Animal Telugu Rights: యానిమల్ మూవీ తెలుగు హక్కులను దిల్‌రాజు ఎన్ని కోట్లకు దక్కించుకున్నారంటే..!
Animal Movie Telugu Rights: యానిమల్ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు దక్కించుకున్నారు. ఎన్ని కోట్లకు ఆయన ఈ రైట్స్ తీసుకున్నారో తాజాగా సమాచారం బయటికి వచ్చింది.
Animal Movie Telugu Rights: బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ సింగ్ హీరోగా నటించిన యానిమల్ సినిమాపై హైప్ మామూలుగా లేదు. ట్రైలర్ తర్వాత ఈ సినిమాపై క్రేజ్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించడంతో తెలుగులోనూ యానిమల్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ రావడం పక్కాగా మారింది. డిసెంబర్ 1వ తేదీన యానిమల్ సినిమా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. కాగా, యానిమల్ సినిమా తెలుగు హక్కుల డీల్ గురించి తాజాగా సమాచారం వెల్లడైంది.
యానిమల్ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు దక్కించుకున్నారు. బాలీవుడ్లో రూపొందిన ఈ సినిమా తెలుగు డబ్బింగ్లోనూ రిలీజ్ అవుతోంది. యానిమల్ సినిమా తెలుగు రైట్స్‌ను దిల్‌రాజు రూ.15 కోట్లకు చేజిక్కించుకున్నారని సమాచారం బయటికి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు దిల్‌రాజు ప్లాన్ చేశారు. అందుకు అనుగుణంగా ఈ సినిమాపై మంచి క్రేజ్ ఉంది.
యానిమల్ సినిమాపై ఉన్న హైప్, అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే భారీ ఓపెనింగ్ ఖాయంగా కనిపిస్తోంది. తెలుగులోనూ ఈ చిత్రం లాభాల పంట పడిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అలాగే, యూనిమల్ మూవీ టీమ్ కూడా తెలుగు ప్రమోషన్లను జోరుగానే చేస్తోంది. ప్రమోషన్లలో భాగంగా ఇటీవల అన్‌స్టాపబుల్ షోలో హీరో రణ్‌బీర్, హీరోయిన్ రష్మిక మందన్న, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పాల్గొన్నారు. దీంతో తెలుగులో యానిమల్కు మంచి ప్రచారం లభించింది.
హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్
యానిమల్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగనుంది. నవంబర్ 27వ తేదీన హైదరాబాద్ దూలపల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ ప్రకటించింది.
ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా వైలెన్స్, ఎమోషన్స్, తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో యానిమల్‌ను తెరకెక్కించారు దర్శకుడు సందీప్ రెడ్డి. ట్రైలర్లో హీరో రణ్‌బీర్ యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబి డియోల్, తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, శక్తికపూర్, ప్రేమ్ చోప్రా, సురేశ్ ఒబెరాయ్ కీలకపాత్రలు పోషించారు. భూషణ్ కుమార్, కృషన్ కుమార్, మురాత్ ఖేతానీ, ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.