Kolkata Doctor Rape Case: కోల్‌కతా డాక్టర్ రేప్ కేసుపై హీరోయిన్ పోస్ట్.. ఆ వెంటనే అత్యాచార బెదిరింపులు
Actress Mimi Chakraborty Get Rape Threats: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ రేప్ కేసు ఘటనపై పోస్ట్ చేసిన హీరోయిన్, తృణమూల్ కాంగ్రెస్ మాజీ సభ్యురాలు మిమీ చక్రవర్తికి అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి మద్దతుగా పోస్ట్ చేసిన తర్వాతే ఈ బెదిరింపులు వస్తున్నట్లు నటి తెలిపారు.
Actress Mimi Chakraborty Get Rape Threats: కోల్‌కతా ట్రైనీ మహిళా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది. గత కొన్ని రోజులుగా బాధితురాలికి మద్దతుగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృషిస్టున్న ఈ ఘటనపై అనేకమంది సెలబ్రిటీలు స్పందిస్తూ బాధితురాలికి తమ మద్దతును తెలియజేశారు.
బెదిరింపులు
బాధితురాలికి న్యాయం జరగలంటూ, నేరస్థులకు శిక్ష పడాలంటూ నిరసనలు, ర్యాలీలు జరిగాయి. అయితే, ఆ వైద్యురాలికి మద్దతుగా నిలుస్తున్న కొంతమందికి బెదిరింపులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బాధితురాలికి మద్దతు తెలిపిన హీరోయిన్, తృణమూల్ కాంగ్రెస్ మాజీ సభ్యురాలు అయిన మిమీ చక్రవర్తికి సైతం బెదిరింపులు వస్తున్నాయని తాజాగా తెలిపారు.
సపోర్ట్‌గా పోస్ట్‌లు
అయితే, ఇటీవల కోల్‌కతా ఘటన వైద్యురాలికి మద్దతుగా నిరసనలో సైతం పాల్గొన్నారు మిమీ చక్రవర్తి. అనంతరం ఆమెకు సపోర్ట్‌గా సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు పెట్టారు. అయితే, ఈ పోస్ట్‌లు పెట్టిన వెంటనే తనకు రేప్ బెదిరింపులు వస్తున్నాయని తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు మిమీ చక్రవర్తి.
సెబర్ సెల్‌కు ట్యాగ్
ఈ విషయాన్ని మంగళవారం (ఆగస్ట్ 20) నాడు సోషల్ మీడియాలో నటి మిమీ చక్రవర్తి పోస్ట్ ద్వారా తెలిపారు. అత్యాచార బెదిరింపులు, అసభ్యకరమైన సందేశాలు వస్తున్నాయని పంచుకున్నారు. ఈ పోస్ట్‌లో మిమీ కోల్‌కతా పోలీసుల సైబర్ సెల్ విభాగానికి కూడా ట్యాగ్ చేశారు. అలాగే బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశారు నటి.
విషపూరితమైన పురుషులు
"మేము మహిళలకు న్యాయం చేయాలనే ప్రయత్నిస్తున్నాం కదా. మేము మహిళల హక్కుల కోసం పోరాడుతుంటే కొందరు సోషల్ మీడియాలో అత్యాచారా బెదిరింపులు చేస్తున్నారు. ఇవి వాటిలో ఇవి కొన్ని మాత్రమే. రేప్ బెదిరింపులు చాలా సాధారణం అయిపోయాయి. విషపూరితమైన పురుషులు ముసుగులు వేసుకుని తాము మహిళలకు అండగా నిలుస్తున్నట్లు గుంపులో చేరుతున్నారు. మీరు ఎలాంటి పెంపకంలో పెరిగారు. మీ చదువు మీకు ఏం నేర్పింది అని మిమీ రాసుకొచ్చారు.
నిరసనలో హీరోయిన్
ప్రస్తుతం మిమీ చక్రవర్తి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా నటి మిమీ వ్యక్తిగతంగా నిరసనలో పాల్గొన్నారు. మిమీతో పాటు, రిద్ధి సేన్, అరిందమ్ సిల్, మధుమిత సర్కార్ వంటి నటులు కూడా ఆగస్టు 14 రాత్రి జరిగిన నిరసనలో పాల్గొన్నారు.
2012 నుంచి హీరోయిన్‌గా
ఇదిలా ఉంటే, 2008 నుంచి సీరియల్స్‌లో నటించారు మిమీ చక్రవర్తి. ఆ తర్వాత 2012 నుంచి సినిమాల్లో హీరోయిన్‌గా నటించడం స్టార్ట్ చేశారు. శుధ్ తొమారి జోన్యో, కి కోర్ టోకె బోల్బో, కెలోర్ కిర్తి, గ్యాంగ్‌స్టార్ వంటి బెంగాళీ సినిమాల్లో మిమీ చక్రవర్తి హీరోయిన్‌గా నటించారు. అనంతరం 2019 నుంచి 2024 వరకు జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ తరఫున పార్లమెంట్ సభ్యురాలిగా పని చేశారు.