Bigg Boss 8 Telugu Nominations: ఈవారం నామినేషన్లలో ఆరుగురు.. నిఖిల్‍కు షాకిచ్చిన హౌస్‍మేట్స్.. యష్మి, మణి మధ్య వాగ్వాదం
Bigg Boss 8 Telugu 5th week Nominations: ఐదో వారం ఎలిమినేషన్లలో ఆరుగురు నిలిచారు. చీఫ్‍గా ఉన్న నిఖిల్‍కు ఎక్కువ మంది హౌస్‌మేట్స్ వ్యతిరేకంగా నిలిచారు. ఈవారం నామినేషన్లలో యష్మి, మణికంఠ మధ్య వాగ్వాదం రసవత్తరంగా జరిగింది.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో ఐదో వారం నామినేషన్ల తంతు ముగిసింది. ఈసారి నామినేషన్లలో ఆరుగురు నిలిచారు. ఈవారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందని హోస్ట్ నాగార్జున చెప్పటంతో మరింత టెన్షన్ ఉంది. ఈ సోమవారం నామినేషన్ల ప్రక్రియలో యష్మి గౌడ, నాగ మణికంఠ మధ్య తీవ్రంగా వాగ్వాదం జరిగింది. హౌస్‍మేట్స్ షాక్ ఇవ్వటంతో శక్తి క్లాన్ చీఫ్ నిఖిల్ కూడా నామినేషన్లలోకి వచ్చేశాడు. ఇదెలా సాగిందంటే..
మణికంఠను జైలులోకి సాగనంపడంతో సోమవారం ఎపిసోడ్ షురూ అయింది. తాను జైలులోకి రావాలనుకోలేదని, దీంట్లోకి వస్తే గేమ్ ఎండ్ అనుకున్నా అని మణి చెప్పారు. లాలా.. భీమ్లా పాటతో 30వ రోజు సోమవారం ఆట మొదలైంది. ఆ తర్వాత ఎలిమనేషన్ ప్రక్రియ షురూ అయింది. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు హౌస్‍మేట్స్ గురించి కారణాలు చెప్పి.. మంటల్లో ఫొటోలు వేయాలని బిగ్‍బాస్ చెప్పారు.
నోరు జారావ్.. సారీ చెప్పాలి కదా..
ముందు నైనికను మణికంఠ నామినేట్ చేశారు. ఆమె అందరితో కలిసి ఉండడం లేదని, తొలి వారం చూసిన నైనిక కనిపించడం లేదని మణి కారణం చెప్పారు. ఆ తర్వాత యష్మిని నామినేట్ చేశారు మణి. ఎగ్ టాస్కులో పోరాడినా తనను యష్మి వీక్ అనడంపై మణి అభ్యంతరం తెలిపారు. ఆ తర్వాత తనను అబ్బాయిల్లో లెక్క వేయడం లేదని యష్మి చేసిన కామెంట్‍పై ఫైర్ అయ్యారు. నోరు జారి ఆ మాట అన్న సమయంలో తనకు సారీ కూడా చెప్పలేదని అసంతృప్తి చెందారు. తాను తప్పుడు ఉద్దేశంతో అలా చెప్పలేదని, గేమ్ పరంగా అలా అన్నానని యష్మి సమర్థించుకున్నారు. ఈ విషయంపై మణి, యష్మిపై గట్టిగా వాగ్వాదం జరిగింది.
నాగార్జున వీడియో చూపించక ముందే తనకు సారీ చెప్పాల్సిందని మణి చెప్పారు. ఫుటేజ్ చూపించినా తప్పును రియలైజ్ కాలేదని యష్మి అన్నారు.
విష్ణుప్రియ, మణికంఠతో నిఖిల్ కూడా గట్టిగా వాగ్వాదం చేశారు. ప్రేరణ తన ఫొటోను మంటల్లో వేస్తే నామినేషన్ అంగీకరించలేదు ఆదిత్య. మంటల్లో చేయి పెట్టారు. దీంతో బిగ్‍బాస్ ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇతర కంటెస్టెంట్ల మధ్య కూడా నామినేషన్ల పాయింట్లపై వాగ్వాదాలు జరిగాయి.
రివేంజ్ తీర్చుకుంటా.. హార్ట్ బ్రేక్ చేశావ్
మణికంఠను యష్మి నామినేట్ చేశారు. హోస్ట్ నాగార్జున వీడియో చూపించాక సారీ చెప్పాక కదా అని యష్మి అన్నారు. ఎన్నిసార్లు వీడియోలు చూపించినా ఎవరికైనా సారీ చెప్పావా అని మణికి ప్రశ్నించారు. అయితే, ఎన్ని వారాలైనా మణినే నామినేట్ చేస్తానని చెప్పారు. రివేంజా అని మణి ప్రశ్నిస్తే.. అవును రివేంజ్ తీర్చుకుంటా అని యష్మి స్పష్టంగా చెప్పేశారు. నా హార్ట్ బ్రేక్ చేసేశావని మణితో యష్మి అన్నారు. దీంతో హార్ట్ బ్రేక్ అయినా తాను పట్టించుకోనని మణి క్లారిటీగా చెప్పారు. హార్ట్ కిందికేసి రుద్దుకో అంటూ పంచ్ వేశారు మణి. ఆ తర్వాత మణి, పృథ్వి మధ్య కూడా వాగ్వాదం జరిగింది.
ఈ ఐదో వారం నామినేషన్లలో మణికంఠ, విష్ణుప్రియనే ఎక్కువ మంది నామినేట్ చేశారు. ఇద్దరినీ చెరో ఐదు మంది నామినేట్ చేశారు.
నిఖిల్‍కు షాక్.. అతడు కూడా నామినేషన్లలో..
చీఫ్‍లుగా ఉన్న నిఖిల్, సీతను నామినేషన్ల నుంచి బిగ్‍బాస్ తప్పించారు. అయితే, చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. ఆ ఇద్దరిలో ఒకరిని నామినేట్ చేసే పవర్‌ను కంటెస్టెంట్లకు ఇచ్చారు. ఇద్దరు చీఫ్‍ల్లో ఒకరిని నామినేట్ చేయవచ్చని చెప్పారు. చీఫ్‍గా సీతను ఎవరు సేవ్ చేయాలనుకుంటున్నారో చేయి ఎత్తాలని నైనిక చెప్పారు. నబీల్, నైనిక, మణికంఠ, ప్రేరణ, విష్ణుప్రియ, ఆదిత్య ఓం.. సీతను సేవ్ చేసేందుకు ఓటేశారు. పృథ్వి, యష్మి మాత్రమే నిఖిల్‍ను సేవ్ చేయాలనుకున్నారు. దీంతో ఆరు ఓట్లు వచ్చిన సీత సేవ్ అవగా.. నిఖిల్ నామినేషన్లలోకి వచ్చేశాడు.
నామినేషన్లలో వీరే..
ఐదో వారం నామినేషన్లలో నైనిక, విష్ణుప్రియ, మణికంఠ, ఆదిత్య, నబీల్, నిఖిల్ ఉన్నారు. ఈసారి మిడ్‍వీక్ ఎలిమినేషన్ ఉంటుందని వీకెండ్ ఎపిసోడ్‍లో నాగార్జున చెప్పడంతో మరింత ఆసక్తి నెలకొని ఉంది.