Aashram season 4 ott release: ఆశ్రమ్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడు.. ఇదీ లేటెస్ట్ అప్డేట్-aashram web series season 4 ott release date animal villain bobby deol starrer series new season to come this year ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Aashram Web Series Season 4 Ott Release Date Animal Villain Bobby Deol Starrer Series New Season To Come This Year

Aashram season 4 ott release: ఆశ్రమ్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడు.. ఇదీ లేటెస్ట్ అప్డేట్

Hari Prasad S HT Telugu
Mar 26, 2024 04:01 PM IST

Aashram season 4 ott release: యానిమల్ మూవీ విలన్ బాబీ డియోల్ నటించిన ఆశ్రమ్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ ఈ ఏడాది ఓటీటీలోకి వస్తుందా? దీనిపై ఆ సిరీస్ లో కీలకపాత్ర పోషించిన చందన్ రాయ్ సన్యాల్ స్పందించాడు.

ఆశ్రమ్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడు.. ఇదీ లేటెస్ట్ అప్డేట్
ఆశ్రమ్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడు.. ఇదీ లేటెస్ట్ అప్డేట్

Aashram season 4 ott release: దొంగ బాబాలు, ఆశ్రమాల పేరుతో వాళ్లు చేసే అకృత్యాలపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ కోవలోకి చెందినదే ఈ ఆశ్రమ్ వెబ్ సిరీస్. ఎంఎక్స్ ప్లేయర్ (MX Player) ఓటీటీ రూపొందించిన ఈ సిరీస్ ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. యానిమల్ మూవీ విలన్ బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ నాలుగో సీజన్ ఈ ఏడాది వస్తుందా లేదా అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది.

ఆశ్రమ్ నాలుగో సీజన్ ఎప్పుడు వస్తుందంటే..

ఆశ్రమ్ వెబ్ సిరీస్ లో బాబీ డియోల్ లీడ్ రోల్లో నటించాడు. ఇందులో అతడు మాంటీ సింగ్ అలియాస్ కాశీపూర్ వాలే బాబా నిరాళాగా నటించాడు. ఆశ్రమం పేరుతో డ్రగ్స్ దందా నడిపించడం, అమ్మాయిలను అనుభవించడంలాంటి పనులు చేసే దొంగ బాబాగా బాబీ డియోల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పటికే మూడు సీజన్లు రాగా.. అన్నీ ప్రేక్షకులను బాగా మెప్పించాయి.

నాలుగో సీజన్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. 2024లోనే కొత్త సీజన్ రాబోతోందని కొన్నాళ్లుగా వార్తలు వస్తుండగా.. ఇప్పుడు ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలో కనిపించిన చందన్ రాయ్ సన్యాల్ దీనిపై స్పందించాడు. అతడు ఈ ఆశ్రమ్ వెబ్ సిరీస్ లో బొప్పా స్వామి అనే బాబా రైట్ హ్యాండ్ పాత్రలో నటించాడు. అతడు ఈ ఏడాది ఆశ్రమ్ 4 రిలీజయ్యే అవకాశాలు ఉన్నట్లు చెప్పాడు.

ఆశ్రమ్ 4 ఎప్పుడంటే?

ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చందన్ రాయ్ ఈ ఆశ్రమ్ కొత్త సీజన్ పై మాట్లాడాడు. "ప్రతి ఒక్కరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఈ ఏడాది నాలుగో సీజన్ వస్తుందని అనుకుంటున్నాను. దానికోసం అంతా సిద్ధంగా ఉంది. ఇంకా కాస్త షూటింగ్ పెండింగ్ లో ఉంది. స్క్రిప్ట్ వర్క్ కూడా నడుస్తోంది" అని చందన్ తెలిపాడు. 2020లో ఆశ్రమ్ తొలి సీజన్ వచ్చింది.

ఆశ్రమ్ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని ఈ సందర్భంగా చందన్ చెప్పాడు. "ఆశ్రమ్ షో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైంది. ఓ ఆటో నడిపే వ్యక్తి నుంచి సీఆర్పీఎఫ్ గార్డ్, సెక్యూరిటీ గార్డ్, ఎయిర్ హోస్టెస్, ముంబై నానావతి హాస్పిటల్లోని పెద్ద సర్జన్ వరకు అందరికీ దగ్గరైంది. వాళ్లందరూ జప్‌నామ్ చేస్తున్నారు. ప్రకాశ్ ఈ షో చేసిన తీరు దీనిని ఎక్కడికో తీసుకెళ్లింది" అని అన్నాడు.

ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఓ పేరు సంపాదించుకున్న బాబీ డియోల్ ఆశ్రమ్ వెబ్ సిరీస్ లో నెగటివ్ పాత్రలోనూ ఇరగదీశాడు. ఈ మధ్యే యానిమల్ మూవీలోనూ అతడు పోషించిన విలనీకి మెచ్చి పలు అవార్డులు అతన్ని వరించాయి. ఇప్పుడు మరోసారి బాబా నిరాళా పాత్రలో బాబీని చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ ఆశ్రమ్ వెబ్ సిరీస్ లో బాబీ డియోల్, చందన్ రాయ్ సన్యాల్ తోపాటు ఈషా గుప్తా, దర్శన్ కుమార్, త్రిదా చౌదరి, అదితి పోహంకర్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ప్రకాశ్ ఝా ఈ సిరీస్ ను నిర్మించి డైరెక్ట్ చేశాడు. 2020లోనే ఆశ్రమ్ రెండు సీజన్లు రిలీజ్ కాగా.. 2022లో మూడో సీజన్ వచ్చింది. రెండేళ్లుగా నాలుగో సీజన్ కోసం ప్రేక్షకులు వేచి చూస్తున్నారు.

IPL_Entry_Point