Allu Arjun Sandeep Vanga Movie Title: అల్లు అర్జున్, సందీప్ వంగా సినిమాకు మాస్ టైటిల్ ఫిక్స్‌-allu arjun sandeep vanga movie tentatively titled bhadrakali ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Allu Arjun Sandeep Vanga Movie Tentatively Titled Bhadrakali

Allu Arjun Sandeep Vanga Movie Title: అల్లు అర్జున్, సందీప్ వంగా సినిమాకు మాస్ టైటిల్ ఫిక్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 05, 2023 07:28 AM IST

Allu Arjun Sandeep Vanga Movie Title: అల్లు అర్జున్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న పాన్ ఇండియ‌న్ సినిమాను ఇటీవ‌లే అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. ఈసినిమాకు మాస్‌టైటిల్ నిర్ణ‌యించే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ టైటిల్ ఏదంటే...

అల్లు అర్జున్
అల్లు అర్జున్

Allu Arjun Sandeep Vanga Movie Title: అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ ఓ పాన్ ఇండియ‌న్ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ భారీ బ‌డ్జెట్‌ సినిమాను ఇటీవ‌లే అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. అల్లు అర్జున్ గ‌త సినిమాల‌కు భిన్న‌మైన క‌థాంశంతో ఈ సినిమా రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం.

ట్రెండింగ్ వార్తలు

చాలా కాలం పాటు అంద‌రికీ గుర్తుండిపోయే సినిమా చేయ‌బోతున్నామంటూ సందీప్‌వంగా మూవీపై అల్లు అర్జున్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశాడు. కాగా ఈ సినిమాకు భ‌ద్ర‌కాళి అనే మాస్ టైటిల్‌ను ప‌రిశీలిస్తోన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. క‌థానుగుణంగా ఈ టైటిల్ యాప్ట్ అనే ఆలోచ‌న‌లో చిత్ర యూనిట్ ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ మాస్ టైటిల్‌నే ఫిక్స్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

సందీప్ వంగా నిర్మాణ సంస్థ పేరు కూడా భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్‌ కావ‌డం గ‌మ‌నార్హం. అల్లు అర్జున్‌తో పాటు సందీప్ వంగా ప్ర‌జెంట్ క‌మిట్‌మెంట్స్ పూర్త‌యిన త‌ర్వాత ఈ పాన్ ఇండియ‌న్ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం పుష్ప -2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్‌. ఈ సీక్వెల్‌కు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఈ ఏడాది చివ‌ర‌లోగా పుష్ప సీక్వెల్ షూటింగ్ పూర్త‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్ పూర్త‌యిన త‌ర్వాతే సందీప్ వంగా సినిమాను అల్లు అర్జున్ మొద‌లుపెట్ట‌నున్నాడు.

అల్లు అర్జున్ హీరోగా న‌టించ‌నున్న 23వ సినిమా ఇది. టీ సిరీస్ సంస్థ‌తో క‌లిసి ప్ర‌ణ‌య్ వంగా ఈ సినిమాను నిర్మించ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం ర‌ణ్‌భీర్‌క‌పూర్ యానిమ‌ల్‌తో పాటు ప్ర‌భాస్‌తో స్పిరిట్ సినిమా చేయ‌బోతున్నాడు సందీప్ వంగా.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.