Aha OTT Dasara Movies: దసరా రోజు ఆహా ఓటీటీలోని ఈ టాప్ 5 మూవీస్ చూసేయండి.. క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, డ్రామా జానర్ మూవీస్-aha ott dasara movies 35 chinna katha kadu gorre puranam vey dharuvey balu gani talkies maruthinagar subramanyam ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aha Ott Dasara Movies: దసరా రోజు ఆహా ఓటీటీలోని ఈ టాప్ 5 మూవీస్ చూసేయండి.. క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, డ్రామా జానర్ మూవీస్

Aha OTT Dasara Movies: దసరా రోజు ఆహా ఓటీటీలోని ఈ టాప్ 5 మూవీస్ చూసేయండి.. క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, డ్రామా జానర్ మూవీస్

Hari Prasad S HT Telugu

Aha OTT Dasara Movies: దసరా రోజు మిమ్మల్ని అలరించడానికి వివిధ ఓటీటీల్లో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ సిద్ధంగా ఉన్నాయి. అయితే ఆహా వీడియో ఓటీటీలోని ఈ టాప్ 5 మూవీస్ మాత్రం మిస్ కాకుండా చూడండి. పండుగ రోజు మీకు ఫుల్ టైంపాస్ అవుతుంది.

దసరా రోజు ఆహా ఓటీటీలోని ఈ టాప్ 5 మూవీస్ చూసేయండి.. క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, డ్రామా జానర్ మూవీస్

Aha OTT Dasara Movies: దసరా సందర్భంగా థియేటర్లలోనే కాదు ఓటీటీల్లోనూ సినిమాల జాతర ఉంది. ప్రేక్షకుల కోసం ఆహా వీడియో ఓటీటీ ప్రత్యేకంగా ఓ మూవీస్ వాచ్ లిస్ట్ రెడీ చేసి ఉంచింది. ఈ మధ్యే ఈ ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాల్లో కామెడీ, డ్రామా, క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీస్ ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఓసారి చూసేయండి.

ఆహా ఓటీటీ దసరా మూవీస్

ఆహా వీడియో ఓటీటీలో పండుగ రోజు చూడటానికి ఐదు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో నాలుగు థియేటర్లలో రిలీజై ఈ మధ్యే స్ట్రీమింగ్ కు రాగా.. ఒకటి నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైకే వచ్చింది.

వెయ్ దరువెయ్

ఆహా ఓటీటీలోకి శుక్రవారమే (అక్టోబర్ 11) ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. ఈ మూవీ పేరు వెయ్ దరువెయ్. ఎప్పుడో మార్చిలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఏడు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. సాయిరాం శంకర్, సునీల్, పోసాని కృష్ణమురళీలాంటి వాళ్లు నటించిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

35 చిన్న కథ కాదు

గత నెలలో థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన సినిమా 35 చిన్న కథ కాదు. నివేదా థామస్, ప్రియదర్శి నటించిన ఈ కామెడీ మూవీ కొన్ని రోజుల కిందటే ఆహా వీడియోలోకి వచ్చింది. ఓటీటీలోనూ ఈ సినిమాను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. దసరా రోజు ఫ్యామిలీతో కలిసి చూడదగిన మూవీ ఇది.

గొర్రె పురాణం

సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ గొర్రె పురాణం. ఓ గొర్రె రెండు మతాల మధ్య ఎలా చిచ్చు పెట్టిందన్నది ఈ కామెడీ, ఎమోషనల్ డ్రామాలో చూడొచ్చు. భిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సుహాస్.. గొర్రె పురాణంతో మరోసారి తెలుగు వారిని ఆకట్టుకున్నాడు.

బాలు గాని టాకీస్

బాలు గాని టాకీస్ నేరుగా ఆహా వీడియోలోనే రిలీజైన కామెడీ మూవీ. అక్టోబర్ 4 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని కూడా దసరా రోజు మీ వాచ్ లిస్టులో చేర్చుకోవచ్చు.

మారుతీనగర్ సుబ్రమణ్యం

సీనియర్ నటుడు రావు రమేష్ లీడ్ రోల్లో నటించిన మరో కామెడీ మూవీ మారుతీనగర్ సుబ్రమణ్యం. థియేటర్లలో ఓ మోస్తరు సక్సెస్ అయిన ఈ సినిమా కొన్ని రోజుల కిందట ఆహా ఓటీటీలోకి వచ్చింది.

దసరా పండుగ అయిన శనివారం (అక్టోబర్ 12) రోజు ఆహా ఓటీటీలోనే కాదు.. వివిధ ఓటీటీల్లో పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా థియేటర్లలో వేట్టయన్, మా నాన్న సూపర్ హీరో, జనక అయితే గనకలాంటి సినిమాలు రిలీజయ్యాయి.