రతిక మాత్రమే ఉన్నారు.

టేస్టీ తేజ ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‌లో ప్రస్తుతం 11 మంది మిగిలారు. ఇదిలా ఉంటే ఇప్పుడు టేస్టీ తేజ బిగ్ బాస్ రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. తేజకు ఒక్క రోజుకి రూ. 21, 428 పారితోషికంగా బిగ్ బాస్ నిర్వాహకులు డీల్ కుదుర్చుకున్నారట. అంటే వారానికి రూ. 1, 50, 000. ఇలా చూసుకుంటే టేస్టీ తేజ బిగ్ బాస్ హౌజ్‌లో టోటల్‌గా తొమ్మిది వారాలు ఉన్నాడు. కాబట్టి మొత్తం 9 వారాలకు తేజ రూ. 13 లక్షల 50 వేలు సంపాదించాడని తెలుస్తోంది. దీంతో బిగ్ బాస్ ద్వారా తేజ బాగానే వెనుక వేశాడని నెటిజన్ల నుంచి కామెంట్స్ వస్తున్నాయి.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.