Bigg Boss 7 Telugu Promo: “ఎందుకు పిలుస్తారు.. నువ్వు పెద్ద పిస్తావనా”: సీరియస్ అయిన నాగార్జున
Bigg Boss 7 Telugu Promo: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ మూడో వారం వీకెండ్‍కు వచ్చేసింది. ఈ ఎపిసోడ్‍లో కంటెస్టెంట్‍లతో హోస్ట్ నాగార్జున మాట్లాడారు.
Bigg Boss 7 Telugu Promo: బిగ్బాస్ తెలుగు 7వ సీజన్ రంజుగా సాగుతోంది. మూడో వారంలో కంటెస్టెంట్‍ల మధ్య చాలా గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో హోస్ట్ నాగార్జున వచ్చే వీకెండ్ ఎపిసోడ్లపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ తరుణంలో నేడు శనివారం వీకెండ్ ఎపిసోడ్ రానుంది. ఇందుకు సంబంధించిన 20వ రోజు ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. కొందరు కంటెస్టెంట్‍లకు హోస్ట్ నాగార్జున గట్టిగా క్లాస్ తీసుకున్నారు. సీరియస్ కూడా అయ్యారు. ప్రోమోలో ఏముందంటే..
“అసలు నువ్వు నీ కోసం ఆడుతున్నావా.. ప్రియాంక కోసం ఆడుతున్నావా” అంటూ అమర్ దీప్‍ను గట్టిగానే ప్రశ్నించారు నాగార్జున. తనను కంటెండర్ కాకూడదని ప్రియాంక గతంలో చెప్పినా.. ఆ పాయింట్ ఎందుకు చెప్పలేదని అమర్‌ను నాగ్ నిలదీశారు. ప్రిన్స్ యావర్‌ను స్ట్రాంగ్ కంటెండర్ అని శోభ చెప్పిందని, అయితే ఆమె వీక్ అని ఒప్పుకున్నట్టే కదా అని నాగ్ ప్రశ్నించారు. వీక్ కంటెస్టెంట్‍లనే ఎలిమినేట్ చేయాలని తనకు చెప్పారని అన్నారు. “దాని ప్రకారం శోభను కదా ఎలిమినేట్ చేయాలి.. మరి ఎందుకు చేయలేదు తనని” అని సంచాలక్ సందీప్‍ను గట్టిగా ప్రశ్నించారు నాగార్జున. ప్రిన్స్ యావర్‌ను కంటెండర్‌షిప్ కోసం అనర్హుడిగా అభిప్రాయపడిన వారిపై నాగ్ క్వశ్చన్ల వర్షం కురిపించారు.
సంచాలక్ అంటే అంపైర్ అని.. అలాంటప్పుడు ఆట మధ్యలో తలదూర్చకూడదు కదా అని సందీప్‍ను నాగార్జున ప్రశ్నించారు. శోభ, ప్రియాంక గేమ్‍కు ‘నువ్వెందుకు పాయింట్స్ ఇస్తున్నావ్’ అని నిలదీశారు. సంచాలక్‍గా ఆడావా, పర్సనల్ గేమ్ ఆడావా అని నాగ్ క్వశ్చన్ చేశారు. దీంతో కన్‍ఫ్యూజ్ అయ్యా అని తడబడ్డారు సందీప్. ఫస్ట్ అనౌన్స్‌మెంట్‍లో సంచాలక్ అని చెప్పలేదంటూ ఏదో చెప్పబోయారు సందీప్. దీంతో ఆగ్రహించిన నాగార్జున.. “అసలు నువ్వు కంటెండర్ కాదు.. నున్నెందుకు పిలుస్తారు? ఏం అవసరం. నువ్వు పెద్ద పిస్తావనా?.. ఇప్పుడు ఎందుకు పిలిచారు అది అంటే ఎలాగయ్యా?” అని నాగార్జున అన్నారు. దీంతో సందీప్ బాధపడ్డారు.
సంచాలక్‍గా సందీప్ ఫెయిల్ అయ్యాడంటే చేతులు ఎత్తాలని హౌస్‍మేట్లను నాగార్జున అడిగారు. ఎక్కువ మంది చేతులు ఎత్తారు. దీంతో సందీప్ బ్యాటరీని గ్రీన్ నుంచి ఎల్లోకు తగ్గించేశారు నాగార్జున. ఇలా ప్రోమో ఇంత వాడివేడిగా సాగింది. ఇక నేడు ప్రసారమయ్యే పుల్ ఎపిసోడ్ మరింత హాట్‍గా ఉండే అవకాశం ఉంది.