Kunamneni: కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేనిపై కేసు నమోదు… ఎంపిడీవో ఫిర్యాదుతో పాల్వంచలో కేసు నమోదు-case registered against cpi mla koonanneni of kothagudem case registered in palvancha on mpdo complaint ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Kunamneni: కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేనిపై కేసు నమోదు… ఎంపిడీవో ఫిర్యాదుతో పాల్వంచలో కేసు నమోదు

Kunamneni: కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేనిపై కేసు నమోదు… ఎంపిడీవో ఫిర్యాదుతో పాల్వంచలో కేసు నమోదు

HT Telugu Desk HT Telugu
Apr 17, 2024 09:13 AM IST

Kunamneni: ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించినందుకు ఖమ్మం జిల్లా సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై కేసు నమోదు చేశారు.

కూనంనేనిపై కేసు నమోదు
కూనంనేనిపై కేసు నమోదు

Kunamneni: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల  ప్రవర్తనా నియమావళిని MCC  Case ఉల్లంఘిన కారణంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై కేసు నమోదైంది. పాల్వంచ  ఎంపీడీవో Palvancha MPDO విజయ భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పాల్వంచ రూరల్ పోలీసులు కూనంనేని పై కేసు నమోదు చేశారు.

గత నెల 23వ తేదీన మండల పరిధిలోని పలు గ్రామ పంచాయతీల్లో కూనంనేని విస్తృతంగా పర్యటించి తన అనుచరులతో కలిసి సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆయా సమావేశాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఎన్నికల హామీలు ఇచ్చారనే అభియోగంపై స్థానిక బీఎస్పీ నాయకుడు యర్రా కామేష్ ఫిర్యాదు చేశారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆయన ప్రజలను ప్రభావితం చేసేలా ప్రసంగం చేశారని ఆరోపించారు. కూనంనేని ప్రసంగాలు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉద్వేగభరితంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మేరకు స్పందించిన ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూరల్ పోలీసులు 188, 171సీ సెక్టన్ల కింద కూనంనేనిపై కేసు నమోదు చేశారు. కూనంనేని సాంబశివరావు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి హోదాలో కొనసాగడంతో పాటు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానం నుంచి సీపీఐ పోటీ చేసింది. ఆ పార్టీ నుంచి అసెంబ్లీలో ఆయన ఏకైక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం.

(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రతినిధి)

Whats_app_banner

సంబంధిత కథనం