Allu Arjun Show in Aha: ఆహాలో అల్లు అర్జున్ షో.. బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది-allu arjun show in aha as the ott says biggest announcement is coming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun Show In Aha: ఆహాలో అల్లు అర్జున్ షో.. బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది

Allu Arjun Show in Aha: ఆహాలో అల్లు అర్జున్ షో.. బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది

Hari Prasad S HT Telugu
Mar 15, 2023 06:42 PM IST

Allu Arjun Show in Aha: ఆహాలో అల్లు అర్జున్ షో రాబోతోందా? బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది అంటూ ఆహా ఓటీటీ ఓ ఊరించే పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్ లో చేసింది. ఇంతకీ ఆ అనౌన్స్‌మెంట్ ఏంటో గెస్ చేయగలరా?

ఆహాలో రాబోతున్న అల్లు అర్జున్
ఆహాలో రాబోతున్న అల్లు అర్జున్

Allu Arjun Show in Aha: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎన్నో ఉన్నాయి. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల కంటెంట్ ఉండే ఓటీటీలు కూడా ఉన్నాయి. కానీ కేవలం తెలుగు ప్రేక్షకుల కోసం మాత్రమే వచ్చిన ఓటీటీ ఆహా (Aha). ఇందులో తెలుగు సినిమాలు, సిరీస్, రియాల్టీ షోలు మాత్రమే స్ట్రీమ్ అవుతాయి. అలాంటి ఆహా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి చాలానే ప్రయత్నిస్తోంది.

ఇప్పటికే నందమూరి బాలకృష్ణతో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో తీసుకొచ్చింది. ఈ షో రెండు సీజన్లూ సూపర్ హిట్టే. దీంతో ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా ఓ షో ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీనే బుధవారం (మార్చి 15) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనౌన్స్ చేసింది. దీనికి ఓ అదిరిపోయే క్యాప్షన్ కూడా పెట్టింది. ఇప్పటి వరకూ అల్లు అర్జున్ ను చూడని అవతారంలో చూస్తారని చెప్పడం విశేషం.

"అల్లు అర్జున్ ని మీరు మాస్ గా, క్లాస్ గా చూసి ఉంటారు. ఈసారి ఒక బ్లాక్‌బస్టర్ లుక్ తో ఆహా మీ ముందుకు తీసుకురాబోతోంది. బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ కోసం సిద్ధంగా ఉండండి. ఏమైనా గెస్ చేయగలరా?" అంటూ ఆహా ఈ పోస్ట్ చేసింది. దీనికి స్టైలిష్ స్టార్ అదిరిపోయే స్టెప్పేస్తున్న ఫొటో పోస్ట్ చేసింది.

ఆహా ఓటీటీ అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ దే అన్న విషయం తెలిసిందే. ఓటీటీ స్పేస్ లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న ఆహా ఓటీటీ.. ఇప్పటికే అన్‌స్టాపబుల్ షోలో పవన్ కల్యాణ్, ప్రభాస్ లాంటి స్టార్లను బాలయ్య బాబుతో ఇంటర్వ్యూ చేయిస్తూ ఈ షోను హిట్ చేసింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ తో షో అనగానే అభిమానుల్లో ఎక్కడలేని ఆసక్తి నెలకొంది.

అల్లు అర్జున్ తో ఆహా ఏం చేయబోతోందో అని అంచనాలు వేసే పనిలో ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు స్పందిస్తూ.. ఇండియన్ ఐడల్ కు గెస్ట్ గా వస్తున్నాడా? డ్యాన్స్ షో లేదా ఇంటర్వ్యూ షో నా? అన్‌స్టాపబుల్ లో వస్తున్నాడా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత కథనం

టాపిక్