Bholaa Shankar OTT Release Date: భోళా శంకర్ సినిమా ఓటీటీలోకి ఆరోజునే రానుందా..: వివరాలివే-bholaa shankar movie may release on netflix ott platform on september 18 check details here ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bholaa Shankar Ott Release Date: భోళా శంకర్ సినిమా ఓటీటీలోకి ఆరోజునే రానుందా..: వివరాలివే

Bholaa Shankar OTT Release Date: భోళా శంకర్ సినిమా ఓటీటీలోకి ఆరోజునే రానుందా..: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 20, 2023 04:51 PM IST

Bholaa Shankar OTT Release Date: భోళా శంకర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైనట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు.

Bholaa Shankar OTT Release Date: భోళా శంకర్ సినిమా ఓటీటీలోకి ఆరోజునే రానుందా
Bholaa Shankar OTT Release Date: భోళా శంకర్ సినిమా ఓటీటీలోకి ఆరోజునే రానుందా

Bholaa Shankar OTT Release Date: మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆగస్టు 11న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి నుంచి నెగెటివ్ టాక్‍ను తెచ్చుకుంది. యాక్టింగ్, డాన్స్, యాక్షన్‍తో మెగాస్టార్ చిరంజీవి అదరగొట్టినా.. డైరెక్షన్‍లో మెహర్ రమేశ్ తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో భోళా శంకర్ చిత్రం పరాజయంగా నిలిచింది. కాగా, ఈ సినిమా ఓటీటీ రిలీజ్‍పై తాజాగా ఓ సమాచారం బయటికి వచ్చింది.

భోళా శంకర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ప్లాట్‍ఫామ్ ‘నెట్‍ఫ్లిక్స్’ దక్కించుకుంది. తాజాగా, భోళా శంకర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి సమాచారం బయటికి వచ్చింది. సెప్టెంబర్ 18వ తేదీన నెట్‍‍ఫ్లిక్స్ ప్లాట్‍ఫామ్‍లో భోళా శంకర్ సినిమా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

భోళా శంకర్ చిత్రానికి జరిగిన బిజినెస్‍లో ఇప్పటి వరకు 60శాతం కూడా రికవరీ కాలేదని తెలుస్తోంది. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విఫలమవటంతో చిరంజీవి, అనిల్ మధ్య విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. అయితే, అనిల్ సుంకర ఆ పుకార్లను పూర్తిగా ఖండించారు. అవన్నీ అబద్ధాలేనని స్పష్టం చేశారు.

తమిళ మూవీ వేదాళంకు రీమేక్‍గా భోళా శంకర్ చిత్రం రూపొందింది. ఈ సినిమాను డైరెక్టర్ మెహర్ రమేశ్ ఔటేడెట్‌గా తెరకెక్కించారని విమర్శలు వస్తున్నాయి. చిరంజీవి చేయాల్సిందంతా చేసినా టేకింగ్‍లో లోపాలతో భోళా శంకర్ నిరాశపరిచిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

భోళాశంకర్ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్‍గా నటించారు. కీర్తిసురేశ్, సుశాంత్, మురళీ శర్మ, రఘుబాబు, రవిశంకర్, వెన్నెల కిశోర్, తులసి, గెటప్ శీను కీలకపాత్రలు పోషించారు. మహతీ స్వరసాగర్ సంగీతం అందించారు.

IPL_Entry_Point