Alia Bhatt deepfake video: ఆలియానూ వదల్లేదు.. వైరల్ అవుతున్న డీప్‌ఫేక్ వీడియో
Alia Bhatt deepfake video: డీప్‌ఫేక్ వీడియో ఆలియా భట్ నూ వదల్లేదు. రష్మిక మందన్నా, కత్రినా కైఫ్, కాజోల్ తర్వాత ఇప్పుడు ఆలియాకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతోంది.
Alia Bhatt deepfake video: డీప్ ఫేక్ టెక్నాలజీ సెలబ్రిటీలకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా బాలీవుడ్ నటి ఆలియా భట్ ను కూడా ఎంతో అసభ్యంగా చూపిస్తూ ఓ నకిలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరో మహిళ కెమెరా ముందు ఎంతో అసభ్యమైన పోజులు ఇస్తుండగా.. ఈ డీప్ ఫేక్ వీడియోలో ఆ మహిళ స్థానంలో ఆలియా ముఖాన్ని మార్ఫింగ్ చేశారు.
రష్మిక మందన్నా, కత్రినా కైఫ్, కాజోల్ లు కూడా గతంలో ఈ డీప్ ఫేక్ వీడియోలకు బలైన విషయం తెలిసిందే. తాజాగా ఆలియా భట్ కు సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ కాగానే.. ఇదీ డీప్ ఫేక్ అని, అసలు వీడియో ఇదీ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ వీడియోలో కెమెరా ముందు ఎంతో అసభ్యకరమైన హావభావాలు ప్రదర్శించడం చూడొచ్చు.
ఇలాంటి అసభ్యకరమైన ఫొటోలు, వీడియోల్లోని వారికి డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా సెలబ్రిటీల ముఖాలను కొందరు వాళ్ల పరువు తీస్తున్నారు. మొదట దీనికి బలైంది రష్మిక మందన్నా. ఆ మధ్య ఆమె ఓ లిఫ్ట్ లో ఉన్న వీడియో వైరల్ కాగా.. దీనికి ప్రముఖులంతా ఖండించారు. అప్పటి నుంచీ ఈ డీప్ ఫేక్ వీడియో గురించి అభిమానులకు తెలిసి వచ్చింది.
తర్వాత కూడా కత్రినా కైఫ్, కాజోల్ లాంటి హీరోయిన్లను కూడా ఇలాగే అసభ్యంగా చూపించే ప్రయత్నం చేశారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని సెలబ్రిటీలు డిమాండ్ చేస్తున్నా.. డీప్ ఫేక్ వీడియోలు వస్తూనే ఉన్నాయి. తాజా వీడియో నిజంగానే ఆలియా భట్ దే అనిపించేలా ఉండటం గమనార్హం. ఆ మధ్య ప్రధాని నరేంద్ర మోదీ కూడా దీని బారిన పడ్డారు.
తాను ఓ పాట పాడుతున్నట్లుగా ఎవరో వీడియో క్రియేట్ చేశారని ఆయన చెప్పారు. గతంలో ఈ వీడియోపై అసహనం వ్యక్తం చేసిన రష్మిక మందన్నా.. సోషల్ మీడియా ద్వారా తన బాధను వెల్లగక్కుతూ సైబరాబాద్ పోలీస్, మహారాష్ట్ర సైబర్ సెల్ లను కూడా ట్యాగ్ చేసింది. అయినా దీనిపై ఇప్పటి వరకూ పెద్దగా చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు.