Bigg Boss 7 Telugu Day 27 Promo: ‘నువ్వేమైన బ్లైండా’: శివాజీ, సందీప్‌ను నిలదీసిన నాగార్జున.. తేజపై ఫైర్: ప్రోమో చూసేయండి
Bigg Boss 7 Telugu Day 27 Promo: బిగ్‌బాస్ నాలుగో వారం వీకెండ్ ఎపిసోడ్లో టేస్టీ తేజ విషయంపై వ్యవహారం హాట్‌హాట్‌గా సాగింది. సందీప్, శివాజీని నాగార్జున నిలదీశారు. తేజపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bigg Boss 7 Telugu Day 27 Promo: బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్ నాలుగో వారం ముగింపునకు వచ్చింది. వీకెండ్ ఎపిసోడ్లలో భాగంగా శనివారం (సెప్టెంబర్ 30) కంటెస్టెంట్లతో హోస్ట్ నాగార్జున మాట్లాడనున్నారు. అయితే, ఈసారి వీకెండ్ ఎపిసోడ్ మరింత ఉత్కంఠగా జరగనుంది. ముఖ్యంగా టేస్టీ తేజ చేసిన పనికి ఇతర కంటెస్టెంట్లను కూడా నాగార్జున నిలదీయనున్నారు. అలాగే, ఓ టాస్క్ సందర్భంగా ఓవర్ యాక్షన్ చేసిన తేజపై నాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్టు పట్టుకొచ్చి మరీ కంటెస్టెంట్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన నేటి ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. ప్రోమోలో ఏముందంటే..
స్మైల్ ప్లీజ్ టాస్కులో టేస్టీ తేజ వ్యవహరించిన తీరుపై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలోనే సంచాక్ సందీప్‌ను నిలదీశారు. “నీవేమైనా బ్లైండా (గుడ్డివాడివా). కెమెరాలో నుంచి ఏం జరుగుతుందో నీకు కనిపించలేదా” అని సందీప్‌తో పాటు శివాజీని కూడా నిలదీశారు నాగ్. టాస్కులో భాగంగా తేజకు గౌతమ్ కృష్ణ బెల్ట్ వేసినప్పుడు శివాజీ అరిచారని.. గౌతమ్‌కు తేజ బెల్ట్ వేసినప్పుడు వారించలేదని నాగార్జున ప్రశ్నించారు. వీడియోలు వేసి మరీ చూపించారు. గౌతమ్ గొంతుకు బెల్ట్ వేసి తేజ భయంకరంగా లాగుతుంటే ‘నీ గొంతు ఏమైంది’ అని శివాజీని నాగ్ నిలదీశారు. అయితే, కావాలని అలా చేయలేదని శివాజీ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అది తాను నిర్ణయిస్తానని నాగ్ గట్టిగా చెప్పారు.
‘చూస్తూ కూడా నువ్వేం మాట్లాడలేదు’ అని సందీప్‌ను కడిగేశారు నాగార్జున. సారీ ఏంటి అని ఆగ్రహించారు. సంచాలక్‌గా పూర్తిగా ఫెయిల్ అయ్యావని సందీప్‌పై ఆగ్రహించారు నాగ్.
గౌతమ్‌ను బెల్టుతో అంత బలవంతంగా లాగడంపై తేజను నాగార్జున ప్రశ్నించారు. ఆడపిల్లలు పక్కన అరుస్తున్నా అలా చేశావేంటని ఫైర్ అయ్యారు. ఆ అరుపులు ఎంకరేజ్మెంట్ అనుకున్నానని తేజ బదులిచ్చాడు. దీంతో భయంతోనే అరిచామని ఇతర కంటెస్టెంట్లు చెప్పారు. తనకు రియలైజ్ అవ్వడానికి టైమ్ పట్టిందంటూ తేజ సమాధానం చెప్పబోయాడు. దీంతో నాగార్జున మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇక కొట్టడం అనవసరం అనుకున్నా’ అని తేజ అనడంతో నాగ్ కోపం మరింత పెరిగింది. దీంతో ఏ శిక్ష వేసినా భరిస్తానని తేజ అన్నారు.
తేజను ఏం చేద్దామని ఇతర కంటెస్టెంట్లను నాగార్జున అడిగారు. హౌస్‌లోని జైల్లో వేయాలని శుభశ్రీ చెప్పారు. జైలు కూడా తక్కువేనని ప్రియాంక అన్నారు. సంచాలక్ సందీప్ అయితే.. ఏకంగా తేజను డైరెక్టుగా ఇంటికి పంపించేయాలని సలహా ఇచ్చారు. దీంతో తేజ షాకయ్యారు. ఇలా హాట్‌హాట్‌గా ఈ తంతు సాగింది. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ నేడు స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతుంది.
టాపిక్