Kangana Ranaut: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‍కు ఎంపీ టికెట్ ఖరారు.. నియోజకవర్గం ఇదే.. పార్టీలో చేరినట్టు ట్వీట్-bollywood actress kangana ranaut gets bjp mp tickets she will contest from mandi lok sabha in himachal pradesh ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kangana Ranaut: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‍కు ఎంపీ టికెట్ ఖరారు.. నియోజకవర్గం ఇదే.. పార్టీలో చేరినట్టు ట్వీట్

Kangana Ranaut: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‍కు ఎంపీ టికెట్ ఖరారు.. నియోజకవర్గం ఇదే.. పార్టీలో చేరినట్టు ట్వీట్

Published Mar 24, 2024 10:19 PM IST Chatakonda Krishna Prakash
Published Mar 24, 2024 10:19 PM IST

  • Kangana Ranaut: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‍ అధికారికంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. భారతీయ జనతా పార్టీ (BJP) ఆమెకు లోక్‍సభ ఎంపీ సీటు ఖరారు చేసింది. నేడు (మార్చి 24) ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది.

బాలీవుడ్ ప్రముఖ నటి, హీరోయిన్ కంగనా రనౌత్.. రాజకీయ రంగంలో పోరాడేందుకు సిద్ధమయ్యారు. తాను అధికార భారతీయ జనతా పార్టీ(BJP)లో చేరినట్టు నేడు ఆమె (మార్చి 24) అధికారికంగా ప్రకటించారు. 

(1 / 5)

(Instagram)

కంగనా రనౌత్‍కు లోక్‍సభ ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ. హిమాచల్ ప్రదేశ్‍లోని మండీ లోక్‍సభ స్థానం నుంచి ఆమె పోటీకి దిగనున్నారు.

(2 / 5)

లోక్‍సభ ఎన్నికల కోసం 5వ అభ్యర్థుల జాబితాను బీజేపీ నేడు వెల్లడించింది. దీంట్లో కంగనా రనౌత్ పేరు ఉంది. హిమాచల్ ప్రదేశ్‍లోని మండీ సీటును ఆమెకు కేటాయించింది అధికార కాషాయ పార్టీ. 

(3 / 5)

తాను మొదటి నుంచి బీజేపీకి బేషరతుగా మద్దుతునిస్తూనే ఉన్నానని కంగన రనౌత్ నేడు ట్వీట్ చేశారు. తాను జన్మించిన హిమాచల్‍ ప్రదేశ్‍లోని మండీ లోక్‍సభ నియోజకవర్గానికి తనను అభ్యర్థిగా బీజేపీ అగ్రనాయకత్వం ప్రకటించిందని ఆమె పేర్కొన్నారు. 

(4 / 5)

బీజేపీ నాయకత్వం ఆదేశాలను అనుసరిస్తూ తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని కంగన రనౌత్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లోక్‍సభ ఎన్నికలు ఏడు దశలుగా ఏప్రిల్ 19 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‍లో చివరి దశలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. 

(5 / 5)

ఇతర గ్యాలరీలు