Bhairava Anthem: భైరవ ఆంథెమ్ వచ్చేసింది.. కల్కి 2898 ఏడీ మూవీ నుంచి దిల్జిత్, ప్రభాస్ పెప్పీ సాంగ్ రిలీజ్-bhairava anthem from kalki 2898 ad out prabhas diljit dosanjh song ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhairava Anthem: భైరవ ఆంథెమ్ వచ్చేసింది.. కల్కి 2898 ఏడీ మూవీ నుంచి దిల్జిత్, ప్రభాస్ పెప్పీ సాంగ్ రిలీజ్

Bhairava Anthem: భైరవ ఆంథెమ్ వచ్చేసింది.. కల్కి 2898 ఏడీ మూవీ నుంచి దిల్జిత్, ప్రభాస్ పెప్పీ సాంగ్ రిలీజ్

Hari Prasad S HT Telugu
Jun 16, 2024 08:39 PM IST

Bhairava Anthem: కల్కి 2898 ఏడీ మూవీ నుంచి భైరవ ఆంథెమ్ వచ్చేసింది. ప్రభాస్, పాపులర్ పంజాబీ, బాలీవుడ్ సింగర్ దిల్జిత్ దోసాంజ్ పాడిన ఈ సాంగ్ ఆదివారం (జూన్ 16) రిలీజైంది.

భైరవ ఆంథెమ్ వచ్చేసింది.. కల్కి 2898 ఏడీ మూవీ నుంచి దిల్జిత్, ప్రభాస్ పెప్పీ సాంగ్ రిలీజ్
భైరవ ఆంథెమ్ వచ్చేసింది.. కల్కి 2898 ఏడీ మూవీ నుంచి దిల్జిత్, ప్రభాస్ పెప్పీ సాంగ్ రిలీజ్

Bhairava Anthem: కల్కి 2898 ఏడీ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ భైరవ ఆంథెమ్ వచ్చేసింది. అయితే ప్రస్తుతానికి ఈ పాట ఆడియో వెర్షన్ మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలుగు, పంజాబీ కలయికతో వచ్చిన ఈ ఆడియో సాంగ్ ఆకట్టుకునేలా సాగింది. దీనికి సంబంధించిన పూర్తి వీడియో సాంగ్ సోమవారం (జూన్ 17) ఉదయం 11 గంటలకు రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

భైరవ ఆంథెమ్ సాంగ్

కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. దీంతో మూవీ ప్రమోషన్ల జోరు పెరిగింది. ఏదో ఒకరకంగా ఈ సినిమాపై ఉన్న హైప్ ను అలాగే కొనసాగించడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా బుజ్జిని పరిచయం చేయడం, బుజ్జి, భైరవ యానిమేటెడ్ సిరీస్ తీసుకురావడం చేశారు. ఇప్పుడు భైరవ ఆంథెమ్ పేరుతో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు.

అయితే ప్రస్తుతానికి ఇది కేవలం ఆడియో వెర్షన్ అందుబాటులో ఉంది. ఫుల్ వీడియో సాంగ్ సోమవారం (జూన్ 17) ఉదయం 11 గంటలకు రానుంది. ఈ ఆడియో సాంగ్ కూడా పంజాబీ, తెలుగు మిక్సింగ్ ఉండటం విశేషం. పంజాబీ పాటను దిల్జిత్ దోసాంజ్ పాడగా.. తెలుగులో దీపక్ బ్లూస్ పాడాడు. మిగతా అన్ని భాషల్లోనూ పంజాబీ లిరిక్స్ అలాగే ఉంచి తెలుగు లిరిక్స్ ను ఆయా భాషలతో రీప్లేస్ చేశారు.

ఒక రోజు ఆలస్యంగా వీడియో..

సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించిన ఈ పాటను ప్రయోగాత్మకంగా ఇలా తెలుగు, పంజాబీ భాషల్లో తీసుకురావడం విశేసం. భైరవ ఆంథెమ్ అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫామ్ లపై అందుబాటులో ఉంది. 2 నిమిషాల 43 సెకన్ల పాటు ఈ పాట సాగింది. శనివారమే ఈ పాటకు సంబంధించిన ప్రోమోను తీసుకొచ్చారు. ఆదివారం (జూన్ 16) వీడియో సాంగ్ రిలీజ్ చేయాల్సి ఉన్నా.. ముందుగా ఆడియో తీసుకొచ్చి తర్వాత ఒక రోజు ఆలస్యంగా పూర్తి వీడియో తీసుకురానున్నారు.

ఈ భైరవ ఆంథెమ్ బాగుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. డిఫరెంట్ ఫీల్ తో ఈ పాట సాగిపోయింది. ఇక వీడియో సాంగ్ లో ప్రభాస్ ఓ పంజాబీలా కనిపించనుండటం కూడా ఆసక్తి రేపుతోంది. ఈ సాంగ్ వీడియో కోసం ఫ్యాన్స్ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో భైరవ అనే పాత్రలో ప్రభాస్ నటించాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది. రిలీజ్ కు ముందు మరో ట్రైలర్ కూడా తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా భారీగానే ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ ముందు థియేట్రికల్, డిజిటల్ హక్కుల ద్వారానే మూవీ బడ్జెట్ లో చాలా వరకు మేకర్స్ కు తిరిగి వచ్చింది.

WhatsApp channel