Balakrishna Nara Lokesh: బాలకృష్ణకు క్షణికావేశం.. మామపై అల్లుడు నారా లోకేష్ కామెంట్స్.. పాత వీడియో వైరల్-ap minister nara lokesh comments on balakrishna angry in interview with prema the journalist over unstoppable 4 ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Balakrishna Nara Lokesh: బాలకృష్ణకు క్షణికావేశం.. మామపై అల్లుడు నారా లోకేష్ కామెంట్స్.. పాత వీడియో వైరల్

Balakrishna Nara Lokesh: బాలకృష్ణకు క్షణికావేశం.. మామపై అల్లుడు నారా లోకేష్ కామెంట్స్.. పాత వీడియో వైరల్

Sanjiv Kumar HT Telugu

Nara Lokesh About Balakrishna Angry: నందమూరి బాలకృష్ణపై ఆయన అల్లుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలకృష్ణకు క్షణికావేశం ఎక్కువ అని నారా లోకేష్ చేసిన కామెంట్స్ అన్‌స్టాపబుల్ 4 ఓటీటీ రిలీజ్ సందర్భంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలకృష్ణకు క్షణికావేశం.. మామపై అల్లుడు నారా లోకేష్ కామెంట్స్.. పాత వీడియో వైరల్

Nara Lokesh About Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా బాలయ్య బాబుకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. జై బాలయ్య అనే నినాదం ఇతర దేశాల్లోను గట్టిగా వినిపిస్తుంది. ఇక బాలకృష్ణ నిజజీవితంలో ఉండే తీరు గురించి అందరికీ తెలిసిందే.

ఒక సైడ్ మాత్రమే

తన దగ్గరికి వెళ్లిన అభిమానులను బాలకృష్ణ కసురుకోవడం, ఫోన్ పడేయడం, తిట్టడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే, అది బాలకృష్ణకు ఒక సైడ్ మాత్రమే అని మరో సైడ్ ఆయన చిన్నపిల్లాడిలా ఉంటారని, ఎంతో జెన్యూన్‌ పర్సన్ అని ఎంతోమంది సెలబ్రిటీలు పొగిడారు.

అన్‌స్టాపబుల్ 4 రిలీజ్

అయితే, ప్రస్తుతం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 25 నుంచి ఆహాలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్‌స్టాపబుల్ 4 మొదటి ఎపిసోడ్‌కు చీఫ్ గెస్ట్‌గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారనే టాక్ నడుస్తోంది.

ఎన్నికల కంటే ముందు

ఈ నేపథ్యంలో తాజాగా బాలకృష్ణపై ఆయన అల్లుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. సుమారు తొమ్మిది నెలల క్రితం బాలయ్యపై లోకేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు అన్‌స్టాపబుల్ 4 లాంచ్ సందర్భంగా వైరల్ అవడం విశేషంగా మారింది. అయితే, ఈ కామెంట్స్ 2024 ఏపీ ఎన్నికల కంటే ముందు ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేష్ మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

కష్టపడే మనస్తత్వం

"వీళ్లలో ఉన్న బెస్ట్ క్వాలిటీ చెప్పండి" అని పేర్లు చదివారు జర్నలిస్ట్ ప్రేమ. "మీ అమ్మగారు భువనేశ్వరి" అని జర్నలిస్ట్ అడిగితే.. "డిసిప్లిన్" (క్రమశిక్షణ) అని నారా లోకేష్ చెప్పారు. "నాన్నగారు" అన్నదానికి "పట్టుదల, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే మనస్తత్వం" అని నారా లోకేష్ బదులిచ్చారు.

బెస్ట్ క్వాలిటీనా

"బాలయ్య గారు. మీ మావగారు" అని యాంకర్ అడిగినప్పుడు "క్షణికావేశం" అని నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. దాంతో జర్నలిస్ట్ ప్రేమ ఒక్కసారిగా నవ్వారు. "అది బెస్ట్ క్వాలిటా. నిజంగా" అని ఆశ్చర్యంగా అడిగితే.. అవును.. స్పీడ్‌గా తిడతారు.. అంతే స్పీడ్‌గా దగ్గరికి తీసుకుంటారు. ఆయన దులిపేసుకుని వెళ్లేరకం మనిషి. మనసుకు ఏది తీసుకోడు ఆయన. పోనీలేరా అని దులిపేసుకుని వెళ్లిపోతారు" అని నారా లోకేష్ వివరణ ఇచ్చారు.

చైల్డ్ లైఫ్ మెంటాలిటీ

"నాకు అయితే.. ఐ జస్ట్ ఐ లవ్ హిమ్ అండి. చైల్డ్ లైఫ్ మెంటాలిటీ. హీ ఈజ్ సో గుడ్. ఎప్పుడు ఆయన ఇంటర్వ్యూ" అని జర్నలిస్ట్ ప్రేమ చెప్పబోతుంటే.. "హీ ఈజ్ వెరీ ప్యూర్ (స్వచ్ఛమైన మనిషి)" అని నారా లోకేష్ అన్నారు. "యా అవును ప్యూర్ పర్సన్" అని ప్రేమ అన్నారు.

గొప్పగా చెప్పిన లోకేష్

"ఆయన చాలా చాలా ప్యూర్ పర్సన్. చాలా ఎమోషనల్లీ కనెక్టెడ్ పర్సన్. అది చాలా మందికి తెలియదు. చాలా ఎమోషనల్" అని బాలకృష్ణ గురించి నారా లోకేష్ గొప్పగా చెప్పారు. ఇలా గతంలో బాలకృష్ణపై నారా లోకేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.