Aha OTT The Massiest Superhero: దెబ్బకు థింకింగ్ మారి తీరాల.. ఆహాలోకి వస్తున్న మాస్ సూపర్‌హీరో.. కొత్త సీజన్ స్టార్ట్
Aha OTT The Massiest Superhero: దెబ్బకు థింకింగ్ మారి తీరాలా అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. అతని అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే కొత్త సీజన్ దసరా నాడు రాబోతోంది. మాసీయెస్ట హీరో వస్తున్నాడంటూ ఆహా ఓటీటీ టీజ్ చేసింది.
Aha OTT The Massiest Superhero: నందమూరి బాలకృష్ణ తన పాపులర్ సెలబ్రిటీ టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే కొత్త సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ఈ కొత్త సీజన్ గురించి ఆహా వీడియో ఓటీటీ శుక్రవారం (అక్టోబర్ 11) పరోక్షంగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మాసీయెస్ట్ హీరో రాబోతున్నాడంటూ సదరు ఓటీటీ ఓ పోస్ట్ చేసింది.
మాస్ సూపర్ హీరో వచ్చేస్తున్నాడు
ఆహా వీడియోలో నందమూరి బాలకృష్ణ చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే టాక్ షోకి ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో మనకు తెలుసు. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్ రెడీ అవుతోంది. దసరా సందర్భంగా కొత్త సీజన్ లాంచ్ చేయనున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తుండగా.. తాజాగా శుక్రవారం (అక్టోబర్ 11) ఆహా ఓటీటీ చేసిన ట్వీట్ దాదాపు ఇదే కన్ఫమ్ చేస్తోంది.
"మాస్ హీరోలని చూసి ఉంటారు.. సూపర్ హీరోలను చూసి ఉంటారు.. కానీ మాస్ సూపర్ హీరోని రేపు చూడబోతున్నారు. ఈసారి దెబ్బకి థింకింగ్ మారి తీరాల. ఆహాని చూస్తూనే ఉండండి" అనే క్యాప్షన్ తో ఆహా వీడియో ఈ ట్వీట్ చేసింది. ది మాసీయెస్ట్ సూపర్ హీరో రేపు వస్తున్నాడంటూ దీనికి ఓ పోస్టర్ యాడ్ చేసింది. అన్‌స్టాపబుల్ కొత్త సీజన్ భిన్నంగా ఉండబోతున్నట్లు ఆహా చేసిన ఈ పోస్టుతో స్పష్టమవుతోంది.
అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో
అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే కొత్త సీజన్ కు సంబంధించి కొన్నాళ్లుగా ఇంట్రెస్టింగ్ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ కొత్త సీజన్ కు సంబంధించిన షూటింగ్స్ వేగంగా పూర్తవుతున్నాయి. ఈ మధ్యే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఈ షోకి గెస్టుగా వచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అటు అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే నాలుగో సీజన్ సెట్ కు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ కొత్త సీజన్ తొలి ఎపిసోడ్ కు గెస్ట్ ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఇప్పటికే ఈ షో మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రముఖ సెలబ్రిటీలు ఈ షోకి వచ్చి బాలయ్య బాబుతో ముచ్చటించడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ కొత్త సీజన్లో మరింత మంది సెలబ్రిటీలతోపాటు మూవీ ప్రమోషన్లు కూడా జరగనున్నాయి.
గత సీజన్స్‌లో టాక్ షోకు గెస్ట్‌లుగా ఎక్కువగా టాలీవుడ్ స్టార్స్ వచ్చారు. నెక్స్ట్ సీజన్‌ను పాన్ ఇండియన్ స్టార్స్‌తో స్పెషల్‌గా ప్లాన్ చేస్తోన్నట్లు సమాచారం. టాలీవుడ్ హీరోలతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, సాండల్‌వుడ్ హీరోలు ఈ టాక్ షోలో సందడి చేస్తారని సమాచారం.
ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 109వ మూవీ ఇది. ఈ మూవీలో యానిమల్ ఫేమ్ బాడీ డియోల్ విలన్‌గా నటిస్తోన్నాడు.
బాబీ మూవీ తర్వాత మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఆవేశం సినిమాను తెలుగులోకి బాలకృష్ణ రీమేక్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయనున్నట్లు సమాచారం.