Anupama Parameswaran: ఆసక్తిని రేపేలా అనుపమ పరమేశ్వరన్ కొత్త సినిమా టీజర్: చూసేయండి-anupama parameswaran lockdown thriller movie released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anupama Parameswaran: ఆసక్తిని రేపేలా అనుపమ పరమేశ్వరన్ కొత్త సినిమా టీజర్: చూసేయండి

Anupama Parameswaran: ఆసక్తిని రేపేలా అనుపమ పరమేశ్వరన్ కొత్త సినిమా టీజర్: చూసేయండి

Lockdown Teaser - Anupama Parameswaran: లాక్‍డౌన్ సినిమా టీజర్ వచ్చేసింది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ టీజర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది.

Anupama Parameswaran: ఆసక్తిని రేపేలా అనుపమ పరమేశ్వరన్ కొత్త సినిమా టీజర్: చూసేయండి

Lockdown Teaser: స్టార్ హీరోయిన్‍గా ఉన్న అనుపమ పరమేశ్వరన్.. ప్రస్తుతం రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. లాక్‍డౌన్, పరదా చిత్రాల్లో ఆమె ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా, లాక్‍డౌన్ సినిమా నుంచి నేడు (జూన్ 9) టీజర్ రిలీజ్ అయింది. కరోనా సమయంలో విధించిన లాక్‍డౌన్ బ్యాక్‍డ్రాప్‍లో థ్రిల్లర్ మూవీగా ఇది ఉండనుంది.

టీజర్ ఇలా..

లాక్‍డౌన్ టీజర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది. దేశవ్యాప్తంగా లాక్‍డౌన్ విధించినట్టు టీవీలో న్యూస్ చూశాక తన తండ్రికి అనుపమ టెన్షన్‍గా ఫోన్ చేయడంతో ఈ టీజర్ మొదలైంది. ఆ తర్వాత ఎవరి కోసమో వెతికేందుకు రోడ్లపై పరుగెత్తుతారు అనుపమ. అనిత (అనుపమ) అంటూ మహిళ పిలుస్తారు. ఇక ఆ తర్వాత ఆమె నిస్సహాయంగా ఉంటారు. ఇలా లాక్‍డౌన్ టీజర్ ఆసక్తిని రేపేలా ఇంటెన్స్‌గా ఉంది. అనుపమ లుక్ చాలా సీరియస్‍గా ఉంది.

లాక్‍డౌన్ చిత్రానికి ఏఆర్ జీవా దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా లాక్‍డౌన్ బ్యాక్‍డ్రాప్‍లో ఇంటెన్స్ థ్రిల్లర్ డ్రామాగా ఈ చిత్రం ఉండేలా కనిపిస్తోంది. టీజర్లో మూవీ రిలీజ్ డేట్‍ను టీమ్ ప్రకటించలేదు. అయితే జూన్‍లోనే విడుదల చేయనున్నట్టు కన్ఫర్మ్ చేసింది.

లాక్‍డౌన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ మెయిల్ రోల్ చేస్తుండగా.. చార్లీ, నిరోషా, ప్రియా వెంకట్, లివింగ్ స్టోన్, ఇందుమతి, రాజ్‍కుమార్, షార్మి, లొల్లు సబా మారన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో ఈ మూవీ రూపొందుతోంది. తెలుగులోనూ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

లాక్‍డౌన్ మూవీని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. ఈ చిత్రానికి ఆర్ రఘునాథన్, సిద్ధార్థ్ విపిన్ సంగీత దర్శకులుగా ఉన్నారు. “నిరీక్షణ ముగిసింది. లాక్‍డౌన్ టీజర్ తీసుకొచ్చేశాం. గందరగోళం, ఎత్తుకు పైఎత్తులు ఉండే కథలోకి వచ్చేయండి” అంటూ ఈ టీజర్ రిలీజ్ చేసింది లైకా ప్రొడక్షన్స్.

అనుపమ వరుస సినిమాలు

ఈ ఏడాది టిల్లు స్క్వేర్ మూవీతో బిగ్ సక్సెస్ అందుకున్నారు అనుపమ పరమేశ్వరన్. సిద్ధు జొన్నలగడ్డ సరసన ఆ చిత్రంలో హీరోయిన్‍గా నటించారు. బోల్డ్‌గా గ్లామరస్ రోల్ చేశారు. ఇప్పుడు వరుస సినిమాలతో అనుపమ బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం ముందుగా లాక్‍డౌన్ మూవీని పూర్తి చేయనున్నారు. పరదా పేరుతో మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని కూడా అనుపమ చేస్తున్నారు. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ రాగా.. అనుపమ తలపై చీర కొంగు కప్పుకొని.. మిగిలిన వారు ముఖానికి ముసుగు వేసుకొని ఉన్నారు. ఈ ఫస్ట్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్‍గా అనిపించింది.

మలయాళంలో పెట్ డిటెక్టివ్ అనే మూవీకి కూడా అనుపమ ఓకే చెప్పారు. ప్రణీశ్ విజయన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైంది. అలాగే, మరో మలయాళం చిత్రానికి కూడా సైన్ చేశారు. తమిళంలో బైసన్ చిత్రంలోనూ అనుపమ నటిస్తున్నారు. ఈ స్పోర్డ్స్ డ్రామా చిత్రంలో ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తుండగా.. మారి స్వెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా వరుస చిత్రాలతో అనుపమ జోరు మీద ఉన్నారు.