BJP TDP alliance : జగన్ని కాదని.. టీడీపీతో బీజేపీ ఎందుకు కలిసింది?- అమిత్ షా జవాబు ఇదే!
2024 Andhra Pradesh assembly elections : ఆంధ్ర సీఎం జనగ్ని కాదని.. టీడీపీతో బీజేపీ ఎందుకు పొత్తు కుదుర్చుకుంది? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు అమిత్ షా.
TDP BJP Janasena alliance : టీడీపీ- జనసేన- బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడటంతో.. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా కూటమి పని చేస్తోంది. అయితే.. గతంలో విడిపోయిన టీడీపీ- బీజేపీలు మళ్లీ ఎందుకు కలిశాయి? టీడీపీతో కలవాలని బీజేపీ ఎందుకు నిర్ణయించుకుంది? సీఎం జగన్ మోహన్ రెడ్డిని కాదని.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి ముందుకు వెళ్లాలని కమలదళం ఎందుకు నిర్ణయించుకుంది? వంటి ప్రశ్నలకు తాజాగా సమాధానం ఇచ్చారు కేంద్రమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా.
'చంద్రబాబుతో మళ్లీ కలవడానికి అదే కారణం..'
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తున్నట్టు, సీట్ల సద్దుబాటు కూడా ముగిసినట్టు.. ఇటీవలే ప్రకటించింది టీడీపీ- బీజేపీ- జనసేన కూటమి. శుక్రవారం జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్ని అమిత్ షా.. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులపై స్పందించారు. చంద్రబాబు నాయుడుతో మళ్లీ ఎందుకు కలిశామో చెప్పారు.
2024 Andhra Pradesh elections : "ఎన్డీఏని వదిలియేలాని మేము చంద్రబాబుకు చెప్పలేదు. ఆయనే నిర్ణయం తీసుకుని వెళ్లిపోయారు. ప్రజల్లోకి వెళ్లి, ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ విషయం తెలుసుకుని మళ్లీ మాతో కలిశారు. ఆయనకు మేము స్వాగతం పలికాము," అని అమిత్ షా అన్నారు.
అయితే.. జగన్ మోహన్ రెడ్డీ వైసీపీ కూడా.. అనేక విషయాల్లో బీజేపీకి, ఎన్డీఏకి ఇంత కాలం మద్దతు ఇస్తూ వచ్చింది. రాజ్యసభలో అనేక మార్లు ఎన్డీఏకి ఓటు వేసింది. మరి.. జగన్ని కాదని టీడీపీని బీజేపీ ఎందుకు ఎంచుకుంది? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు అమిత్ షా.
ఇదీ చూడండి:- TDP JSP Alliance 2024 : కాకరేపిన ‘పవన్’ ప్రకటన - పిఠాపురంలో ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులు
"పార్లమెంట్లో వేసే ఓట్లను, రాజకీయ పొత్తులతో కలపకూడదు. సమస్యను బట్టి.. పార్లమెంట్లో పార్టీలు ఓట్లు వేస్తాయి. తమకు నచ్చితే అనుకులంగా ఉంటాయి. లేదంటే వ్యతిరేకంగా ఓట్లు వేస్తాయి. వైసీపీ కూడా.. మూడు సందర్భాల్లో మాకు వ్యతిరకంగా ఓట్లు వేసింది. రాజకీయ పార్టీల మద్దతు ఆధారంగా పొత్తులు ఉండాలని నేను అనుకోను," అని అమిత్ షా స్పష్టం చేశారు.
Andhra Pradesh elections 2024 polls survey : ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా నిరసనల మధ్య.. 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.6ఏళ్ల తర్వాత.. మళ్లీ ఎన్డీఏలో చేరింది టీడీపీ. టీడీపీ- బీజేపీ- జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది చంద్రబాబు ధీమాగా ఉన్నారు.
TDP BJP Janasena alliance latest news : ఇక 175 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో.. టీడీపీ 144 స్థానాల్లో, పవన్ కల్యాణ్ జనసేన్ 21 చోట్ల, బీజేపీ 10 సీట్లల్లో పోటీ చేస్తాయి. 25 లోక్సభ సీట్లల్లో.. టీడీపీ 17 స్థానాల్లో బరిలో దిగుతుంది. పొత్తులో భాగంగా జనసేనకి 2, బీజేపీకి 6 సీట్లు దక్కాయి.
సంబంధిత కథనం