Anasuya: ఇదేం గేమ్.. షర్ట్ విప్పిన శేఖర్ మాస్టర్.. బ్లేజర్ తీసిన అనసూయ.. స్టార్ మాలో కొత్త షో ప్రోమో-anasuya bharadwaj removes jacket and sekhar master shirt off star maa tv new show kiraak boys khiladi girls promo ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anasuya: ఇదేం గేమ్.. షర్ట్ విప్పిన శేఖర్ మాస్టర్.. బ్లేజర్ తీసిన అనసూయ.. స్టార్ మాలో కొత్త షో ప్రోమో

Anasuya: ఇదేం గేమ్.. షర్ట్ విప్పిన శేఖర్ మాస్టర్.. బ్లేజర్ తీసిన అనసూయ.. స్టార్ మాలో కొత్త షో ప్రోమో

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 23, 2024 03:48 PM IST

Anasuya Bharadwaj - Sekhar Master: స్టార్ మా టీవీ ఛానెల్‍లో కిర్రాక్ బాయ్స్, ఖిలాడీ గర్ల్స్ పేరుతో కొత్త షో వస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో వచ్చింది. అయితే, స్టేజీపై అనసూయ తన బ్లేజర్ తీయడం వైరల్‍గా మారింది.

Anasuya: ఇదేం గేమ్.. షర్ట్ విప్పిన శేఖర్ మాస్టర్.. బ్లేజర్ తీసిన అనసూయ.. స్టార్ మాలో కొత్త షో ప్రోమో
Anasuya: ఇదేం గేమ్.. షర్ట్ విప్పిన శేఖర్ మాస్టర్.. బ్లేజర్ తీసిన అనసూయ.. స్టార్ మాలో కొత్త షో ప్రోమో

Anasuya Bharadwaj: టీవీ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్, ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కలిసి ఈ షోలో టీమ్ లీడర్లుగా కనిపించనున్నారు. ‘కిర్రాక్ బాయ్స్ - ఖిలాడీ లేడీస్’ పేరుతో ఈ గేమ్ షో వస్తోంది. జూన్ 29వ తేదీ నుంచి ప్రతీ శనివారం, ఆదివారం స్టార్ మా ఛానెల్‍లో ప్రసారం కానుంది. ఈ ఆదివారం(జూన్ 23)తో ‘నీతోనే డ్యాన్స్ 2.0’ షో పూర్తి కానుండటంతో ఇక జూన్ 29వ తేదీ నుంచి ఆ కొత్త షోను స్టార్ మా తీసుకొస్తోంది. ‘కిర్రాక్ బాయ్స్ - ఖిలాడీ లేడీస్’ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోను స్టార్ మా అప్పుడే రిలీజ్ చేసింది. అయితే, ఈ ప్రోమోలో అనసూయ తన బ్లేజర్ తీయడం, శేఖర్ మాస్టర్ షర్ట్ విప్పడం అవాక్కయ్యేలా చేసింది. ఈ ప్రోమో ఎలా ఉందంటే..

బిగ్‍బాస్ కంటెస్టెంట్లతో..

‘కిర్రాక్ బాయ్స్ - ఖిలాడీ లేడీస్’ షోలో బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍లో పాల్గొన్న కంటెస్టెంట్లు కొందరు ఉన్నారు. టేస్టీ తేజ, అమర్ దీప్ చౌదరి, అంబటి అర్జున్ ఈ ప్రోమోలో కనిపించారు. శోభా శెట్టి, ప్రియాంక కూడా ఉన్నారు. అలాగే, కొందరు సీరియల్స్ యాక్టర్లు కూడా పాల్గొంటున్నారు. ఈ షో గెలిచిన వారికి రూ.20లక్షల ప్రైజ్‍మనీ అని యాంకర్ శ్రీముఖి ప్రకటించారు.

ఈ గేమ్ షోలో కిర్రాక్ బాయ్స్ టీమ్‍కు శేఖర్ మాస్టర్ లీడర్‌గా ఉంటే.. ఖిలాడీ లేడీస్ టీమ్‍కు అనసూయ లీడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ ఇద్దరూ చాలెంజ్ చేసుకోవడంతో ఈ షో ప్రోమో మొదలైంది. ఆ తర్వాత యాంకర్ శ్రీముఖి ఎంట్రీ ఇచ్చారు. శోభాశెట్టి, ప్రియాంక ఉన్న ఖిలాడీ లేడీస్‍కు మిర్చీ, వెల్లుల్లిపాయలు తినాలనే డేర్ ఇచ్చారు శేఖర్. గ్లిజరిన్ లేకుండా ఏడ్వాలని బాయ్స్ జట్టుకు అనుసూయ సవాల్ చేశారు.

‘కిర్రాక్ బాయ్స్ - ఖిలాడీ లేడీస్’ ఫస్ట్ ఎపిసోడ్ సందడిగా సాగింది. టీమ్‍ల మధ్య ఛాలెంజ్‍లతోనే ఈ గేమ్ షో ఉన్నట్టు అర్థమవుతోంది. విన్నింగ్ ప్రైజ్ రూ.20లక్షలుగా ఉంది.

ఆఖర్లో షాక్

ఈ తొలి ఎపిసోడ్ ప్రోమోలో చివర్లో అవాక్కయ్యే విషయం జరిగింది. గేమ్ చేంజర్స్ అని శేఖర్, అనసూయను శ్రీముఖి అన్నారు. ఫైనల్ డిసైడింగ్ ఇదే అంటూ చెప్పారు. ఆ తర్వాత అనసూయ తాను వేసుకున్న బ్లేజర్ (జాకెట్) విప్పారు. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ కూడా షర్ట్ తీశారు. దీంతో ఇక్కడ ఉన్న కంటెస్టెంట్లంతా అరుస్తూ గోల చేశారు. దీంతో ప్రోమో ముగిసింది.

గేమ్ షోలో స్టేజ్‍పై షర్ట్, బ్లేజర్ విప్పడంపై సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఏం జరుగుతోంది అక్కడ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గేమ్ షోలో ఏంటిది అంటూ కొందరు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఛాలెంజ్ ఏంటో చూడాలంటే తొలి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

‘కిర్రాక్ బాయ్స్ - ఖిలాడీ లేడీస్’ స్టార్ మా ఛానెల్‍లో జూన్ 29వ తేదీవ తేదీన మొదలుకానుంది. ప్రతీ శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. అబ్బాయిలు, అమ్మాయిల టీమ్‍లు, అనసూయ, శేఖర్ మాస్టర్, శ్రీముఖి ఉండటంతో సందడిగా ఈ షో ఉండేలా కనిపిస్తోంది.

WhatsApp channel