Telugu Daily Serials on Aha OTT: ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న సీరియ‌ల్స్ ఇవే - ఫ్రీగా చూడొచ్చు-mandakini and mister pellam daily serials to premiere on aha ott with free streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Mandakini And Mister Pellam Daily Serials To Premiere On Aha Ott With Free Streaming

Telugu Daily Serials on Aha OTT: ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న సీరియ‌ల్స్ ఇవే - ఫ్రీగా చూడొచ్చు

Nelki Naresh Kumar HT Telugu
Mar 15, 2023 01:21 PM IST

Telugu Daily Serials in Aha OTT: ఆహా ఓటీటీలో సినిమాలు, సిరీస్‌ల‌తో పాటు రెండు డైలీ సీరియ‌ల్స్ స్ట్రీమింగ్ అవుతోన్నాయి. ఆ సీరియ‌ల్స్‌ను ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా చూడొచ్చు. ఆ సీరియ‌ల్స్ ఏవంటే...

మందాకిని
మందాకిని

Telugu Daily Serials in Aha OTT: టీవీల్లోనే కాదు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో డైలీ సీరియ‌ల్స్ చూడొచ్చు. ప్ర‌స్తుతం ఆహా ఓటీటీలో రెండు తెలుగు సీరియ‌ల్స్ స్ట్రీమింగ్‌ అవుతోన్నాయి. ఈ రెండు సిరీయ‌ల్స్‌ను ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా చూడొచ్చు. మార్చి 6వ తేదీ నుంచి మందాకిని అనే డైలీ సీరియ‌ల్‌ను ప్రారంభించింది ఆహా ఓటీటీ.

సోషియా ఫాంట‌సీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సీరియ‌ల్ సోమ‌వారం నుంచి గురువారం వ‌ర‌కు ప్ర‌తిరోజు మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు ప్రీమియ‌ర్ ఉంటుంది. ఒక‌వేళ ఏదైనా ఎపిసోడ్ మిస్స‌యినా దానిని మ‌ళ్లీ చూసుకునే వెసులుబాటును క‌ల్పించింది ఆహా ఓటీటీ. ఈ సీరియ‌ల్‌లో ఆర్‌కే చంద్ర‌న్‌, హిమ‌బిందు, ప్రియా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు. మందాకినితో పాటు మిస్ట‌ర్ పెళ్లాం అనే మ‌రో డైలీ సీరియ‌ల్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

సోమ‌వారం నుంచి గురువారం వ‌ర‌కు ప్ర‌తిరోజు మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు ఈ సీరియ‌ల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఉంటుంది. ఈ సీరియ‌ల్‌లో అమ‌ర్‌దీప్ చౌద‌రి, పూజామూర్తి, సోనియా కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు. . భిన్న క‌ల‌లు క‌లిగిన ముగ్గురి జీవితాలు విధి కార‌ణంగా ఎలాంటి మ‌లుపులు తిరిగాయ‌నే పాయింట్‌తో ఈ సీరియ‌ల్‌ను తెర‌కెక్కించారు.

IPL_Entry_Point

టాపిక్