Abhinav Gomatam: హీరోగా అభిన‌వ్ గోమ‌టం సెకండ్ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్‌ - మై డియ‌ర్ దొంగ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?-abhinav gomatam shalini kondepudi my dear donga to premiere on aha ott soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Abhinav Gomatam Shalini Kondepudi My Dear Donga To Premiere On Aha Ott Soon

Abhinav Gomatam: హీరోగా అభిన‌వ్ గోమ‌టం సెకండ్ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్‌ - మై డియ‌ర్ దొంగ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Mar 05, 2024 11:36 AM IST

Abhinav Gomatam: అభిన‌వ్ గోమ‌టం హీరోగా న‌టిస్తోన్న మై డియ‌ర్ దొంగ మూవీ డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో షాలిని కొండెపూడి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

మై డియ‌ర్ దొంగ మూవీ
మై డియ‌ర్ దొంగ మూవీ

Abhinav Gomatam: మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీతో ఇటీవ‌లే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అభిన‌వ్ గోమ‌టం. ఫిబ్ర‌వ‌రి 23న ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఫ‌స్ట్ మూవీ రిలీజైన కొద్ది గ్యాప్‌లోనే హీరోగా సెకండ్ మూవీతో త్వ‌ర‌లోనే తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు అభిన‌వ్ గోమ‌టం. మై డియ‌ర్ దొంగ పేరుతో ఓ మూవీ చేస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు బి.ఎస్ స‌ర్వ‌జ్ఞ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. షాలిని కొండెపూడి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఆహా ఓటీటీలో...

మై డియ‌ర్ దొంగ మూవీ థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. మార్చి 15 లేదా 22 నుంచి మై డియ‌ర్ దొంగ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

టీజ‌ర్ రిలీజ్‌...

మై డియ‌ర్ దొంగ టీజ‌ర్‌ను ఇటీవ‌ల రిలీజ్ చేశారు. ఈ టీజ‌ర్‌లో త‌న కామెడీ టైమింగ్‌తో అభిన‌వ్ గోమ‌టం ఆక‌ట్టుకుంటున్నాడు. ఓ అమ్మాయి ఇంట్లోకి దొంగ‌త‌నం చేయ‌డానికి వ‌చ్చిన యువ‌కుడు అనుకోని ప‌రిస్థితుల్లో అక్క‌డే బందీగా చిక్కుకుపోతే ఏం జ‌రిగింది? దొంగ‌కు, యువ‌తికి మ‌ధ్య ఏర్ప‌డిన స్నేహం ఎలాంటి మ‌లుపులు తిరిగింది అనే అంశాల‌తో టీజ‌ర్ ఫ‌న్నీగా ఉంది. దొంగ‌ను దొంగ‌ అన‌క‌పోతే సందీప్ రెడ్డి వంగా అన‌లా అనే డైలాగ్ టీజ‌ర్‌కు హైలైట్‌గా ఉంది.

షాలిని కొండెపూడి క‌థ‌...

డై డియ‌ర్ దొంగ‌లో హీరోయిన్‌గా న‌టిస్తూనే ఈ సినిమాకు క‌థ‌ను అందించింది షాలిని కొండెపూడి. కామెడీతో పాటు ఈ సినిమాలో అంత‌ర్లీనంగా స్త్రీ సాధికార‌త‌ను తెలియ‌జేసే మంచి మెసేజ్ ఉంటుంద‌ని స‌మాచారం. ఈ వెబ్ ఒరిజినల్‌ మూవీని ఆహా, కేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి.

మై డియ‌ర్ దొంగ మూవీలో అభినవ్ గోమటం, షాలిని కొండెపూడిలతో పాటు దివ్య శ్రీపాద ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. చూసీచూడంగానే మూవీతో హీరోయిన్‌గా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది షాలిని కొండెపూడి. జ‌య‌మ్మ పంచాయితీ ఓ కీల‌క పాత్ర పోషించింది. ప్ర‌స్తుతం సుహాస్‌తో కేబుల్ రెడ్డి అనే సినిమా చేస్తోంది.

మ‌ళ్లీ రావాతో...

సుమంత్ హీరోగా న‌టించిన మ‌ళ్లీరావా మూవీతో న‌టుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు అభిన‌వ్ గోమ‌టం. త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాలో కౌశిక్ పాత్ర‌లో తెలుగు ప్రేక్ష‌కుల్ని త‌న కామెడీతో అల‌రించాడు. విరూపాక్ష‌, మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టితో తెలుగులో ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌లో క‌మెడియ‌న్‌గా క‌నిపించాడు. మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీలో హీరోగా అభిన‌వ్ యాక్టింగ్‌, కామెడీ బాగున్నాయ‌నే ప్ర‌శంస‌లు ద‌చ్చాయి.

డిస్నీ హాట్ స్టార్‌లో...

సేవ్ ది టైగ‌ర్స్ వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు అభిన‌వ్ గోమ‌టం. గ‌త ఏడాది రిలీజైన సీజ‌న్ 1న తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. సీజ‌న్ 2 మార్చ 15 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.

WhatsApp channel

టాపిక్