Bigg Boss 7 Telugu: భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్లు: వీడియో
Bigg Boss 7 Telugu Day 33 Promo: బిగ్‍బాస్‍లో కంటెస్టెంట్లు కన్నీరు పెట్టుకున్నారు. తమ కుటుంబ సభ్యులను తలచుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఎందుకంటే..
Bigg Boss 7 Telugu Day 33 Promo 1: వాగ్వాదాలు, గొడవలతో రచ్చరచ్చగా సాగుతున్న బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍లో ఎమోషనల్ మూవ్‍మెంట్ వచ్చింది. తమ కుటుంబ సభ్యులను తలచుకొని కంటెస్టెంట్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. భావోద్వేగంతో ఏడ్చేశారు. వారివారి కుటుంబ సభ్యులు తమకు రాసిన లెటర్ల విషయంలో కంటెస్టెంట్లు ఫుల్ ఎమోషనల్ అయ్యారు. కొందరు వెక్కివెక్కి ఏడ్చారు. ఇందుకు సంబంధించి నేటి 33వ రోజు ప్రోమో బయటికి వచ్చింది. కంటెస్టెంట్లు ఎమోషనల్ అయినట్టు ఇందులో ఉంది. వివరాలివే..
తన భార్య తేజశ్వినికి ఇప్పటి దాకా తాను ఏమీ చేయలేదని, సరిగ్గా చూసుకున్నానో లేదో కూడా తెలియదు అని సందీప్‍కు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు అమర్‌దీప్. “ఇక్కడ ఉన్నప్పుడు నిజంగా కొన్ని విలువలు తెలిసి వచ్చాయి. ‘కన్నా’ అని చూడగానే.. అదే పిలిచినట్టు అనిపించేసింది” అని అమర్ దీప్ ఎమోషనల్ అయ్యారు. “తేజూ సారీ.. నీ విలువ తేలిసింది నాకు” అని వెక్కివెక్కి ఏడ్చారు అమర్. సందీప్ అతడిని కౌగిలించుకొని ఓదార్చారు. సందీప్ కూడా కన్నీరు పెట్టుకున్నారు.
“నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు. వచ్చిన రోజే హగ్ ఇచ్చావు” అని ప్రశాంత్‍తో శివాజీ అన్నారు. కన్నీళ్లు పెట్టుకున్న ప్రశాంత్‍ను హత్తుకొని సముదాయించారు. తాను తన భార్య ఇచ్చిన కాఫీ ప్రతీ రోజు తాగేవాడనని శివాజీ గుర్తుచేసుకున్నారు. ప్రశాంత్ కూడా తన కుటుంబ సభ్యులను, ఇంటిని గుర్తు చేసుకొని తీవ్రంగా ఏడ్చేశాడు. ప్రశాంత్ కోసం గివప్ చేస్తున్నానంటూ శివాజీ చెప్పారు. శివాజీ, పల్లవి ప్రశాంత్ మధ్య ఈ సంభాషణ చాలా ఎమోషనల్‍గా సాగనున్నట్టు అర్థమవుతోంది. 33వ రోజు తొలి ప్రోమోలో ఇది ఉంది. అయితే, లెటర్లను చూసి వీరితో పాటు మిగతా కంటెస్టెంట్లు ఎలా ఎమోషనల్ అయ్యారు.. ఏం మాట్లాడారో నేటి బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ 33వ రోజు పూర్తి ఎపిసోడ్‍లో తెలియనుంది.
మరోవైపు, ఈ వారాంతంలో బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍కు మరో లాంచ్ ఉండనుంది. మరో ఐదుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‍లో అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి హిట్ ఇస్తూ ఓ ప్రోమోను కూడా స్టార్ మా ఇటీవల వెల్లడించింది.