ఉరి తీయండి వాడిని.. కోల్‌కతా నిందితుడు సంజయ్ రాయ్‌పై అతడి అత్త సెన్సేషనల్ కామెంట్స్
Kolkata Doctor Rape Case : కోల్‌కతా హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్‌ని కఠినంగా శిక్షించాలని ఇప్పటికే డిమాండ్లు వస్తున్నాయి. తాజాగా అతడి అత్త కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సంజయ్‌ని ఉరి తీయాలన్నారు. తన కుమార్తె జీవితాన్ని నాశనం చేశాడని చెప్పుకొచ్చారు.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు సీబీఐ ఈ కేసును సీరియస్‌గా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వస్తున్నాయి. అయితే నిందితుడు సంజయ్ రాయ్ అత్త కూడా అతడిపై కామెంట్స్ చేసింది. తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసినట్టుగా ఆమె చెప్పుకొచ్చారు. సంజయ్ రాయ్ మూడు నెలల గర్భిణీ భార్యను కొట్టడం ద్వారా ఆమెకు గర్భస్రావానికి కారణమయ్యాడని కూడా ఆమె చెప్రారు. చేసిన నేరానికి ఉరితీయాలని అతడి అత్త డిమాండ్ చేశారు.
సంజయ్ రాయ్‌తో తన కుమార్తె అనుభవాన్ని వివరిస్తూ.. రాయ్ తన కుమార్తెను కొట్టాడంపై పోలీసు ఫిర్యాదు నమోదైందని పేర్కొంది. 'అతనితో మా సంబంధాలు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. మొదట్లో ఆరు నెలలు నా కుమార్తెతో అంతా బాగానే ఉంది. మూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నా కూతురికి గర్భస్రావం అయ్యేలా కొట్టాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాం. నా కుమార్తె అనారోగ్యంతో ఇబ్బందిపడింది. ఖర్చులన్నీ నేనే భరించాను. సంజయ్ మంచివాడు కాదు. అతన్ని ఉరితీయాలి. అయితే ఈ విషయాన్ని అతను ఒంటరిగా చేయలేడు. ' నిందితుడి అత్త చెప్పుకొచ్చింది.
RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్యలో ఎక్కువ మంది వ్యక్తుల ప్రమేయం ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎందుకంటే సంజయ్ రాయ్ ఒంటరిగా చేయలేడని ఆమె పేర్కొంది.
గత సోమవారం నిందితుడు సంజయ్ రాయ్ అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారణ చేస్తోంది. నేరం చేస్తున్నప్పుడు సంజయ్ ఒంటరిగా ఉన్నాడా? లేదా ఇంకా ఎవరైనా ఉన్నారా? అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. పాలిగ్రాఫ్ పరీక్ష కోసం సీబీఐకి అనుమతి కూడా లభించింది. సీబీఐ ఇంకా పరీక్ష తేదీని షెడ్యూల్ చేయలేదని ఓ అధికారి తెలిపారు.
నిబంధనల ప్రకారం, నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి, అతను పాలిగ్రాఫ్ పరీక్షకు అంగీకరిస్తాడా? అని ఆ వ్యక్తిని అడుగుతారని ఆ అధికారి వెల్లడించారు. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహాం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది.
ఆగస్టు 18న కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ వార్డులో సీబీఐ బృందం 3డి లేజర్ మ్యాపింగ్‌ను పరిశీలించింది. మరోవైపు జనవరి 2021 మధ్య కాలంలో RG కర్ హాస్పిటల్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ చేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది.