Samantha Alia Bhatt: ఊ అంటావా పాట పాడిన ఆలియా భట్.. పక్కనే ఉన్న సమంత రియాక్షన్ చూడండి-alia bhatt sings oo antava song samantha in all smiles in jigra movie promotions in hyderabad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Alia Bhatt: ఊ అంటావా పాట పాడిన ఆలియా భట్.. పక్కనే ఉన్న సమంత రియాక్షన్ చూడండి

Samantha Alia Bhatt: ఊ అంటావా పాట పాడిన ఆలియా భట్.. పక్కనే ఉన్న సమంత రియాక్షన్ చూడండి

Hari Prasad S HT Telugu
Oct 09, 2024 08:34 AM IST

Samantha Alia Bhatt: ఊ అంటావా అంటూ రెచ్చిపోయింది ఆలియా భట్. ఆ సమయంలో ఈ ఐటెమ్ సాంగ్ లో నటించిన సమంత పక్కనే ఉంది. జిగ్రా మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆలియా.. ఇలా మరోసారి తెలుగు పాట పాడి అలరించింది.

ఊ అంటావా పాట పాడిన ఆలియా భట్.. పక్కనే ఉన్న సమంత రియాక్షన్ చూడండి
ఊ అంటావా పాట పాడిన ఆలియా భట్.. పక్కనే ఉన్న సమంత రియాక్షన్ చూడండి

Samantha Alia Bhatt: ఆలియా భట్ ఓ మల్టీ టాలెంటెడ్ నటి. నటనతోపాటు పాటలు కూడా బాగా పాడగలదు. తన సినిమాల్లో కొన్ని సాంగ్స్ పాడింది. అయితే ఆమె ఈ మధ్య తెలుగులోనూ అలవోకగా పాటలు పాడేస్తూ ఆశ్చర్య పరుస్తోంది. తాజాగా తన నెక్ట్స్ మూవీ జిగ్రా ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన ఆలియా.. పుష్ప 1 మూవీలోని ఊ అంటావా పాట పాడింది.

yearly horoscope entry point

ఆలియా నోట ఊ అంటావా..

బాలీవుడ్ నటి ఆలియా భట్ తన నెక్ట్స్ మూవీ జిగ్రా ప్రమోషన్లలో బిజీగా ఉంటోంది. తాజాగా ఈ సినిమా ఈవెంట్ కోసం మంగళవారం (అక్టోబర్ 8) హైదరాబాద్ కూడా వచ్చింది. ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి సమంత, రానా కూడా ఈ ఈవెంట్ కు వచ్చారు. ఈ సందర్భంగా పుష్ప 1లో సామ్ చేసిన ఐటెమ్ సాంగ్ ఊ అంటావా పాట పాడింది ఆలియా భట్.

సిగ్గు పడుతూనే తెలుగులో ఆమె ఈ పాట పాడగా.. పక్కనే ఉన్న సమంత పెద్దగా నవ్వుతూ ఆమెను హగ్ చేసుకుంది. ఈ ఈవెంట్ ను హోస్ట్ చేసిన సుమ కూడా బాగా శృతిలో పాడావంటూ ఆలియాను మెచ్చుకుంది. అటు రానా కూడా అదిరిపోయిందని అన్నాడు. ఆలియా ఈ పాట పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చుట్టమల్లే పాట కూడా..

నిజానికి ఆలియా ఓ తెలుగు పాట ఇదే తొలిసారి కాదు. ఈ మధ్యే దేవర మూవీ ప్రమోషన్లలోనూ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి కరణ్ జోహార్ ఏర్పాటు చేసిన టాక్ లో పాల్గొన్న ఆలియా.. అక్కడ చుట్టమల్లే పాట పాడింది. దేవర కా జిగ్రా అంటూ రెండు సినిమాల ప్రమోషన్లనూ కరణ్ నిర్వహించాడు. ఆలియా పాట విని వావ్ అంటూ తారక్ మెచ్చుకున్నాడు.

ఇక తెలుగులోనూ రిలీజ్ కాబోతున్న జిగ్రా మూవీ ప్రమోషన్ల కోసం ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఊ అంటావా అని రెచ్చిపోయింది. ఈ సందర్భంగా సమంతపైనా ప్రశంసల వర్షం కురిపించింది. "నా డియరెస్ట్ సమంత, స్క్రీన్ పైన, బయట కూడా నువ్వో హీరో. నీ టాలెంట్ నాకు బాగా నచ్చుతుంది. నీకున్న బలం, దృఢత్వం కూడా నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

పురుషుల ప్రపంచంలో ఓ మహిళ రాణించడం సులువు కాదు. కానీ నువ్వా హద్దులు చెరిపేశావ్. నీ కాళ్లపై నువ్వు నిలబడ్డావ్" అని ఆలియా పొగిడింది. ఈ ఈవెంట్ కు రావడానికి కేవలం 6.5 సెకన్లలోనే సమంత ఓకే చెప్పిందని కూడా ఆమె వెల్లడించింది.

ఈ ఈవెంట్ కు టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వచ్చాడు. ఈ సందర్భంగా సమంత, తనతో కలిసి ఓ సినిమా చేయాలని ఆలియా అతన్ని అడిగింది. నటీమణులు పోటీ పడుతుంటారని అనుకుంటారని, కానీ తన సినిమాను ఓ పాన్ ఇండియా స్టార్ ప్రమోట్ చేయడానికి రావడం, తన గురించి మంచి మాటలు చెప్పడం చాలా ఆనందంగా ఉందని ఆలియా చెప్పింది. జిగ్రా మూవీ ఈ శుక్రవారం (అక్టోబర్ 11) థియేటర్లలో రిలీజ్ కానుంది.

Whats_app_banner