Bigg Boss Donkey: బిగ్ బాస్ కంటెస్టెంట్గా గాడిద.. మాటలు కలిపిన సల్మాన్ ఖాన్.. నువ్ టైటిల్ గెలిస్తే ఎలా లేపాలి అంటూ!
Bigg Boss 18 Hindi Contestants Donkey Gadhraj: బిగ్ బాస్ హిందీ 18 సీజన్లో కంటెస్టెంట్గా గాడిద ఎంట్రీ ఇచ్చింది. దీనిని స్వయంగా హోస్ట్ సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ హౌజ్లోకి సాగనంపాడు. అయితే, ఇప్పుడు ఇదే విషయం వైరల్ కావడంతో పెటా ఇండియా సంస్థ రియాక్ట్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Bigg Boss 18 Contestant Donkey: బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ తెలిసిందే. బిగ్ బాస్ హౌజ్లోకి సాధారణంగా టాప్ సెలబ్రిటీలను, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్లను, ఏదైనా రంగంలో పాపులర్ అయిన వ్యక్తులను పంపిస్తుంటారు. కానీ, తాజాగా విచిత్రంగా ఓ గాడిదను బిగ్ బాస్ కంటెస్టెంట్గా హౌజ్లోకి పంపించారు. ప్రస్తుతం దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
మొత్తం 19 మంది కంటెస్టెంట్స్
హిందీలో బిగ్ బాస్ షో 18వ సీజన్ నడుస్తోంది. బిగ్ బాస్ హిందీ 18 సీజన్ ఈ ఆదివారం (అక్టోబర్ 6) నాడు చాలా గ్రాండ్గా ప్రారంభమైంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 18 గ్రాండ్ ప్రీమియర్ షోలో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. వారిలో టీవీ నటులు, రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్లు కూడా ఉన్నారు.
19వ కంటెస్టెంట్గా గాడిద
కానీ, ప్రేక్షకుల్లో అత్యంత క్యూరియాసిటీని రేకెత్తించింది '19వ కంటెస్టెంట్'. ఈసారి బిగ్ బాస్ హోజ్లోకి నిజమైన గాడిద అడుగుపెట్టింది. ఆ గాడిద పేరు గద్ రాజ్. కంటెస్టెంట్గా గాడిదను తీసుకువచ్చి బిగ్ బాస్ టీమ్ వినూత్న ప్రయత్నం చేసింది. అయితే, దీనిపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
సల్మాన్ ఖాన్కు లేఖ
కంటెస్టెంట్గా గాడిద ఏంట్రా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం వైరల్ కావడంతో తాజాగా జంతు సంక్షేమ సంస్థ పెటా కూడా దీనిపై దృష్టి సారించింది. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఇండియాకు చెందిన న్యాయవాది శౌర్య అగర్వాల్ బుధవారం (అక్టోబర్ 9) బిగ్ బాస్ 18 హోస్ట్ సల్మాన్ ఖాన్కు లేఖ రాశారు.
అది మా బాధ్యత
"బిగ్ బాస్ హౌజ్లో గాడిదను ఉంచడంపై తీవ్ర మనస్తాపానికి గురైన ప్రజా ప్రతినిధులు తమ ఫిర్యాదులతో మమ్మల్ని ముంచెత్తుతున్నారు. వారి ఆందోళనలను తిరస్కరించడానికి వీళ్లేదు. కచ్చితంగా వాటిపై దృష్టి సారించాల్సిన బాధ్యత మాపై ఉంది" అని అని సల్మాన్ ఖాన్కు రాసిన లేఖలో న్యాయవాది శౌర్య అగర్వాల్ పేర్కొన్నారు.
మీ పలుకుబడి ఉపయోగించి
ఈ బిగ్ బాస్ షోలో జంతువును చేర్చడం 'బాధాకరం' అని పేర్కొన్న పెటా ఇండియా.. హోస్ట్, స్టార్ హీరో అయిన సల్మాన్ ఖాన్కు తెలిపింది. స్టార్ అయిన సల్మాన్ ఖాన్ తన పలుకుబడి ఉపయోగించి పెటా ఇండియాకు గాడిదను అప్పగించేలా చేయాలని, ఇతర గాడిదలతో క్షేమంగా ఉండే అభయారణ్యంలో తిరిగి నివసించేలా చేయాలని సల్మాన్ ఖాన్ను డిమాండ్ చేసింది.
ఇలాంటివి మానుకోవాలని
బిగ్ బాస్ షో సెట్లో గాడిద లాంటి జంతువులను ఉపయోగించడం హాస్యాస్పదం కాదని, వినోదం కోసం జంతువులను ఉపకరణాలుగా ఉపయోగించడం మానుకోవాలని సల్మాన్ను ఆ లేఖలో తెలిపారు. కంటెస్టెంట్లలో ఒకరైన అడ్వకేట్ సదావర్తే గాడిదనే ఆ హౌజ్లోకి తీసుకొచ్చారని ఆ లేఖలో పేర్కొన్నారు.
సల్మాన్ ఖాన్ ఫన్నీ కామెంట్స్
బిగ్ బాస్ 18 గ్రాండ్ ప్రీమియర్ రోజున గాడిదను కంటెస్టెంట్గా పరిచయం చేసిన సల్మాన్ ఖాన్ హోజ్లో ఉన్న సమయంలో దాని బాగోగులను మిగతా కంటెస్టెంట్లకు కూడా అప్పగించాడు. స్టేజీపై గాడిదను గద్ రాజ్ అని సంబోధిస్తూ.. "ఒకవేళ నువ్ గెలిస్తే నేను నీ చేతులు ఎలా లేపాలి. సరే చెవులను లేపుతాలే" అన్నట్లుగా ఫన్నీ కామెంట్స్ చేశాడు సల్మాన్ ఖాన్.
ఇదిలా ఉంటే, సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ హిందీ 18 సీజన్ అక్టోబర్ 6 నుంచి కలర్స్ టీవీ, జియో సినిమా ఓటీటీలో ప్రసారం అవుతోంది.