Unstoppable with NBK: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 స్ట్రీమింగ్ డేట్ ఇదే.. బాలయ్య బాబు వచ్చేస్తున్నాడు-unstoppable with nbk season 4 to stream from october 24th on aha video ott balakrishna talk show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Unstoppable With Nbk: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 స్ట్రీమింగ్ డేట్ ఇదే.. బాలయ్య బాబు వచ్చేస్తున్నాడు

Unstoppable with NBK: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 స్ట్రీమింగ్ డేట్ ఇదే.. బాలయ్య బాబు వచ్చేస్తున్నాడు

Hari Prasad S HT Telugu
Oct 01, 2024 08:57 PM IST

Unstoppable with NBK: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే కొత్త సీజన్ రాబోతోంది. ఇప్పటికే మూడు సీజన్ల పాటు ప్రేక్షకులను బాగా అలరించిన ఈ సెలబ్రిటీ టాక్ షోతో బాలకృష్ణ మరోసారి రానున్నాడు. ఈసారి మరింత మంది సెలబ్రిటీలతో షో ఆసక్తికరంగా సాగనుంది.

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 స్ట్రీమింగ్ డేట్ ఇదే.. బాలయ్య బాబు వచ్చేస్తున్నాడు
అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 స్ట్రీమింగ్ డేట్ ఇదే.. బాలయ్య బాబు వచ్చేస్తున్నాడు

Unstoppable with NBK: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో ఆహా వీడియోలో ఎంతటి సక్సెస్ సాధించిందో తెలుసు కదా. ఆ షో మూడు సీజన్ల పాటు సదరు ఓటీటీ టాప్ ట్రెండింగ్స్ లో ఎప్పుడూ తొలి స్థానంలోనే ఉండేది. టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఈ షో నాలుగో సీజన్ ను ఆహా వీడియో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే స్ట్రీమింగ్ డేట్

బాలకృష్ణ హోస్ట్ చేసే అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో అక్టోబర్ 24 నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త సీజన్ కు సంబంధించిన షూటింగ్స్ వేగంగా పూర్తవుతున్నాయి. ఈ మధ్యే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఈ షోకి గెస్టుగా వచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అటు అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే నాలుగో సీజన్ సెట్ కు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ కొత్త సీజన్ తొలి ఎపిసోడ్ కు గెస్ట్ ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఇప్పటికే ఈ షో మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రముఖ సెలబ్రిటీలు ఈ షోకి వచ్చి బాలయ్య బాబుతో ముచ్చటించడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ కొత్త సీజన్లో మరింత మంది సెలబ్రిటీలతోపాటు మూవీ ప్రమోషన్లు కూడా జరగనున్నాయి.

కొత్త సీజన్ మరింత కొత్తగా..

గ‌త సీజ‌న్స్‌లో టాక్ షోకు గెస్ట్‌లుగా ఎక్కువ‌గా టాలీవుడ్ స్టార్స్ వ‌చ్చారు. నెక్స్ట్ సీజ‌న్‌ను పాన్ ఇండియ‌న్ స్టార్స్‌తో స్పెష‌ల్‌గా ప్లాన్ చేస్తోన్న‌ట్లు స‌మాచారం. టాలీవుడ్ హీరోల‌తో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్, మాలీవుడ్‌, సాండ‌ల్‌వుడ్‌ హీరోలు ఈ టాక్ షోలో సంద‌డి చేస్తార‌ని స‌మాచారం.

సీజ‌న్ 1కు కేవ‌లం టాలీవుడ్ హీరోహీరోయిన్లు మాత్ర‌మే గెస్ట్‌లుగా వ‌చ్చారు. సీజ‌న్ 2లో సినిమా సెల‌బ్రిటీల‌తో పాటు చంద్ర‌బాబునాయుడు, కిర‌ణ్ కుమార్ రెడ్డి వంటి పొలిటీషియ‌న్లు అన్‌స్టాప‌బుల్ టాక్ షోలో పాల్గొన్నారు. అన్‌స్టాప‌బుల్ లిమిటెడ్ ఎడిష‌న్ పేరుతో గ‌త ఏడాది ఓ షో ప్రారంభ‌మైంది. కేవ‌లం రెండు ఎపిసోడ్స్‌తోనే ఈ షోకు ముగింపు ప‌లికారు.

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తోన్నాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 109వ మూవీ ఇది. ఈ మూవీలో యానిమ‌ల్ ఫేమ్ బాడీ డియోల్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు.

బాబీ మూవీ త‌ర్వాత మ‌ల‌యాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఆవేశం సినిమాను తెలుగులోకి బాల‌కృష్ణ రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్రొడ్యూస్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

Whats_app_banner